రివ్యూ

పాత ఫ్యాక్షన్ గోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైరవగీత * బాగోలేదు
*
తారాగణం: ధనంజయ, ఐరా మోర్, విజయ్ రామ్, రాజా బల్వాడి సంగీతం: రవిశంకర్
సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి
మాటలు: రామ్ వంశీ
నిర్మాతలు: అభిషేక్ నామా, భాస్కర్ రాశి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిద్ధార్థ తాతోలు

*
తను తీసే సినిమాలపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయాన్ని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘హిట్ ఫ్లాప్ పట్టించుకోకుండా నచ్చిన సినిమా తీస్తా. చూస్తే చూడండి, లేదంటే లేదు’ అనే టైపు ఆయన. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయనే చెప్పుకున్నాడు కూడా. కొద్దికాలం క్రితం ‘ఆఫీసర్’ అనే ఫ్లాప్‌ను అలాగే వదిలాడు వర్మ. కాస్త గ్యాప్ తీసుకుని ఈసారి నిర్మాతగా ‘్భరవగీత’ను ప్రేక్షకుల ముందుకుతెచ్చాడు. శిష్యుడు, డెబ్యూ దర్శకుడైన సిద్ధార్థ తాతోలు ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన భైరవ, గీతల లవ్ స్టోరీ ఇది.
కథ: భైరవ (ధనంజయ) ఫ్యాక్షన్ నాయకుడు సుబ్బారెడ్డి దగ్గర నమ్మిన బంటు. అతని కుటుంబం తరతరాలుగా ఫ్యాక్షన్ నాయకుల దగ్గరే ఊడిగం చేస్తూంటుంది. తన బతుకూ నాయకుడికే అంకితం కట్టుబానిసలా బతికేస్తుంటాడు. ఆక్రమంలో ఓ ఆపదనుంచి సుబ్బారెడ్డి కూతురు గీత (ఇర్రామోర్)ని రక్షిస్తాడు. దాంతో గీత భైరవను ప్రేమిస్తుంది. అదే సమయంలో తండ్రి తనకు ఇష్టంలేని పెళ్లి కుదర్చడంతో, ఇంటినుంచి భైరవతో సహా పారిపోతుంది. భైరవపై కక్షగట్టిన ఫ్యాక్షనిస్టు, అతన్ని అంతమొందించాలని పంతం పడతాడు. ఈ క్రైసిస్‌ను అధిగమించి తన బానిస బతుకును మార్చుకోడానికి భైరవ ఏంచేశాడు? ఎలా తిరుగుబాటుకు దిగాడు? భైరవ, గీతలు ఒక్కటయ్యారా? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
ఒకప్పుడు -నటీనటుల నుంచి తనకు కావాల్సిన అతిని తీసుకోవడంలో వర్మ సక్సెస్. ఒకప్పుడు అదే వైవిధ్యంగా జనాలకు కనెక్టయ్యేది. అందుకే వర్మ సినిమాలంటే -ఆడియన్స్‌కు ఓ ఇంట్రెస్ట్. ‘్భరవగీత’లో శిష్యుడు సిద్ధార్థ సైతం అదే స్ట్రాటజీ ప్రదర్శించాలని అనుకున్నాడు. ఆక్రమంలో హీరో ధనంజయ మంచి నటుడనే విషయం అర్థమైనా, చాలాచోట్ల అవసరానికి మించి తీసుకోవడం ఓవర్ డోస్ అయిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో కొన్నిచోట్ల సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో, స్క్రీన్ ప్రజెన్స్ బావుంది అనిపించాడంతే. హీరోయిన్ ఐరా మోర్ ఓ రేంజ్ అందాలు చూపించేసింది. కథకు కీలకం ఆమే అయినా, కుర్రాళ్లకు మాత్రం కనువిందుగా మిగిలిపోయింది. నటనపరంగా చెప్పుకోవడానికి అంత లేదు. విలన్ పాత్రల్లో విజయ్‌రామ్, రాజా బల్వాడి ఎక్కువే చేసి విసుగుపుట్టించారు. మిగతా నటీనటులు పాత్రోచిత ఔచిత్యానే్న ప్రదర్శించారని అనిపిస్తుంది.
