రివ్యూ

మిస్టరీ వీడింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుబ్రహ్మణ్యపురం ** ఫర్వాలేదు
**
నటీనటులు:సుమంత్, ఈషా రెబ్బా, సాయికుమార్, సురేష్, అమిత్ శర్మ
సంగీతం:శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్:ఆర్.కె.ప్రతాప్
ఎడిటర్:కార్తికేయ శ్రీనివాస్
నిర్మాత:బీరం సుధాకర్‌రెడ్డి
దర్శకత్వం:సంతోష్ జాగర్లపూడి
**
వరుస సినిమాల పరాజయాలతో కాస్త బ్రేక్ తీసుకున్న సుమంత్, తరువాత మళ్లీరావా అంటూ థ్రిల్లర్ జోనర్‌లో విజయాన్ని అందుకున్నాడు. అదే తరహాలో మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్‌గా సుబ్రహ్మ్యంపురం అంటూ ముందుకు వచ్చాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈషా రెబ్బ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) ఆర్కియాలజీ విద్యార్థి. దేవాలయాలు, వాటి చరిత్రను అధ్యయనం చేస్తుంటాడు. అలా ఓ అధ్యయనంలో భాగంగా సుబ్రమణ్యపురం వస్తాడు. అదే సందర్భంలో హీరోయిన్ ప్రియా (ఈషా రెబ్బ)ను ఇష్టపడతాడు. ప్రేమకోసం ఆమె వెంటపడుతూ సరదాగా ఆట పట్టిస్తుంటాడు. ఈ క్రమంలో మరోప్రక్క సుబ్రహ్మణ్యపురం గ్రామంలో ఊహించని రీతిలో ఆత్మహత్యలు జరుగుతుంటాయి. తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తరువాత అసలు సుబ్రహ్మణ్యపురంలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయ? సుబ్రహ్మణ్యస్వామి గుడి వెనుక వున్న రహస్యం ఏమిటి? అన్నది అధ్యయనం చేస్తూ, తన యుక్తితో కార్తీక్ అక్కడ జరుగుతున్న వరుస ఆత్మహత్యల వెనుక వున్న నిజాన్ని ఎలా బయటపెట్టాడు అనేది మిగతా కథ.
నాస్తికుడిగా ఆర్కియాలజీ స్టూడెంట్‌గా సుమంత్ చక్కని నటన కనబరిచాడు. కార్తీక్ పాత్రలో రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్‌తో సాగే ప్రేమ సన్నివేశాలోనూ సుమంత్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ పాత్ర చిన్నదే అయినా ఫర్వాలేదనిపించుకుకంది. ప్రియా పాత్రకి ఇంకాస్త ప్రాధాన్యత ఇచ్చి వుంటే బాగుండేది. హీరోయిన్ ఫాదర్‌గా నటించిన సురేష్ తన మార్క్ నటన చూపించాడు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో సురేష్ నటన ఆకట్టుకుంది. జోష్ రవి, భద్రం, డాక్టర్‌గా సాయికుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు సంతోష్ మంచి కానె్సప్టు తీసుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని తెరకెక్కించలేదు. సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల తాలూకు సన్నివేశాల్లో ఇంకాస్త ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసి వుంటే బాగుండేది. దర్శకుడు ఎంచుకున్న కథలో కార్తికేయ ఛాయలు కనపడ్డాయి. పాత్రధారులను చక్కగా కాస్ట్ చేసుకున్న డైరెక్టర్.. క్యారెక్టరైజేషన్స్‌లో కొత్తదనం మాత్రం మిస్ అయ్యాడు. అందువల్ల.. ఒక్క సుమంత్ పాత్రలో తప్ప ఎవరి పాత్ర వ్యవహారశైలిలోనూ క్లారిటీ ఉండదు. ఇక కథలోని ట్విస్టులను రివీల్ చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. అందువల్ల కథనం సాగుతున్న ఫీలింగ్ వుంటుంది. ముఖ్యంగా.. క్లైమాక్స్‌ను డీల్ చేసిన విధానం సినిమాకి మైనస్. ఆర్.కె.ప్రతాప్ సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. సెకెండాఫ్‌లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కార్తికేయ శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
దర్శకుడుమంచి కానె్సప్ట్ తీసుకున్నప్పటికీ దానికి తగ్గ స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. ఆ ఊరిలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో అని హీరో ఛేదించే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా మొదలైనప్పటికీ. ఆ ఇంట్రెస్ట్ చివరివరకు మెయింటైన్ అవ్వదు. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. కథలోని మెయిన్ ఎమోషన్ ఇంకా బలంగా ఎలివేట్ అవకాశం ఉన్నట్లు అనిపించడం, సుబ్రహ్మణ్యపురంలో ఆత్మహత్యలు జరగడానికి బలమైన కారణాలు అంతే బలంగా చూపించకపోవడం వంటి అంశాలు సినిమా డ్రాబ్యాక్‌గా నిలుస్తాయి.

-శ్రీనివాస్ ఆర్.రావ్