రివ్యూ

మాయచేసిన మైరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీహూ ** ఫర్వాలేదు

తారాగణం: మైరా విశ్వకర్మ, ప్రేరణా శర్మ
సంగీతం: విశాల్ ఖురానా
సినిమాటోగ్రఫీ: యోగేశ్ జైని
నిర్మాణం: ఆర్‌ఎస్‌వీపీ మూవీస్, రాయ్‌కపూర్ ఫిలింస్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వినోద్ కాప్రి
==========================================
ఒంటరితనం -ఒళ్లు గగుర్పొడిచే మాట ఇది. మనసులో వణుకు పుట్టించే ‘ఒంటరితనం’ ఇది. ఏ ఒక్కరికైనా జీవితంలో ఇటువంటి ‘ఒంటరితనం’ అలజడి కలిగించి ఉంటుంది. అదే ఓ రెండేళ్ల పాప విషయంలో జరిగితే...? ఆ ఊహే ఎంత బీభత్స భయానకంగా ఉంటుందో ఆలోచనలకి అందదు.
2014 -ఓ జాతీయ పత్రికలో ప్రచురితమైన వార్త. ఒక ఫ్లాట్‌లో నాలుగేళ్ల పాప ఒంటరిగా చిక్కుకుపోయింది. ఆ పాప సంగతి ఎవ్వరికీ తెలీదు. తర్వాత ఏం జరిగిందన్న ఇతివృత్తంతో నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వినోద్ కాప్రి ఓ ‘థ్రిల్లర్’ని అల్లుకొన్నాడు. పాప ప్రవర్తనని బట్టి మాటల్నిబట్టి ‘డైలాగ్స్’ రాసుకొన్నాడు. వినోద్ కాప్రికీ మైరా విశ్వకర్మ (పాప) తల్లిదండ్రులకు ఉన్న సత్సంబంధాల కారణంగా.. ఆ పాపతో నాలుగు నెలలపాటు మెలగి.. ఆ కుటుంబంలో ఒక సభ్యునిగా మారి -ఆ తర్వాత షూటింగ్ చేయటానికి సిద్ధమయ్యారు. రోజూ రెండు గంటలపాటు షూటింగ్. మూడు కెమెరాలు. ఏ ఒక్క సన్నివేశాన్నీ రీషూట్ చేయలేదు. సింగిల్ టేక్‌లో అన్నీ అయిపోయేవి. మైరా విశ్వకర్మ ప్రవర్తనని బట్టి స్క్రిప్ట్‌లో అక్కడక్కడా మార్పులు చేసుకోవటం మినహా. పోస్ట్ ప్రొడక్షన్‌లో కొన్ని అవాంతరాలు. 45 లక్షల ప్లాన్‌తో స్క్రీన్‌పైకి వస్తే.. ఒక నిర్మాత ‘కార్డియాక్ అరెస్ట్’ కారణంగా ప్రొడక్షన్ వాయిదా పడింది. ఏది ఏమైతేనేం -మైరా నటన వల్ల అనుకున్న దానికంటె ఎంతో విజయాన్ని సాధించింది. చిట్టచివరికి -గిన్నీస్‌బుక్‌లో ఎంట్రీకి సిద్ధపడింది యూనిట్.
ఇంత ఉపోద్ఘాతం ఇవ్వటానికి ఈ కథలో ఏముంది? రెండేళ్ల పాప నిద్ర లేచేప్పటికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. రాత్రి తన పుట్టినరోజు. వేడుకలన్నీ సద్దుమణిగి తెల్లారేసరికి -నాన్న కనిపించడు. అమ్మలో ఉలుకూ పలుకూ ఉండదు. ఆకలి వేస్తూంటుంది. ఉదయానే్న లేచింత్తర్వాత అమ్మ ఏం చేస్తుంది? పాలు కలుపుతుంది. వంట చేస్తుంది... ఇలా అన్ని పనులూ జ్ఞాపకం వస్తాయి. కానీ వంట ఎలా చేయాలో తెలీదు.
తరచూ గొడవ పడే తల్లిదండ్రులు కనిపించక పోవటం... తాను ఒంటరిగా ఉండిపోయానన్న ఊహ పాపని ఆందోళనకు గురి చేస్తుంది. ఐతే ఆ ఫ్లాట్‌లోంచి ఎలా బయట పడాలో తెలీదు. ఓవైపు ఆకలి.. మరోవైపు ఒంటరితనం. అలసట... నిద్ర -ఇవన్నీ కలవరపెడతాయి. పాప పీహూ ఒక్కత్తె ఫ్లాట్‌లో ఉందన్న సంగతి బయటి ప్రపంచానికి తెలీదు.
ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆలోచన ప్రేక్షకుల్ని సైతం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు పీహూకి ఏంకాకూడదని వేల దేవుళ్లకి మొక్కుకుంటాం. అనుక్షణం అటు వెళ్లొద్దు. ఇటు వెళ్లొద్దు. ఎక్కడికీ కదలొద్దు అంటూ మనకి మనమే హెచ్చరికలు చేస్తూంటాం. కొన్ని సన్నివేశాల్లోకి జొరబడి అప్రమత్తంగా ఉండాలంటూ మొత్తుకుంటాం. బొమ్మ కోసం పది అంతస్తుల మేడపై నుంచి దూకేందుకు ప్రయత్నించే పాపని గట్టిగా పట్టుకోవాలనుకుంటాం.
ఇలా -పీహూ రియాక్షన్స్.. డైలమాస్ -కన్‌ఫ్యూజన్స్ అన్నీ ప్రేక్షకుల్ని చుట్టుముడతాయి. ‘అమ్మ’ పాత్ర మనదే అవుతుంది. డాడీ పాత్రా మనదే అవుతుంది. ఒంటరి పరిస్థితుల్ని మనకి మనమే సరిదిద్దేందుకు చూస్తూంటాం.
స్క్రీన్‌పైకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లటంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడు. ప్రతి సన్నివేశం ఒళ్లు జలదరించేట్టు చేస్తుంది. ఈ సినిమా ప్రతీ తల్లిదండ్రులకు వచ్చే ‘పీడకల’ లాంటిదని ముందుగానే చెప్పినప్పటికీ.. దాన్ని జీర్ణించుకోటానికి అనుక్షణం తాపత్రయ పడతాం.
సినిమా అంతా మైరా విశ్వకర్మనే. రెండేళ్ల పాపతో సినిమా మొత్తాన్ని నడిపించిన ఘనత దర్శకుడు కొట్టేశాడు. మైరా తల్లిగా ప్రేరణ పరిధి కొద్దిమేరకే. మైరా తండ్రిని ఫొటోల్లోనే చూపిస్తారు. సంగీతం బాగుంది.

-బియన్కె