రివ్యూ

ప్రకృతిమెచ్చిన ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేదార్‌నాథ్ ** ఫర్వాలేదు
**
తారాగణం: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్, నితీశ్ భరద్వాజ్, అల్కా అమీన్, సోనాలి సచ్‌దేవ్, పూజా గోర్, నిషాంత్ దాహియా సంగీతం: అమిత్ త్రివేదీ
సినిమాటోగ్రఫీ: తుషార్ కాంతి రాయ్
ఎడిటింగ్: చందన్ అరోరా
నిర్మాణ సంస్థ: ఆర్‌ఎస్పీ మూవీస్, గయ్ ఇన్ ది స్కై ప్చిక్చర్స్
స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: అభిషేక్ కఫూర్

**
టీవీ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. పటౌడి కుటుంబం నుంచి అరంగేట్రం చేసిన సారా అలీ ఖాన్. అట్రాక్షన్ కెమిస్ట్రీ మీద అంచనాలతో వచ్చిన చిత్రం -కేదార్‌నాథ్. అయితే ఆదినుంచీ వివాదాలనే ఎదుర్కొంటూ వచ్చింది. సినిమాలో కల్పిత అంశాలకు చోటిచ్చారని, మతాలమధ్య చిచ్చురేపే అంశాలున్నాయన్నది వివాదం. దీంతో సినిమా ఎక్కడ షూట్ చేశారో -అక్కడే బ్యాన్ పడింది. నైనిటాల్, ఉదమ్‌సింగ్ ప్రాంతాల్లో సినిమాను నిషేధించినట్టు వార్తలొస్తున్నా, ఉత్తరాఖండ్ మొత్తంలోనే థియేటర్లకు రాలేదన్నది తాజా సమాచారం. రాష్ట్ర మంత్రి సత్యపాల్ మహరాజ్ సైతం ఇదే విషయాన్ని ప్రకటించాడు. అంతేకాదు, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ప్రత్యేక ఆదేశాలూ జారీ చేశామంటున్నాడు. సంస్కృతీ సంప్రదాయాలను దూరం చేసేదిగా ఉందని, ప్రజలను రెచ్చగొట్టేలా కంటెంట్ ఉందన్నది ఒక వర్గం ఆరోపణ. కేదార్‌నాథ్ చిత్రం బ్యాన్‌కోరుతూ పడిన పిల్‌ను హైకోర్టు కొట్టేసినా, ప్రకృతి ప్రేమ కథకు ప్రభుత్వం నుంచి మాత్రం ఇబ్బంది తప్పలేదు.
కథలోకి వెళ్తే..
సముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో -కేదార్‌నాథ ప్రాంతంలో రెండు వర్గాలు సమావేశమయ్యాయి. భారీ వరదలకు దెబ్బతిన్న ప్రాంతంలో మళ్లీ నిర్మాణాల చేపట్టే అంశం, పర్యావరణ అనుమతులపై వాళ్లమధ్య ఆగ్రహావేశాలతో చర్చ నడుస్తుంది. ‘్భగవంతుని సాక్షాత్కారం కోసం వచ్చే భక్తులకు సరైన వసతులు కల్పించడం మన విధి. సౌకర్యవంతమైన నిర్మాణాలు చేపట్టాలి’ అన్నది హిందూ వర్గం నుంచి ఓ యువకుడి వాదన. ‘ఇప్పటికే కేదార్‌నాథ్ సాణువులపై వత్తిడి పెరుగుతోంది. పర్యావరణాన్ని దెబ్బతీసేలా నిర్మాణాలు చేపట్టేకంటే, ఉన్న సౌకర్యాలకు అనుగుణంగా భక్తుల దర్శనాలను నియంత్రించడం మంచిది’ అంటూ మరో వర్గంలోని ముస్లిం కుర్రాడు మన్సూర్ ప్రతివాదన. ఇరువర్గాల మధ్య వాదన ఎలాంటి పరిస్థితులకు దారితీసింది.. ఈ పరిణామాల బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ కథ ఎలా నడిచింది? -ఇదీ దర్శకుడు ఎంచుకున్న ఇతివృత్తం.
ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమా గుర్తండే ఉంటుంది. ధోనీ బయోపిక్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు, స్క్రీన్ ధోనీ అంటే సుశాంత్ గుర్తొంచేంతగా. తరువాత ‘రాబ్తా’ నిరాశపర్చినా, ‘కేదార్‌నాథ్’తో సక్సెస్ కొట్టాలన్న ఆశలతో వచ్చాడు సుశాంత్. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2013లో కేదార్‌నాథ్‌ను వరదలు ముంచెత్తడం తెలిసిందే. భారీ ప్రాణ, ధన నష్టాన్ని చవిచూసిన విషాద సమయంలో -మతాలు వేరైన ఇద్దరు యువతీ యువకుల మధ్య ప్రేమను పుట్టించి తెరకెక్కించాడు దర్శకుడు అభిషేక్ కఫూర్. -ప్రకృతి అందాల మధ్య మందాకిని మిశ్రా (సారా అలీ ఖాన్), మన్సూర్ ఖాన్ (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్)ల మధ్య సాగిన అందమైన ప్రేమ కథ మాధుర్యాన్ని అభిషేక్ కఫూర్ ఎలా చూపించాడో చూద్దాం.