టెక్నికల్ విషయాల్లోకొస్తే.. దర్శకుడికంటే నిర్మాత గురించే ఎక్కువ మాట్లాడుకోవాలి. కారణం -నిర్మాత ఓ బలమైన దర్శకుడు కనుక. దర్శకుడిగా వర్మ సినిమాల్లో కనిపించే విజువల్స్, మ్యూజిక్కే నిర్మాతగా చేసిన సినిమాలోనూ కనిపించాయి. ఒకరకంగా ఇది వర్మ చేత ప్రభావితమైన దర్శకుడు చేసిన సినిమా అనుకోవాలి. జగదీశ్ కెమెరా చిత్ర విచిత్రమైన యాంగిల్స్, క్లోజప్ షాట్లు చూపిస్తే, రవిశంకర్ సంగీతమూ తగినంత పాత్ర పోషించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకింత బోర్. పాటలు ఫర్వాలేదు. నిర్మాణ విలువలు, సంభాషంలు ఓకే. దర్శకుడు సిద్దార్థ తాతోలు మీద వర్మ ప్రభావం ఎక్కువగానే కనిపించింది. వర్మ స్టయిల్లో సినిమా తీసి ఆయన్ని మెప్పించాలన్నట్టే ఆడియన్స్‌కి తోస్తుంది. ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పనిచేసే కుర్రాడు.. అతన్ని కూతురు ప్రేమించటం.. అందుకు కులాల అంతరాలతో తండ్రి అడ్డుచెప్పటం.. అతనే్న పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ భీష్మించటం.. కుర్రాడ్ని తీసుకుని పారిపోవడం.. ఫ్యాక్షన్ నాయకుడు అగ్గిమీద గుగ్గిలం.. ఇద్దరి మధ్యా పోరు, హీరో తిరుగుబాటు. కథానాయకుడి గెలుపుతో కథ సుఖాంతం. ఇలాంటి కథలు ఎన్ని రాలేదు. మరోవైపు హీరో హీరోయిన్ల ఘాటు రొమాన్స్ కథను ఎక్కడికో లాక్కెళ్లిపోయేలా చేసింది. మితిమీరిన హింసే యాక్షన్ ఘట్టాలన్న భ్రమలో దర్శకుడు నానా హంగామా చేశాడనిపిస్తుంది.
రామ్‌గోపాల్ వర్మ 90ల్లో సినిమాలు జనాలకు కొత్తగా అనిపించేవి. అప్పటిదాకా ఎన్నడూ చూడని విజువల్స్.. మ్యూజిక్.. టేకింగ్.. ప్రేక్షకుడికి కొత్తదనం అందించేవి. కథను నేరేట్ చేసే విధానంలోనూ ఒకింత కొత్తదనం కనిపించేది. హింసతో ముడిపడిన సినిమాల్లో ఇంటెన్సిటీనే వేరుగా ఉండి ప్రేక్షకులపై ప్రభావం చూపేది. దీంతో కొత్తతరహా సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు వర్మ ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ రాను రాను అది కాస్తా రొటీన్ అయ్యింది. భైరవగీతలో అదే కనిపించింది. సినిమా మొదలైన తీరుతోనే ఏంజరగబోతోందో అర్థమైపోతుంది. కొత్తగా.. ఆసక్తికరం అనిపించే సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. ఫ్యాక్షన్ నాయకుడి కూతురు తమ పనివాడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించడం కష్టమేమీ కాదు. ఆ అంచనాలకు తగ్గట్టే కథ నడుస్తుంది. అచ్చంగా వర్మ స్టయిల్లో ఎక్కడపడితే అక్కడ కెమెరా పెట్టడం.. క్లోజప్స్ చూపించడం.. నటీనటులంతా అవసరానికి మించి హావభావాలు పలికించేస్తుండటం.. సన్నివేశాల్లో బలం లేకపోయినా ఏదో జరిగిపోతున్నట్టు బ్యాగ్రౌండ్ స్కోర్ బాదేయడం.. ఇలా భైరవగీత కాసేపటికే ప్రేక్షకుల్ని విసుగెత్తించింది. వర్మ మార్క్ సినిమా అంటే ఒకప్పుడు ప్లస్, ఇప్పుడు మైనస్సై కూర్చుంది.

-శ్రీ