రివ్యూ

మరోసారీ అఖిల్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** మిస్టర్ మజ్ను
**
నటీనటులు: అఖిల్, నిధి అగర్వాల్, రావు రమేష్, నాగబాబు, ప్రియదర్శి, పవిత్ర లోకేష్, సితార, హైపర్ ఆదితదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: జార్జ్ సి విలియమ్స్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: బీవీఎస్‌ఎన్ ప్రసాద్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
**
అక్కినేని మూడోతరం వారసుడు హీరోగా అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా -మొదటి సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు అఖిల్. రెండో ప్రయత్నంగా ‘హలో’ అని పలకరించినా -ప్రేక్షకుడు పలకలేదు. ఈసారి తనదైన ప్రేమకథతో ప్రేక్షకుడిని ఆకట్టుకోడానికి అఖిల్ చేసిన ప్రయత్నమే -మిస్టర్ మజ్ను. తొలిప్రేమతో సత్తాచాటిన వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుడి ముందుకొచ్చిన ‘మిస్టర్ మజ్ను’ ఆకట్టుకున్నాడో లేదో చూద్దాం.
కథ
విక్కీ (అఖిల్) ప్లేబాయ్. అందమైన అమ్మాయిలను నిమిషాల్లో పడేసే రకం. కొద్దిరోజుల రొమాంటిక్ జర్నీ తరువాత విడిపోవడం అతని హ్యాబీ. ఇలా పదుల సంఖ్యలో అమ్మాయిలతో ప్రేమాయణం సాగించిన విక్కీకి -అనుకోకుండా తారసపడుతుంది నికిత (నిధి అగర్వాల్). తనకు కాబోయేవాడు రాముడై ఉండాలన్నది నిక్కీ ఆశ. అపోజిట్ అభిప్రాయాలతో వున్న వీరిమధ్య అనేక సంఘటనలు, అగచాట్ల తరువాత ప్రేమ ఫలిస్తుంది. ముందు విక్కీ అంటే పడని నిక్కీ, తర్వాత అతడి వ్యక్తిత్వం నచ్చి ప్రేమిస్తుంది. విక్కీ కూడా అంగీకరిస్తాడు. కొద్దిరోజుల జర్నీ తరువాత ఆమెతీరుతో విరక్తి చెందాడని తెలుసుకున్న నిక్కీ, విక్కీకి దూరమవుతుంది. అలా ఆమె దూరమవ్వడంతో విక్కీ నిజంగానే నిక్కీని ప్రేమించానని తెలుసుకుని దగ్గరయ్యేందుకు ఏం చేశాడన్నది మిగతాకథ.
ప్లేబాయ్‌గా, సీరియస్ లవర్ పాత్రలో అఖిల్ ఓకే అనిపించాడు. లుక్స్, స్టైలిష్ మూమెంట్స్, బాడీలాంగ్వేజ్‌లో కొత్తదనం చూపించడానికి చేసిన వర్కౌట్స్ ఫలించాయనే అనొచ్చు. కానీ అఖిల్ అప్పియరెన్స్‌కు ఏమాత్రం సూట్‌కాని భావోద్వేగ సన్నివేశాల్లో మాత్రం తేలిపోయాడు. ఎమోషనల్ సీన్ స్క్రీన్‌మీద వెళ్లిపోతున్నా -దాన్ని ఫీలవ్వాల్సిన ఆడియన్స్ మాత్రం అఖిల్‌తో జర్నీ చేయలేకపోయాడు. డ్యాన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో అఖిల్ కాస్త ముందుకొచ్చినట్టే. అఖిల్ చుట్టూ ఒకరకమైన నెగెటివిటీ ముసురుకున్న నేపథ్యంలో అతడి కెరీర్‌ను పైకి తెచ్చేందుకు ఒక మిరాకిల్‌లాంటి సినిమా అవసరం. ‘మిస్టర్ మజ్ను’ సినిమా ఒక దశవరకు సాగే తీరు చూస్తే మిరాకిల్స్ జరక్కపోయినా.. అఖిల్‌కు ఇదొక డీసెంట్ మూవీ అవుతుందనే అనుకుంటాం. తొలి రెండు సినిమాల్లో మాదిరి నేలవిడిచి సాము చేయకుండా, అందరికీ తెలిసిన సింపుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీలో ఒదిగిపోయేందుకు అఖిల్ సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నట్టే కనిపించింది. హీరోయిన్ నిధి అగర్వాల్ జస్ట్ ఓకె అనిపించింది. ఆమె పాత్రకు సెట్టయ్యింది కానీ ప్రత్యేకతను చూపించలేకపోయింది. ప్రియదర్శి అక్కడక్కడా నవ్వించాడు. రావురమేష్, జయప్రకాష్, నాగబాబు, సితార, పవిత్ర లోకేష్, రాజా వీళ్లంతా పాత్రలకు తగిన ప్రాధాన్యత చూపించారు. హైపర్ ఆది యావరేజ్ కితకితలు పెట్టాడు.
