రివ్యూ

విధ్వంసమే రామ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినయ విధేయ రామ ** ఫర్వాలేదు
**
నటీనటులు:రామ్‌చరణ్, కైరా అద్వాని, వివేక్ ఓబెరాయ్, ప్రశాంత్, స్నేహ, మహేష్ మంజ్రేకర్ తదితరులు
మాటలు:ఎం.రత్నం
డీవోపీ:రిషి పంజాబి -ఆర్థర్ విల్సన్
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత:డి.వి.వి.దానయ్య
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:బోయపాటి శ్రీను
**
రామ్‌చరణ్ గత ఏడాది రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. మాస్ జనాలకు దగ్గరయ్యేందుకు ఈసారి మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో వినయ విధేయ రామగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్.. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలను రేకెత్తించింది. మరి ఈ విధేయ రామ ఆ అంచనాలను నిలబెట్టుకున్నాడా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
అనాథలైన నలుగురు చిన్న పిల్లలకు రైల్వే ట్రాక్ పక్కన దొరుకుతాడు రామ్ (రామ్‌చరణ్). తరువాత ఈ ఐదుగురూ ఒక పెద్ద మనిషి అండతో కష్టపడి పెరిగి పెద్దవాళ్లవుతారు. తనను చేరదీసిన అన్నలతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ ఏర్పడుతుంది. నలుగురు అన్నయ్యల కోసం ప్రాణం పెట్టేస్తాడు. వారి జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టడు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన తన పెద్దన్నయ్య భువన్‌కుమార్ (ప్రశాంత్)కు ఎదురయ్యే ప్రతి సమస్యకు అతను పరిష్కారంగా నిలుస్తుంటాడు. ఎన్నికల అధికారిగా బీహార్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. బీహార్లో అందరిని శాసించి రౌడీ రాజ్యాన్ని నడిపిస్తున్న రాజా భాయ్ (వివేక్ ఒబెరాయ్)ని ఎదురించబోయి చిక్కుల్లో పడతాడు రామ్ అన్నయ్య. ఈ పరిస్థితుల్లో రామ్ ఏమి చేశాడు.. రాజాను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పక్కా మాస్ మసాలా మూవీ చేయలేదు అని ఫీలవుతున్న అభిమానుల కోరికని ‘వినయ విధేయ రామ’తో తీర్చాసాడు. చరణ్ ఫెర్‌ఫార్‌మెన్స్ విషయానికి వస్తే, రామ్.. రామ్ కొణిదెల పాత్రలో అదరగొట్టేశాడు. గతంలో రామ్‌చరణ్ మాస్ పాత్రలు చేసినప్పటికీ ఇంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారైతే, అంతకుమించిన తన పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతోప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. రంగస్థలంతో నటుడిగా గొప్ప పేరు సంపాదించి.. మరపురాని విజయాన్ని అందుకున్న రామ్‌చరణ్.. దాని తర్వాత ఇలాంటి సినిమా చేయడం విచారకరమైన విషయం. చరణ్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి యాక్సెప్టెన్స్ వస్తున్న సమయంలో ఇలాంటి సినిమా ఖచ్చితంగా అతడికి బ్రేక్ వేసేదే. యాక్షన్ సన్నివేశాల్లో.. డాన్సుల్లో అతను ఎప్పట్లాగే రాణించాడు. హీరోయిన్ కైరా అద్వానీ కేవలం పాటలకు మాత్రమే పనికొచ్చింది. ఆమె అందంగా కనిపించింది. విలన్ వివేక్ ఒబెరాయ్ దర్శకుడు చెప్పినట్లు చేసుకుపోయాడు. అతడి పాత్ర ఏమీ ఆసక్తి రేకెత్తించదు. ప్రశాంత్, స్నేహలకు కొంచెం ప్రాముఖ్యత ఇచ్చారు. సినిమాలో మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు.
