రివ్యూ

కన్నీటి అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు.. సర్బ్‌జిత్

తారాగణం:
ఐశ్వర్యారాయ్, రణదీప్ హూడా, రిచా చద్దా, శివానీ సైనీ, అంకుర్ భాటియా తదితరులు
సంగీతం:
జీత్ గంగూలీ, అమాల్ మాలిక్
సినిమాటోగ్రఫీ:
కిరణ్ డియోహన్స్
కథ: ఉత్కర్షిణి వశిష్ఠ
నిర్మాతలు:
సందీప్ సింగ్, దీప్‌శిఖ దేశ్‌ముఖ్
దర్శకత్వం: ఓమంగ్ కుమార్
***

ఇటీవలి కాలంలో -‘సర్బ్‌జిత్’ వాస్తవ సంఘటనలు మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. మానవత్వం ఉన్న ప్రతి మదిలోనూ అలజడి సృష్టించింది. హృదయం ద్రవిస్తుంది. తెలీకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఉగ్రవాదంతో సంబంధం లేని ఒక వ్యక్తి రాజకీయ సైనిక వ్యవస్థ చీకటి తెరల మాటున ఎలా నలిగిపోయిందీ తరచిచూస్తే -మనసు క్షోభిస్తుంది. యధార్థ సంఘటనల సమాహారంలో ఈ కథ ఇలా ఉంది. పాకిస్తాన్ సరిహద్దు గ్రామంలో నివసించే సర్బ్‌జిత్ జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటన. తీవ్రవాదం ముసురుకొన్న సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆ వ్యక్తిని పాకిస్తాన్ సైనికులు బంధించి జైల్లో పెడతారు. లాహోర్‌లోనూ.. ఫైసలాబాద్‌లోనూ జరిగిన బాంబు పేలుళ్లలో 14మంది హతం కావటానికి కారకుడని అభియోగం. ఇది 1990లో జరిగింది. అంటే బాంబు దాడి జరిగిన మూడు నెలలు.. అప్పట్నుంచీ సర్బ్‌జిత్ ‘కనిపించటం లేద’న్న వార్త పత్రికల్లోనూ, ఛానెల్స్‌లోనూ కనిపిస్తూనే ఉంది. ఇండియన్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కథనాలూ.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు కథనాలతో.. సర్బ్‌జిత్ రెండు దశాబ్దాలుగా జైళ్ల గోడల మధ్య చీకటి మాటున మగ్గిపోయాడు. సర్బ్‌జిత్ సహోదరి దల్బీర్ కౌర్ పోరాటం వల్ల ఈ ‘రహస్య’ జైలు జీవితం లోకానికి విదితమైంది. అనేక స్వచ్ఛంద సంస్థలూ.. సామాజికవేత్తలూ ఆ పోరాటంలో మమేకమయ్యారు. ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. సర్బ్‌జిత్‌ని విడుదల చేస్తామని. ఐతే- అది ఆచరణలోకి రాకమునుపే మళ్లీ పరిస్థితి తిరగబడింది. పోరాటం కొనసాగింది. ఆఖరికి -లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో సర్బ్‌జిత్ విడుదలకు రంగం సిద్ధమైన నాటి రాత్రి తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన సర్బ్‌జిత్ జిన్నా ఆస్పత్రిలో ఆరు రోజుల తర్వాత మరణించటం అత్యంత విషాదం. టూకీగా ఇదీ కథ. ఈ యధార్థ జీవితం మనసుని కలచివేస్తుంది.
సర్బ్‌జిత్ వాస్తవాల్ని తరచి చూసిన ఎవరికైనా ఒక వ్యక్తి అమానుషంగా చిత్రహింసల పాలవటం.. మానసికంగా వేదనకు గురి కావటం -ఒళ్లు గగురొడ్పుస్తుంది. తీవ్రవాదంతో సంబంధం లేని (?) వ్యక్తిపట్ల ఒక ప్రభుత్వం అంతగా తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నించాలనిపిస్తుంది. ఇదంతా వాస్తవానికి మరోవైపు.
సినిమా విషయానికి వచ్చేసరికి -ఆ జీవితం తాలూకు వేదనని ప్రేక్షకుడు ఫీల్ కాకపోవటానికి ఓ కారణం కన్పిస్తోంది. చిత్రం డాక్యుమెంటరీ తీరున నడవటం. ఐతే- కొన్ని కొన్ని సన్నివేశాలు రోమాంచితంగా నడిచాయి. థియేటర్‌లోంచి లేచి తిరుగుబాటు చేయాలన్నంతగా. అదీ ‘సర్బ్‌జిత్’ కోణంలోంచి చూస్తే. రణదీప్ హూడా కోసం ఈ సినిమా చూడాలి. అతగాడిది నటన కాదు, సర్బ్‌జిత్ పాత్రలో జీవించాడు. ఆ పాత్ర కోసం పుట్టినట్టుగా అనిపించాడు. కానీ -గ్లామర్ ఐశ్వర్య ‘దల్బీర్’ పాత్రని తనలో జీర్ణించుకోలేక పోయింది. ఐశ్వర్యగానే కనిపించింది- ఎంతగా తాపత్రయ పడినప్పటికీ. ఫిజిక్‌లో ఆ నేచురాలిటీ కనిపించలేదు. సహోదరుడి కోసం రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తూన్న వ్యక్తిలా అనిపించదు. ఉన్నంతలో రిచా చద్దా (సర్బ్‌జిత్ భార్య పాత్రలో) చక్కగా నటించింది.
18 సంవత్సరాల ఖైదు తర్వాత -ఒక్కసారిగా తన కుటుంబాన్ని చూస్తున్నానన్న ఆనందాన్ని ఒలికించే సన్నివేశంలో రణదీప్ కన్నీళ్లు తెప్పిస్తాడు. అప్పటికే చిక్కిశల్యమై.. సజీవ శవంలా కనిపించే అతడు ఒక జీవితాన్ని పోగొట్టుకున్నాడన్న విషాద ఛాయలు ప్రేక్షకుడిలో ఒక్క క్షణం మెరిసి మాయమవుతాయి. ఎర్రకోట వద్ద ర్యాలీ.. లాహోర్‌లో జరిపిన పోరాట సన్నివేశాలు.. సర్బ్‌జిత్ మగ్గిన జైలు గోడల చీకటి వెలుతురు.. ఇలా ప్రతి సన్నివేశాన్నీ అందంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. కథలో పటుత్వం ఉంది. ఐతే -కథలో పూర్తిగా లీనమయితే తప్ప ఆ బాధ అర్థంకాదు. సినిమాలా కాకండా -వాస్తవ సంఘటనగా చూస్తే ‘సర్బ్‌జిత్’ మరో వేదనాభరిత వాస్తవికత. ‘యాంటీ -పాకిస్తానీ’ చిత్రంగా భావించిన పాకిస్తాన్ సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని నిషేధించింది.

-ప్రనీల్