రివ్యూ

అట్లాంటిస్ సాహసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్ర పుత్రుడు ** ఫర్వాలేదు
**
తారాగణం: జేసన్ మొమోవా, అంబర్ హియర్డ్, విల్లెమ్ డఫో, ప్యాట్రిక్ విల్సన్, డోల్ఫ్ లన్డ్‌గ్రెన్,
యయా అబ్దుల్ మటీన్-2, నికోల్ కిడ్‌మన్
సంగీతం: రూపర్డ్ గ్రెగ్సన్, విలియమ్స్
ఎడిటింగ్: కిర్క్ మెర్రి
సినిమాటోగ్రఫీ: డాన్ బర్జెస్
స్క్రీన్‌ప్లే: డేవిడ్ విస్లీ, విల్‌బెల్
నిర్మాతలు: పీటర్ సఫ్రాన్, రాబ్ కోవన్
దర్శకత్వం: జేమ్స్ వాన్
**
హాలీవుడ్ సినిమా అంటేనే భారీతనం. దానికితోడు సూపర్ హీరో సినిమాలంటే టికెట్ కోసుకుంటారు. అందుకే హాలీవుడ్ నుంచి భారీ యాక్షన్ లోడెడ్ చిత్రాలు ఎన్ని దిగుమతవుతున్నా -వాటికి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అలాంటి కోవలో వచ్చిన మరో భారీ చిత్రమే ఆక్వామెన్. తెలుగు అనువాదంలో సముద్ర పుత్రుడు. జేమ్స్‌వాన్ తెరకెక్కించిన సినిమాలో టైటిల్ పాత్రను ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ మొమోవా పోషించాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం యాక్షన్ ప్రియులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
భూమీద బతుకుతున్న ఆర్థర్ కర్రీ (జేసన్ మొమోవా)కి తన అసలు వారసత్వ రాజ్యం సముద్ర గర్భంలోని కింగ్ అట్లాంటిస్ అని తెలుస్తుంది. అట్లాంటిస్ రాజ కుటుంబంలోని కుద్రదారుల కారణంగా -సముద్ర రాజ్యాలు, తన ప్రజలకు ముప్పువాటిల్లుతోందని తెలిసి -తన శక్తియుక్తులు, సాహసాలతో వాళ్లను ఎలా రక్షించి ‘ఆక్వామేన్’గా అవతరించాడన్న జానపద కథ ఇది.
లైట్‌హౌస్ వాచ్‌మన్‌గా పని చేస్తున్న టామ్ కర్రీ (టిమ్యూరా మారిసన్) విధి నిర్వహణలో ఉండగా, సముద్రపుటొడ్డున స్పృహ తప్పి పడివున్న యువతిని గుర్తిస్తాడు. ప్రాణాలతోనే ఉందని గమనించి ఆమెను రక్షించే ప్రయత్నంలో ఓ రహస్యం తెలుసుకుంటాడు. ఆమె మామూలు యువతి కాదని, సప్త సముద్ర రాజ్యాల్లో ఒకటైన అట్లాంటిస్ మహారాణి అట్లాన్నా (నికోల్ కిడ్‌మన్)నే తాను రక్షించానని తెలుసుకుంటాడు. ఇష్టంలేని పెళ్లి కారణంగా సముద్ర రాజ్యాన్ని వీడి భూప్రాంతానికి వచ్చేసినట్టు అట్లాన్నా చెబుతుంది. ప్రాణాపాయం నుంచి తనను కాపాడిన భూవాసి టామ్‌కు ఆకర్షితురాలవుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. టామ్, అట్లాన్నా దంపతులకు కలిగిన సంతానమే ఆర్థర్ క్రరీ (జేమ్స్ మొమోవా). ఆనందంగా సాగిపోతున్న అట్లాన్నా జీవితంలోకి మళ్లీ అట్లాంటిస్ రాజ్యవాసులు వస్తారు. అట్లాన్నా భూమీదే ఉందన్న విషయం తెలుసుకుని దాడులకు ఉపక్రమిస్తారు. శక్తివంతులైన అట్లాంటిస్ రాజ్య దుండగుల వల్ల తన భర్త, కొడుకుకు ఎలాంటి ఆపాదా కలుగకూడదన్న ఆలోచనతో -అట్లాన్నా వాళ్లకు లొంగిపోతుంది. బందీగా అట్లాంటిస్ రాజ్యానికి వెళ్లిపోతూ ‘రెండు రాజ్యాలను ఏకం చేయగల అతి శక్తిమంతుడు తన కుమారుడు’ అని భర్తకు చెబుతుంది. పెరిగి పెద్దవాడైన ఆర్థర్ కర్రీకి సముద్ర రాజ్య యువరాణి మెరా (అంబర్ హియర్డ్) ద్వారా ఓ విషయం తెలుస్తుంది. అట్లాంటిస్ సహా సముద్ర రాజ్యాలకు తన కుటుంబీలకుల నుంచి ముప్పు పొంచివుందని, ప్రజలు దుష్టపాలనను చవిచూస్తున్నారని చెబుతుంది. దీంతో ఆర్థర్ తాను ఏ రాజ్యానికి చెందినవాడో తేల్చుకోవాల్సిన పరిస్థితి అసన్నమవుతుంది. కారణజన్ముడైన ఆర్థర్ కర్రీ సముద్ర రాజ్యమైన అట్లాంటిస్ ఎలా చేరుకున్నాడు? తల్లిని కలుసుకున్నాడా? భూమీద పుట్టిన తనకు నీటిమడుగులోనూ జీవించే శక్తివుందని ఎలా తెలిసింది? కర్తవ్య నిర్వహణకు ఎలాంటి సాహసాలను ప్రదర్శించి ‘ఆక్వామేన్’గా అవతరించాడన్నది మిగతా కథ.
