రివ్యూ

బాగానే చెక్కారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
జివి ప్రకాష్‌కుమార్, శ్రీదివ్య, షారీఖ్‌హసన్, గణేష్, ఊర్వశి, సుజనా వరుణి, అభిషేక్ ఘోష్, తిరుమురుగున్, బాలాజీ వేణు, మిర్చి షా
నిర్మాత: జి హరి
సంగీతం: జివి ప్రకాష్‌కుమార్,
రచన, దర్శకత్వం: మణి నాగరాజు
***
‘పెన్సిల్’ చిత్రం- వాల్‌పోస్టర్స్, ప్రచార చిత్రాలూ చూస్తే ఇదేదో బొడ్డూడని పసిగుడ్ల ప్రేమ- వగైరాలతో నిండిన సాధారణ అల్లిబిల్లి లవ్‌స్టోరీ పిక్చర్ అని అనుకుంటాం. ఆ అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఓ అపరాధ పరిశోధక అంశం కీలక కేంద్రంగా మలిచిన చిత్రం (్ఫర్త్ పీరియడ్ మిస్టరీ) ఆధారంగా నిర్మించిన చిత్రం అంటారు. ఇక ఈ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్తే...
పనె్నండవ తరగతి చదువుతున్న శివ (జివి ప్రకాష్‌కుమార్) చదువుల్లో ముందుండే విద్యార్థి. సహజంగా ఆ స్థితిలో వున్న విద్యార్థులకుండే ప్రత్యర్థితత్వం ముమ్మూర్తులా పుణికిపుచ్చుకున్న విద్యార్థి నితిన్ (షారీఖ్ హసన్). నితిన్‌కున్న మరో అవాంఛిత తత్వం మరొకర్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకోడం. ఆ ప్రక్రియలో అతని బాధిత వర్గం పెరిగిపోతుంది. ఆ సమయంలో అతనో విచిత్ర పరిస్థితిలో హత్యకు గురవుతాడు. అదే సమయంలో ఆ ప్రదేశానికి వచ్చిన శివకు ముచ్చెమటలు పట్టేస్తాయి. అప్పుడే అక్కడికి వచ్చిన సహ విద్యార్థి(ని) మాయ (శ్రీదివ్య) అసలు హంతకుడెవరో పరిశోధించి పట్టివ్వడం మిగతా కథ. సినిమాకు ‘పెన్సిల్’ అని పేరుపెట్టడంలో అర్థం- హంతకుడీ హత్యను ఓ పుస్తకంలో ‘పెన్సిల్’ ఆయుధంగా అలాంటి నేరానికి ఒడిగట్టిన అంశంతో ప్రేరణపొంది ప్రొసీడయ్యాడు కనుక. కేవలం పెన్సిల్‌తోనే అంత పనిచేశాడా అన్న ఆలోచన అనవసరం. ఎందుకంటే ఏ విషయంలోనైనా ప్రేరణే ప్రాథమిక అంశం. అదిక్కడ ‘పెన్సిల్’పరంగా జరిగింది అంతే. చిత్రమంతా అలా జరిగితే చివరలో హంతకుడితో ప్రైవేట్ విద్యాసంస్థల్లో కాసుల కక్కుర్తికోసం, ఒకర్నొకరు దాటుకుపోవాలనే తత్వంతో అనారోగ్యకర పద్ధతుల్ని అవలంభిస్తున్న తీరునీ ఎండగట్టించారు. అసలా విషయమే సినిమా కథకు కావల్సిన కాన్వాసునిచ్చేంత పరిధి ఉన్నది. వాస్తవానికి ఆ అంశమూ హంతకుడు హత్యకు ఒడిగట్టడానికి పురికొల్పిన అంశమూ ఒకదానికొకటి అంతగా సంబంధమున్నది కాదు. తన బిడ్డ చావుకి కారణమయ్యాడన్న కోపంతో హంతకుడు నితిన్‌ని చంపుతాడు. విషయం దారుణమైనా అది వ్యక్తిగతమైనది. ప్రైవేట్ విద్యాసంస్థల అవకతవకలవల్ల కాదిది, రెండింటినీ కలపడానికి దర్శకుడు విఫలయత్నం చేశారు. ఇది వదిలేసి మిగతా విషయాన్ని పరిశీలిస్తే, కొత్తదనంతో చిత్రం అందించాలన్న మణినాగరాజు (దర్శకుడు) చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదు. కానీ కొన్నికొన్ని ప్రధాన విషయాల పట్ల ఆయన చూపిన ఉదాశీనత అసంతృప్తికి గురిచేసింది.
