రివ్యూ

సాఫీగా.. ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాక్సీవాలా ** ఫర్వాలేదు

తారాగణం: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాత: ఎస్‌కెఎన్
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్
---------------------------------------------------------------------------------------------------------

అర్జున్‌రెడ్డి మానియా టాలీవుడ్‌ను వదల్లేదు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో -రౌడీగ్యాంగ్‌ని చూస్తే అర్థమవుతుంది. కానీ, విజయ్ మాత్రం ట్రాక్ మార్చి గీతగోవిందం చిత్రంతో ఫ్యామిలీ హిట్ అందుకున్నాడు. తాజాగా కామెడీ థ్రిల్లర్‌తో టాక్సీవాలా అవతారం ఎత్తాడు. కొత్త కొత్త జోనర్లతో వస్తున్న విజయ్, లెటెస్ట్ మూవీతో ఆడియన్స్‌ని భయపెట్టే అవతారమెత్తాడు. కొత్త దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్‌కెఎన్ నిర్మించిన టాక్సీవాలా థియేటర్లకు వచ్చింది. ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోయిన్లు. టాక్సీవాలా సర్వీసెస్ ఎలా ఉన్నాయి, హీరోయిజాన్ని చూపించేందుకు ఎన్ని కష్టాలు పడ్డాడో చూద్దాం.

కథ

శివ (విజయ్ దేవరకొండ) ఐదేళ్లు కష్టపడి పూర్తి చేస్తాడు. పట్టా పట్టుకుని జాబ్‌కోసం హైదరాబాద్ వస్తాడు. రకరకాల ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన శివ -చివరకు ఓ కారు కొనుక్కుని క్యాబ్ డ్రైవర్‌గా సెటిలవుతాడు. లైఫ్ పుర్సాద్‌గా సాగిపోతున్న హ్యాపీ టైంలో -కారులో కొన్ని నాటకీయ పరిణామాల చోటుచేసుకుంటాయి. వీటి కారణంగా శివ లైఫ్‌లో ఊహించని సంఘటనలు తలెత్తుతాయి. దాంతో కారుని వదిలించుకోవడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. ఆక్రమంలో కారు గురించి కొన్ని చేదు నిజాలు తెలుస్తాయి. అదే టైంలో ఆ కారులో ప్రయాణించిన ఓ డాక్టర్‌ను కారు అతి దారుణంగా చంపేస్తుంది. అసలు కారు అతన్ని ఎందుకు చంపింది? కారులో ఏముంది? ఫైనల్‌గా కారు ఎవరిపై రివేంజ్ తీర్చుకోవాలనుకుంది? ఈ మూడు ప్రశ్నల సమాధాన సమాహారమే మిగతా కథ..
అటు అర్జున్‌రెడ్డి, ఇటు గీత గోవిందంలో వైవిధ్యమైన వేరియేషన్స్ చూపించిన విజయ్ -క్యాబ్ డ్రైవర్‌గానూ సెటిల్డ్ టాలెంట్ చూపించాడు. ఓ ఆర్డినరీ కుర్రాడిగా కొత్తలుక్‌తో ఫ్రెష్ ఫీల్ కలిగించాడు. కొన్ని హార్రర్ సన్నివేశాల్లో తన నటనతో నవ్విస్తూనే.. మరోపక్క టెన్షన్ క్రియేట్ చేస్తూ సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కథానాయికగా నటించిన ప్రియాంక జవాల్కర్ జూనియర్ డాక్టర్ అను పాత్రలో కనిపించింది. సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్‌కి పెద్దగా స్క్రీన్ ప్రెజెన్స్ లేకున్నా.. తన నటనతో సినిమాలో హైలెట్‌గా నిలిచింది. నటుడు మధునందన్, అతని అసిస్టెంట్ తన కామెడీ టైమింగ్‌తో మ్యానరిజమ్స్‌తో నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులూ తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగాన్ని సమీక్షిస్తే, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాలో ఎస్‌కెఎన్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా అనిపించాయి. దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మంచి స్టోరీలైన్‌తోపాటు కామెడీ సన్నివేశాలతో ఎంటర్‌టైన్ చేయగలిగాడు. మంచి స్టోరీలైన్ తీసుకుని, కన్విన్స్ చేసిన విధానంలో కథను నడపడం బావుంది. కొన్నిచోట్ల సినిమాటిక్ బోర్‌నెస్ దర్శకుడి అనుభవరాహిత్యాన్ని తేటతెల్లం చేస్తుంది. విలన్ తాలూకు సన్నివేశాలకూ మరింత క్లారిటీ ఇచ్చివుంటే బాగుండేది. ముఖ్యంగా రవివర్మ పాత్ర ద్వారా కథను డీల్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాలి. సినిమా విషయంలో దర్శకుడు లవ్‌స్టోరీని మాత్రం ఆస్థాయిలో మలచలేకపోయాడు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా ఆసక్తి కలిగించలేకపోయాయి.
చక్కటి ట్రీట్‌మెంట్, మంచి కామెడీ సీన్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదువలేదు. చాలా సన్నివేశాల్లో శృతిమించిన నాటకీయత మూడ్‌ను దెబ్బతీసింది.

-వాసుశ్రీ