నిజానికి దీని మూల కథ తెలుగు జానపద కథలకు దగ్గర పోలికలతో కనిపిస్తుంది. కాకపోతే -రెండు రాజ్యాల మధ్య కుట్రలు, కుతంత్రాలు, కథానాయకుడి ప్రణయం.. లాంటి అంశాలు మన కథల్లో కనిపిస్తే, వీటినే భూమి, సముద్రం (ఒకవిధంగా పాతాళం) అనే రెండు ప్రపంచాల మధ్య సాగే కథగా ఆక్వామేన్‌ను చిత్రీకరించినట్టు అర్థమవుతుంది. కాకపోతే హాలీవుడ్‌లో సూపర్ హీరోయిజం కథలు ఏస్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కనుక -ఆ స్థాయిలోనే దర్శకుడు జేమ్స్ వాన్ ఆడియన్స్ అబ్బురపడేలా సన్నివేశాలను తెరకెక్కించాడు. డీసీ కామిక్స్‌లో పిల్లలను అమితంగా ఆకట్టుకున్న ఆక్వామేన్ పాత్రకు వాన్ ప్రాణం పోసిన తీరును తక్కువ చేయలేం. ఉభయచర జీవిగా ఆక్వామేన్‌కు ఉండే శక్తులు, సాహసోపేత సన్నివేశాలను దర్శకుడు చూపించిన తీరు పిల్లలేకాదు, పెద్దలు సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. ఆక్వామేన్ పాత్రను తీర్చిదిద్దడమే కాదు, భారీ బడ్జెట్‌తో సన్నివేశాలను రిచ్‌గా చిత్రీకరించడమే సినిమాకు ప్రాణమైంది. భారీ ట్విస్టులు, పజిల్స్‌ని పెట్టకుండా కథను మామూలుగా నేరేట్ చేయడం గొప్పగా అనిపించింది. అందుబాటులోకి వచ్చిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో సీజీఐలో సృష్టించిన సముద్రగర్భ ప్రపంచం ఆడియన్స్‌కు ఓ వింతే. ఆక్వామేన్ కోసం తానో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించానని ప్రచార కార్యక్రమాల సమయంలో దర్శకుడు వాన్ చెప్పినట్టే -స్క్రీన్‌మీద ఆడియన్స్‌కు ఆ అనుభూతి అందించాడు. సముద్ర గర్భంలోని పోరాట సన్నివేశాలు, భారీ జంతువులతో భీకర యుద్ధాలను చూపించడానికి ఒకింత నిడివి ఎక్కువ తీసుకున్నా -యూనిట్ మొత్తం ఎంత కష్టాపడ్డారన్నది ఆడియన్స్‌కు అందిన అనుభూతిలోనే తెలుస్తుంది. హాలీవుడ్ చిత్రమే అయినా -కమర్షియల్ ఫార్మాట్‌లో భాగంగా ఆక్వామేన్‌తో ప్రినె్సస్ ప్రణయ సన్నివేశాల్ని బలవంతంగా చొప్పించారని ఒకటి రెండుచోట్ల అర్థమవుతుంది.
ఇక ఆర్థర్ కర్రీ పాత్రను దర్శకుడు వాన్ తీర్చిదిద్దడం ఒకఎత్తయితే -దానికి ప్రాణం పోయడంలో జేసన్ మొమోవా కృషి కనిపిస్తుంది. తనకు ఉభయచర జీవి శక్తులు ఉన్నాయని తెలిసిన తరువాత -జేసన్ హావభావాలు, వీరోచిత ప్రదర్శనతో పాత్రను పీక్స్‌కు తీసుకెళ్లాడు. సముద్ర పుత్రుడు ఇలానే ఉంటాడన్న నమ్మకం కలిగేలా పాత్రలో ఒదిగిపోయాడు. భూమి, సముద్ర గర్భంలో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాల్లో జేసన్ నటన బావుంది. పాట్రిక్ విల్సన్, నికోల్ కిడ్‌మన్, అంబర్ హియర్డ్, విల్లెమ్ డఫోలు సైతం తమ పాత్రలతో సినిమాకు ప్రాణం పోశారు. సముద్ర గర్భంలోని రాజ్యాలు, భూమీద రాజ్యాల మధ్య కథ సాగితే ఇలానే ఉంటుందా? అన్నంతగా సన్నివేశాల్లో ఆడియన్స్ లీనమైపోతాం. యుద్ధాల కోసం వినియోగించే సముద్ర జంతువుల సృష్టి దర్శకుడు వాన్ క్రియేటివిటీకి పరాకాష్టం. ఆడియన్స్‌ని మరోలోకంలోకి తీసుకెళ్లేందుకు సంగీత సారథలు రూపర్డ్ గ్రెగ్సన్, విలియమ్స్ కృషిని ప్రత్యేకంగానే ప్రస్తావించాలి. కిర్క్ మెర్రి షార్ప్ ఎడిటింగ్, డాన్ బర్జెస్ రిచ్ సినిమాటోగ్రఫీ, కథను ఎంతవరకు ఎప్పుడు ఎలా చెప్పాలన్న విషయంలో డేవిడ్ విస్లీ జోన్‌సన్- మెక్ గోల్డ్‌రిక్, విల్‌బెల్ ప్రదర్శించిన స్క్రీప్‌ప్లే పనితనం సినిమాకు హైలెట్ పాయింట్స్. హాలీవుడ్ చిత్రమేదైనా నిర్మాణ విలువలను ఎంచిచూపించే పనుండదు. ఆ విషయంలో నిర్మాతలు పీటర్ సఫ్రాన్, రాబ్ కోవన్‌ల గురించి గొప్పగానే చెప్పాలి.

-ప్రవవి