కాలేజ్ క్యాంపస్ వగైరాచూస్తే పనె్నండవ తరగతివరకూ మాత్రమేవున్న విద్యాసంస్థ ఆ స్థాయిలో ఉంటుందా? అన్న అనుమానం కలుగుతుంది. అలాగే తానెంతో శ్రమతో యునెస్కో ఎంట్రీగా పంపదలుచుకున్న ప్రయోగ పత్రాల ఫైలు అగ్నికి ఆహుతై పోయిందన్న బాధతో నితిన్‌ని మందలించడానికి శివ వచ్చినట్టు చూపారు. కానీ, కంప్యూటర్ ఆవిర్భావం తర్వాత ఎవరైనా ఇలాంటి విలువైన సమాచారాన్ని వాటిల్లో నిక్షిప్తపరుచుకుంటారు తప్ప ఈ చిత్రంలోలా కేవలం ఫైల్స్‌పైనే ఆధారపడతారా? అన్న భావనా కల్గుతుంది. అలాగే ఓ బాధ్యతాయుతమైన లెక్చరర్ పోస్టులో ఉంటున్న శ్రీ్ధర్ తన లవర్ నందిని (ఆమెకూడా లెక్చరరే) సన్నిహితమవడానికి కళాశాలనే వేదికగా తీసుకుంటారా? అన్నదీ జీర్ణించుకోలేని అంశం. ఇక విద్యాసంస్థల నాణ్యతా ప్రమాణాల్ని పరిశీలించడానికి వచ్చే తనిఖీ బృందం తీరుని మరీ ప్రహసనంలా ఈ చిత్రంలో చేసేశారు. అయితే చిత్రంలో కామెడీ కంటెంట్ తగ్గిందన్న భావనతో ఈ సన్నివేశాల మాటున ఇది కల్పించాల్సిన అవసరం డైరెక్టర్‌కు వచ్చిందన్నదీ గ్రహించాలి. వాస్తవం వేరేలాఉన్నా, ఈ సందర్భంగా తనిఖీ బృందం హెడ్ (ఊర్వశి) పదే పదే కాలేజీ ప్రిన్సిపాల్ అసలు పేరైన సుదర్శనం బదులు మరో పేరు ఉచ్ఛరించడం వగైరా బాగా పండాయి. నటీనటుల నటన విషయానికి వస్తే ప్రథమంగా చెప్పుకోవాల్సింది తెలుగమ్మాయి (‘పెన్సిల్’ చిత్రం అదే పేరుతో విడుదలై తమిళ చిత్రానికి అనువాద రూపం. రెండూ ఒకేసారి విడుదలయ్యాయి) శ్రీదివ్య నటననే. తను చదివిన పుస్తకజ్ఞానం ఆధారంగా ఘటన చూసిన అనంతరం సెకను కూడా వృధాచేయకుండా మాయ పాత్రలో ఆమె నటించిన తీరు సింప్లీ సూపర్బ్. తర్వాత శివపాత్రకు కావాల్సిన అమాయకత్వం, తనని మాయ ప్రేమించడం లేదన్న బాధనీ చూపించిన తీరునీ బాగా పోషించారు ప్రకాష్‌కుమార్. మిగతా పాత్రల్లో ప్రిన్సిపాల్ పాత్రను పోషించిన నటుడు మంచి నటనను అందిచ్చారు. సిట్యుయేషన్‌కి కావల్సిన కన్‌ఫ్యూజన్‌నీ తనిఖీ బృందం నాయకురాలిగా నటించిన ఊర్వశి బాగా సరఫరాచేశారు.
సాధారణంగా తన ముఖ్య విభాగమైన సంగీతం విషయంలో కాస్తంత అదనపు శ్రద్ధ వహించే తత్వం ఏ సాంకేతిక నిపుణునికైనా ఉంటుంది. కానీ స్వతహాగా సంగీత దర్శకుడైన ప్రకాష్‌కుమార్ ఈ చిత్రంలో నాయక పాత్ర ధరించారు. అయితే అందించిన సంగీతంపై ఏమంత శ్రద్ధ వహించినట్లు కనిపించదు.
ఓమాదిరిగా ఉందనుకున్న ‘ఎల్‌ఈడి’ కళ్లు.. పాట చిత్రాంతంలో అందరూ థియేటర్‌నుంచి వచ్చేసే సమయంలో వచ్చింది. దాంతో ఇది సరిగ్గా నమోదుకాలేదు. ‘ప్రేమమీద నమ్మకంపోయిన వాళ్లే పెళ్లి గురించి మాట్లాడతారు’ అన్నచోట్ల శశాంక్ వెనె్నలకంటి (సంభాషణా రచయిత) పనితనం బాగుంది. అయితే బుక్స్ బాగా చదివితే బ్యాంకుల తాళాలైనా తీసేయచ్చు లాంటివి ఒప్పదగినవి కావు. నూతనత్వపు దారినెంచుకోవాలన్న దర్శకుని తపన అభినందనీయమే. కానీ దానికి వాస్తవికత ఎంతవరకూ సహకరిస్తుందన్న సమీక్ష చేసుకుని ‘పెన్సిల్’తో రాయించి ఉంటే ఇంకా బాగుండేది.

-అనే్వషి