టెక్నికల్ విషయాలకొస్తే.. దేవిశ్రీప్రసాద్ సంగీతం యావరేజ్.. నేపథ్య సంగీతంలోనూ ఏ ప్రత్యేకతా లేదు. దాదాపు సినిమా మొత్తం ‘ఎవడు’ తరహా ఆర్‌ఆర్ ఇచ్చేశాడు. రిషి పంజాబి.. ఆర్థర్ విల్సన్ అందించిన ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకేమీ ఢోకాలేదు. కావాల్సినంత ఖర్చుపెట్టారు. ఇక బోయపాటి శ్రీను మాస్ సినిమా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తీసినట్లు అనిపిస్తుంది. కథలో ఏ కొత్తదనం లేదు. కథనమూ అంతంతే. ఇంతకుముందులా యాక్షన్ ఘట్టాల్లో అతను ప్రేక్షకుల్లో భావోద్వేగాల్ని రగల్చలేకపోయాడు. ఎమోషన్ లేకుండా ఊరికే యాక్షన్ ఘట్టాలతో సినిమా నింపేశాడు. దర్శకుడిగా పూర్తిగా విఫలమయ్యాడు. ఈమధ్య తెలుగు సినిమా చాలా మారిపోయింది. దర్శకులు.. హీరోలు కొత్తదనం వైపు అడుగులేస్తున్నారు. వినూత్నమైన సినిమాలకు ప్రేక్షకులూ పట్టం కడుతున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా ఒక ఫార్ములా ప్రకారం మాస్ మసాలా సినిమాలు తీసుకుంటూ సాగిపోతున్నాడు బోయపాటి శ్రీను. ఎంత ఫార్ములాను అనుసరించినా.. తన హీరోతో తెరపైన ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయాడు.
అలవాటైన కథకు ఆసక్తికర నేపథ్యం జోడించడంలో.. ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్టయ్యేలా చెప్పడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. రామ్‌చరణ్ లాంటి పెద్ద మాస్ హీరో దొరికాడు కాబట్టి.. అతడిని ఎంత బలంగా చూపిద్దాం.. ఎలాంటి విన్యాసాలు చేయిద్దాం అన్నదే అతడి ఆలోచనగా మారినట్లు అనిపిస్తుంది. సినిమా అంతా హీరో చేసేది విధ్వంసమే. బీహార్ రాష్ట్రానికి సిఎం అయిన వ్యక్తి వందల మంది కమాండోలతో కలిసి తెలుగు రాష్ట్రంలో వున్న హీరో దగ్గరికి వచ్చి అంటాడు.. ‘‘మా రాష్ట్రానికి ఒకప్పుడు బుద్ధుడొచ్చాడు. తర్వాత నువ్వొచ్చి మా దగ్గర జరుగుతున్న అరాచకాల్ని ఆపావు’’ అని. ‘సింహాద్రి’ రోజుల్లో ఇలాంటి ఎలివేషన్లు బాగానే అనిపించి ఉండొచ్చు కానీ.. ఇలాంటివి చూసి చూసి విసుగెత్తిపోయి కొత్త కథలకోసం ఆసక్తిగా చూస్తున్నారు సినిమా జనాలు. ఇపుడు బోయపాటి మళ్లీ ఇలాంటి ఎలివేషన్లు ట్రై చేశాడు. హీరో ఉన్నట్లుండి ఊడిపడి మరెక్కడో వున్న అతడి రౌడీల్ని కొట్టుకుంటూ అదే ఆఫీసుకు తీసుకొచ్చి తన ప్రతాపం చూపించడం... ఎక్కడో బీహార్‌లోని ఒక మారుమూల కొండ ప్రాంతం నుంచి తన అన్నయ్య కాపాడమంటూ ఫోన్ చేయగానే ఇంకెక్కడో ఎయిర్‌పోర్టులో వున్న హీరో అద్దాలు పగులగొట్టుకొని క్రిందికి దూకేసి, ఇంకొంచెం ముందుకొచ్చి ఫ్లైఓవర్‌మీదినుంచి శరవేగంగా దూసుకెళ్తున్న ట్రైన్‌మీదికి దూకేసి బీహార్‌కు వెళ్ళడం.. అక్కడనుంచి గుర్రమేసుకుని విలన్ డెన్‌లోకి ఎంట్రీ ఇచ్చి విలన్లను ఉతికారేయడం.. ఇలాంటి అరచాకాలు ఎన్నో. ఫ్యామిలీ సెంటిమెంట్.. కామెడీ ట్రాక్.. లవ్‌ట్రాక్స్ అన్నీ ఉన్నా కూడా.. వినయ విధేయ రామ అనే టైటిల్ కాకుండా.. విధ్వంస రామ అంటే బాగుండేది.

-త్రివేది