కేదార్‌నాథ్ ఆలయ పండితుల కుటుంబంలో (నితీశ్ భరద్వాజ్) పుట్టిన అందమైన పిల్ల మందాకినీ మిశ్రా. ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే హిందూ కుటుంబంలో పుట్టినా -స్వేచ్ఛను ఎక్కువ ఇష్టపడే తత్వం ఆమెది. అల్లారు ముద్దుగా పెరుగుతుంది. ఇదే ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడు మన్సూర్ ఖాన్ (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్). ప్రకృతి అందాలకు నెలవైన పవిత్ర ప్రాంతం కేదార్‌నాథ్ ఒడిలో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అప్పటికే మందానికి నిశ్చితార్థం అయిపోయి ఉంటుంది. అయినా వీరి లవ్ జర్నీ ప్రకృతి సాక్షిగా సాగిపోతున్న తరుణంలో -ప్రేమికుల గుండె చప్పుళ్లు మందాకిని తండ్రికి వినిపిస్తాయి. అతని గుండె భగ్గుమంటుంది. మతేతర కుర్రాడిని ప్రేమించి పరువు మంటగలిపావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. హిందూ సంప్రదాయానికే ప్రాధాన్యతనిచ్చి, ఇద్దరినీ విడదీస్తారు. భిన్నమైన మనస్తత్వం కలిగిన మందాకిని -తన ప్రేమను బతికించుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకుంటుంది. జపానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అదే సమయంలో కేదార్‌నాథ్‌ను వరదలు ముంచెత్తుతాయి. ప్రకృతి వైపరీత్యంలో మందాకిని ప్రేమ ఏమైందన్నది తెరపై చూడాలి.
కమర్షియల్ కంటెంట్‌ను కథ కోసం ఎంచుకోవడంలో అభిషేక్ కఫూర్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే -ప్రకృతి ఒడిలో పుట్టిన ప్రేమ కథలోని ఒడిదుడుకులు చూపించడం కంటే కేదార్‌నాథ్ వరద బీభత్సాన్ని చూపించడానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినట్టు కనిపించింది. ఫస్ట్ఫా అంతా సారా, సుశాంత్‌ల ప్రేమకథను చూపించాడు. ద్వితీయార్థంలో వరద విలయానికే ఎక్కువ టైం కేటాయించాడు. సారా, సుశాంత్ సున్నితమైన ప్రేమకథకంటే కేదార్‌నాథ్ సమయంలో వచ్చిన వరదలే ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. కాకపోతే, మతాంతర ప్రేమ కథను మరింత బలంగా చూపించివుంటే, కేదార్‌నాథ్ విజయం మరోలా ఉండేదే. ఈ విషయంలో దర్శకుడు అభిషేక్ విఫలమైనట్టే. సినిమాటోగ్రాఫర్ తుషార్ కాంత్ కేదార్‌నాథ్ ప్రకృతి అందాలను కొత్త కోణంలో చూపించగలిగాడు. ఓ పక్క ప్రేమ విలయం, మరోపక్క ప్రకృతి విలయం -ఈ రెంటిని తన బ్యాక్‌డ్రాప్ సంగీతంతో బ్యాలెన్స్ చేయగలిగాడు అమిత్ త్రివేదీ. నిర్మాణ విలువలకు ఎక్కడా వంకపెట్టే పరిస్థితి లేదు. సినిమా మొత్తం రిచ్‌గా ఉంది.
అంచనాలకు తగ్గట్టుగానే సారా, సుశాంత్ కెమిస్ట్రీ వర్కవుటైంది. కాకపోతే తొలి సినిమాలో కనిపించే తడబాటు, అనుభవరాహిత్యం సారాలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆమె ప్రేమ ఇబ్బందులో పడినపుడు మనసు బాధను హవభావాల్లో పలికించడంలో విఫలమైంది. కాకపోతే ఉత్తరాఖండ్‌లో ప్రవహిస్తోన్న నది మందాకినిలా చలాకీగా, ముచ్చటైన అల్లరి అందంతో ఆకట్టుకుంది. టైలర్ మేడ్ అన్నట్టు మన్సూర్ పాత్రలో సుశాంత్ ఒదిగిపోయాడు. భావోద్వేగాలను పలికించడంలో ధోనీ స్థాయి పరిణితి చూపించాడు. మిగతా ఆర్టిస్టులు పాత్రల పరిధిమేరకు కనిపిస్తారు. మైమరిపించేంత గొప్ప ప్రేమ కథ కాకున్నా, ప్రకృతి మధ్య నిలబడిన ప్రశాంతత అనుభవంలోకి తెస్తుంది -కేదార్‌నాథ్.