రివ్యూ

అమర్‌కు వైట్లవాష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమర్ అక్బర్ ఆంటోని * బాగోలేదు

తారాగణం: రవితేజ, ఇలియానా, షాయాజీ షిండే, తరుణ్ అరోరా, ఆదిత్యమీనన్, సునీల్, వెన్నెల కిషోర్
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: వెంకట్ సి దిలీప్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి
స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం: శ్రీను వైట్ల
==========================================================

వరుస పరాజయాల బాటలోవున్న దర్శకుడు శ్రీను వైట్ల తన ట్రబుల్ షూటర్ రవితేజతో మరోసారి భిన్నమైన ప్రయత్నం చేశాడు. గతంలో వెంకీ, దుబాయ్ శీనులాంటి హిట్లు అందించిన కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఈ ముగ్గురు ఎవరెవరు? ఏం చేశారు? ఎలా చేశారన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాలి.
అమర్ (రవితేజ) చిన్నతనంలోనే ఫ్యామిలీని కోల్పోతాడు. అతని కుటుంబం ఎంతో నమ్మి తమ సంస్థలో భాగస్వాములుగా చేసుకున్న వాళ్లే కుట్ర పన్ని అంతం చేస్తారు. ఓ హత్య చేసి జైలుకు వెళ్లిన అమర్, తిరిగొచ్చి తన కుటుంబాన్ని దూరం చేసినవాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడతాడు. అమెరికాలో వాటా అనే సాంస్కృతిక సమితికి కో-ఆర్డినేటర్‌గా వుండే ఐశ్వర్య (ఇలియానా)తో పరిచయం ఏర్పడుతుంది. అయితే అమర్‌కు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. తనకే తెలియకుండా చిత్ర విచిత్రంగా ముగ్గురు వ్యక్తుల్లా ప్రవర్తిస్తుంటాడు. ఇంతకీ అతడి సమస్య ఏమిటి? దీన్ని అధిగమించి తన శత్రువులను ఎలా అంతమొందించాడు అన్నది మిగతా కథ.
రవితేజ కొత్తగా కనిపించాడు. కానీ అతని టాలెంట్ చూపించే స్కోప్‌వున్న సన్నివేశాలు మిస్సయ్యాయి. అందుకే అనేకచోట్ల క్లూలెస్‌గా కనిపిస్తాడు రవితేజ. అతడిలో ఎప్పుడూ ఉండే ఎనర్జీ ఇందులో కనిపించలేదు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఏమాత్రం సెట్టవ్వలేదు. పాత్రలో వైరుధ్యం చూపించాల్సిన సన్నివేశాల్లో రవితేజ తేలిపోయాడు. ఇలియానా గ్లామర్‌గా కనిపించింది. నటనపరంగా ఓకే అనిపించుకుంది. విలన్లుగా ఒకరికి నలుగురు కనిపించారు కానీ ఎవ్వరూ ప్రత్యేకంగా తనదైన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఒక్క పాత్రనూ సరిగా తీర్చిదిద్దలేదు. ఎఫ్‌బిఐ ఆఫీసర్‌గా అభిమన్యు సింగ్ ఓవరాక్షన్ ఓ రేంజ్‌లో ఉంది. అతడి పాత్ర విసిగిస్తుంది. సత్య, వెనె్నల కిషోర్, సునీల్‌ల కామెడీ ఫర్వాలేదు. మిగతా నటీనటులంతా యావరేజ్. ఓ రేంజ్ వినోదాన్ని అందించిన దర్శకుడు శ్రీను వైట్ల ఒక దశ దాటాక అతడి బలమే బలహీనతగా మారిందేమో. తాను క్రియేట్ చేసుకున్న ఫార్మాట్ దాటి బయటికి రాలేక విసుగెత్తించేశాడు. రొటీన్ ప్రతీకార కథనే ఎంచుకుని, దాన్ని డిఫరెంట్ ట్రీట్‌మెంట్‌తో నడిపించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దాన్ని డీల్ చేయడంలో వైట్ల పూర్తిగా విఫలమయ్యాడు.
ఇక వంద సినిమాలను పూర్తిచేసిన తమన్ ఈ సినిమాకు పెద్దగా ఆకట్టుకునే మ్యూజిక్ ఇవ్వలేదు. నేపథ్య సంగీతం రొటీన్. వెంకట్ సి దిలీప్ ఛాయాగ్రహణం జస్ట్ ఓకె. సినిమాకు రిచ్ లుక్ తెచ్చాడు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఎక్కడా రాజీ లేకుండా సినిమాకు ఖర్చుపెట్టిన విషయం తెరపై కనిపించింది.
దర్శకుడు వైట్ల కొత్తగా ట్రై చేద్దామని చేసిన ప్రయత్నమిది. వర్కవుట్ కాలేదు. స్ప్లిట్ పర్సనాలిటీతో హీరో బాధపడటం ఎప్పుడో ‘అపరిచితుడు’ రోజుల్లోనే చూసిన పాయింట్. దీనికి కొంచెం భిన్నంగా డీల్ చేయాలని ప్రయత్నించి విఫలమైనట్టు అనిపించింది. రవితేజ క్యారెక్టర్లు మార్చుకుని చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటే కామెడీగా అనిపిస్తుంది తప్ప ఇంటెన్సిటీ ఇవ్వలేకపోయింది. అసలు కథలో ఎక్కడా ఈ పాయింట్ ఇమడక, ఏదో సెపరేట్ ట్రాక్ నడుస్తున్న ఫీల్ కలిగింది. ఎలా డీల్ చేయాలో తెలియని సందిగ్ధంలో కంగాళీ చేసేసినట్టే అనిపించింది. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్‌లో విక్రమ్‌లాంటి నటుడినుంచి పతాకస్థాయి పెర్‌ఫార్మెన్స్ చూశాక, రవితేజ సాధారణంగా అనిపిస్తాడు. రొటీన్ రివేంజ్ డ్రామా, కథలో తర్వాత ఏం జరుగుతుందనే ఎగ్జైట్‌మెంట్ కలగదు. ఫ్లాష్‌బ్యాక్‌ను రిపీట్ చేయడం చిరాకు తెప్పిస్తుంది.
ఎప్పట్లాగే కామెడీ బెటాలియన్ పెద్దగానే దించాడుకానీ ఎక్కడా పేలిపోయే కామెడీ లేదు. అక్కడక్కడా సత్య, వెన్నెల కిషోర్, సునీల్ కొంచెం నవ్వులు పంచారంతే. ఒకప్పటి వైట్లస్థాయి కామెడీకి అవకాశమే లేదు. సెటైర్లకు పెట్టింది పేరైన వైట్ల, ఈసారి అమెరికాలో తెలుగు సంఘాల మీద పంచులేయాలని చూశాడు. కానీ వర్కవుట్ కాలేదు. మొత్తంగా చూస్తే వైట్ల గత సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తుంది తప్ప అలరించదు.

-శ్రీనివాస్ ఆర్.రావ్