రివ్యూ

పసతగ్గిన ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.జి.ఎఫ్ * బాగోలేదు
*
తారాగణం: యాష్, శ్రీనిధిశెట్టి, అనంతనాగ్, మాళవికా అవినాష్, తమన్నా, అచ్యుత్‌కుమార్, శ్రీనివాసమూర్తి, వశిష్ట ఎన్.సింహ, అర్చన రోయిస్,
సంగీతం: రవిబస్రూర్, తనిష్క్ బర్బీ
నిర్మాత: విజయ్ కిరంగదూర్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌నీల్
*
భారీ వ్యయంతో నిర్మించిన ప్రతి చిత్రమూ బాగుండి తీరుతుందన్న నియమమేమీ ఉండదు. ఆ విషయాన్ని మరోసారి రుజువుచేసింది కెజిఎఫ్. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కర్నాటకలోని కోలార్ బంగారు గనుల నేపథ్యంలో కూర్చిన కథ. సాధారణంగా ఏ భాషా చిత్రాలు ఎంతెంత బడ్జెట్‌కు రెక్కలు కట్టుకెళ్లినా కన్నడ చిత్రాలు మాత్రం పరిమిత వ్యయంతోనే నిర్మితమవుతాయి. ఆ అంశాన్ని పూర్వపక్షం చేసి బడ్జెట్ ఆంక్షలేం లేకుండా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ తదితర భాషల్లో ఒకేసారి విడుదలైన చిత్రమిది. ‘బాహుబలి’ చిత్ర నిర్మాణ స్ఫూర్తితో ఈ చిత్రం నిర్మితమవుతుందన్న ప్రచారం జరిగిన కెజిఎఫ్‌ని ప్రశాంత్ నీల్ (దర్శకుడు) కొన్నిచోట్ల ప్రశాంతంగా ఆ చిత్రపు ఛాయల్ని అనుకరించారు కూడా. దానికితోడు ‘బాహుబలి’ సృష్టికర్త రాజవౌళి చాలా చిత్రాలకు బాసటగా నిలిచిన ‘వారాహి’ సంస్థే కెజిఎఫ్‌ని తెలుగువారికి చూపించడంతో ఆ అంచనాలకు మంచి ఊపు వచ్చింది. కానీ ఏం లాభం. ఎంతెంతగా సాంకేతిక విలువలూ, ఊహా సంపత్తీ సుసంపన్నమున్నా, అన్నిటికీ ఆది మూలమైన కథని, కథాక్రమాన్నీ లక్ష్యపెట్టక కెజిఎఫ్‌ని తెరకెక్కించడంతో ప్రశాంత్ ప్రయత్నాలు ఫలించలేదు. వివరాల్లోకి వెళితే..
పేదవాడింట చావు కూడా ప్రశాంతంగా రాదు అన్న అనుభవం కలిగిన రాఖీ (యాష్) తల్లి చనిపోతూ, ‘నువ్వు ఎలాగైనా సరే ధనవంతుడైన తర్వాతే మరణించు’ అన్నమాటను తీసుకుని కన్నుమూస్తుంది. అనంతరం అలా ‘ఎలాగైనా’ అన్న పదం ప్రకారం ఎలా రాఖీ ధనవంతుడయ్యాడు? చివరకు ఏమైంది? అన్న దానితో రెండు గంటల ముప్ఫై ఐదు నిమిషాలు దీర్ఘ నిడివిలో చిత్రం పూర్తవుతుంది. మధ్యలో టైటిల్ జస్ట్ఫికేషన్ కోసం రాఖీ తనకప్పగించిన పని నిమిత్తం కోలార్ గోల్డ్ ఫీల్డ్ అధినేతను చంపడానికి అక్కడికి వెళ్లడం, అక్కడ పనివారి పరిస్థితిని చక్కదిద్దడం వగైరా కూడా చూపించారు. ఇదే సినిమాకు వైవిధ్య పాయింట్. కానీ దీన్ని తెరపై రిజిస్టర్ చేయడంలో తీవ్ర గందరగోళానికి దర్శకుడు లోనయ్యాడు. కారణం- ఇందాక చెప్పినట్లు చెప్పే పాయింట్‌కు పాడింగ్‌లు ఎక్కువవడం. అవి అడుగడుగునా పంటిక్రింద రాళ్లలా ప్రేక్షకుడి సహనాన్ని విపరీతంగా పరీక్షించాయి. ఉదాహరణకు ఇలాంటి సీరియస్ యాక్షన్ చిత్రాల్లో హీరోకి లవ్ ఇంట్రెస్ట్, ఓ ఐటెమ్ సాంగూ కథ ఫ్లోకు అనవసరం. కానీ ఇందులో రీనా (శ్రీనిధిశెట్టి) అటూ నాయకుడికి లవ్ ఇంట్రెస్ట్‌గా చెప్పడం, రెండు మూడు సీన్లు కలపడం చేశారు. దీనికి అదనంగా నాయకుడు వచ్చిన పబ్‌లో ‘దోర సొగసులు నీవే’ అంటూ తమన్నాతో ఐటెమ్ సాంగూ పెట్టారు. దీంతో చిత్రమల్లా సాధారణ వాణిజ్య చిత్రమై కూర్చుంది. ఇక కథా వివరణ ప్రకారం ఇది 1951-1981 ప్రాంతాల మధ్య జరిగినట్లు చూపారు. మరి అప్పుడు దేశంలో సుస్థిర ప్రజాస్వామ్యం పరిఢవిల్లినదే. అలాంటి సమయంలో సినిమాలో కెజియఎఫ్‌లో జరుగుతున్నట్లు చూపిన అరాచక శ్రమదోపిడీ, కట్టుబానిసత్వం తరహా జరుగుతున్నట్లు చూపడం ఎంతవరకు విశ్వసనీయమన్నదీ చిత్ర బృందం దృష్టి పెట్టినట్లు లేదు. ఫస్ట్ఫా అంతా పాత్రల పరిచయం, నడిరోడ్డు ట్రాఫిక్‌ని బంద్ చేసి, కథానాయిక బృందం మందుకొట్టినట్లు చూపడం తాలూకు సన్నివేశాలు దొర్లాయి. ద్వితీయార్థంలోనైనా పోనీ కథ స్పీడ్ అందుకుంటుందా అంటే అదీ జరగలేదు. వెరశి యాక్షన్ చిత్రాల్లో వెల్లివిరియాల్సిన థ్రిల్ ప్రేక్షకుకుడికి శూన్యమైంది. ఒక్క పతాక సన్నివేశంలో మాత్రమే ప్రేక్షకుల స్పందన కన్పడే తీరుగా చిత్రీకరణ జరిగింది. ఇక పాత్రధారుల నటనాపటిమ విషయానికి వస్తే రాఖీగా యాష్ మొత్తం చిత్ర బరువు బాధ్యతలన్నీ తన భుజస్కందాలపై వేసుకుని కృషి చేశాడు. కానీ ఆ కృషి సాకారం కావడానికి తగినవిధంగా కూర్చున్న కథ సహకరించలేదు. అయినప్పటికీ పాత్రకు నిర్వచించిన రఫ్‌నెస్, పిడికెడు ఆహారం కోసం చిన్నపుడు పడిన పాట్లు గుర్తుచేసుకుని, అలాంటి బాధలు అనుభవిస్తున్నవారిపై చూపిన దయ తదితర దృశ్యాల వ్యక్తీకరణలో ఎన్నదగిన నటన కనపర్చారు. ఓ విధంగా తెలుగులో ఈమధ్య ఇలాంటి సహజ నటన ప్రదర్శిస్తున్న విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ యాష్‌లో కన్పడిందని చెప్పచ్చు. రీనాగా శ్రీనిధిశెట్టికున్న నటనా పరిధి తక్కువ. రాఖీ తల్లి పాత్రధారణి మంచి నటన ప్రదర్శించారు. కథని చెప్పే పాత్రికేయుని పాత్రలో అనంతనాగ్ కన్పడ్డారు. ఈ కోవ చిత్రాల్లో అగ్రతాంబూలం అందుకునే శాఖలైన కెమెరా, కళా దర్శకత్వం ప్రశంసనీయంగా తమ విధులను నిర్వహించాయి. ప్రధానంగా డార్క్‌లైట్ నేపథ్యంలో తీసిన సన్నివేశాల్ని భువనగౌడ (్ఛయాగ్రాహకుడు) బాగా చూపారు. అలాగే కోలార్ బంగారు గనుల ప్రాంతాం మొదలైనవాటిని మంచి కృషితో శివకుమార్ (కళాదర్శకుడు) తెరపై సాక్షాత్కరింపజేశారు. కానీ శ్రీకాంత్ (ఎడిటర్) తన పనిని ఇంకాస్త ప్రతిభావంతంగా చేసి రెండుగంటలకు చిత్రాన్ని కుదించివుంటే ఆడియెన్స్ చాలా తెరిపిన పడేవారు. ‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస, గర్జనకంటే భయంకరంగా ఉంటుంది’, ‘మామూలుగా మృగాలు బోనులో ఉంటాయి, మనుషులు బయట ఉంటారు, కానీ ఇక్కడ మనుషుల్ని బోనులో పెట్టి మృగాల్లాంటి మనుషులు వినోదం చూస్తుంటారు’ వంటి డైలాగ్స్ కథోచితంగా అలరించాయి. ఈ టైపు చిత్రాల్లో పాటలకేం ప్రాధాన్యత ఉండదు కానీ, నేపథ్య సంగీతం కొన్నిచోట్ల ఒకే స్థాయిలో ఉంది. సినిమాకో ఓదార్పు అంశమేమిటంటే, కెజిఎఫ్‌కు చాప్ట్‌ర్-1 అంటూ ఉపశీర్షిక పెట్టారు కనుక, ఇందులో దొర్లిన తప్పుల్ని ప్రశాంత్ ప్రశాంతంగా పరిశీలించి అవి చాప్టర్-2లో పునరావృతం కాకుండా చూసుకునే అవకాశముంది. ఆ విధంగా కెజిఎఫ్ చాప్ట్‌ర్-2 వస్తుందని ఆశిద్దాం.

అన్వేషి