టెక్నికల్ అంశాల్లో మొదట మ్యూజిక్‌ను చెప్పుకోవాలి. తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా రీరికార్డింగ్ బావుంది. అయితే, టైటిల్ సాంగ్ వినా పాటలు మాత్రం సినిమాలో ఆశించినంత ప్రభావాన్ని చూపించలేదు. జార్జ్ విలియమ్స్ విజువల్స్ సినిమాకు మరో అట్రాక్షన్. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నిర్మాత రాజీపడలేదు. దర్శకుడు వెంకీ అట్లూరి తన తొలి సినిమా తొలిప్రేమ ఫార్ములానే ఇక్కడా ఫాలో అయిపోయాడు. ప్రథమార్థంలో లవ్ బ్రేకప్, ద్వితీయార్థంలో కలవడం అనే అంశాలపై కథ నడిపాడు. స్క్రీన్‌ప్లేలో పదును లేదు. యూత్, ఫ్యామిలీస్ మెచ్చేలా కొన్ని సన్నివేశాలు తీర్చిదిద్దినా, ఔట్‌పుట్ నిరాశపర్చింది. ముఖ్యంగా ప్రేమకథలో ఫీల్ తీసుకురావడంలో ఫలితం దక్కలేదు. ప్రథమార్థం వరకూ ఏదోలా ఎంగేజ్ అవుతాం కానీ, ప్రేమకథలో ఫీల్ టచ్ చేయదు. హీరో ప్లేబాయ్, అయినా హీరోయిన్‌తో లవ్‌లో పడటం కనెక్టివిటీ కుదరలేదు. ఇద్దరూ కలవడానికిగానీ, విడిపోవడానికిగాని దారితీసిన పరిస్థితులు ఎఫెక్టివ్‌గా లేవు.
భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా హీరో క్యారెక్టరైజేషన్‌తో, అలాగే కొన్ని సన్నివేశాలతో ఆకట్టుకున్నప్పటికీ, కథ సెకెండ్ హాఫ్ మాత్రం పూర్తిస్థాయిలో రుచించదు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్‌లో హీరోయిన్ హీరోని రిజెక్ట్ చేసే సన్నివేశాలు, అసలు హీరోను అంతగా రిజెక్ట్ చేయడానికి చూపించే కారణాలు బలంగా లేకపోవడం, హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌లో సరైన క్లారిటీ లేకపోవడంలాంటి అంశాలు సినిమాకి బలహీనతలు. అయితే అఖిల్ తన లుక్స్, పెర్‌ఫార్మెన్స్‌తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. నిధి అగర్వాల్ నటన ఓకే. మొత్తంమీద అక్కినేని అభిమానులకు సినిమా నచ్చేస్తుంది. ప్లేబాయ్‌లా ఉండే కుర్రాడు సీరియస్ ప్రేమికుడిగా మారే పరిణామం కథలతో దశాబ్దాలుగా సినిమాలు వచ్చాయి. వీటిలో చాలావరకు విజయవంతమైనవే. కథ పాతదైనా ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథను నడిపిస్తే సక్సెస్ కష్టం కాదు. ఈ చిత్రంలోనూ ఇటు సెంటిమెంట్ అటు యాక్షన్ పార్ట్ ఓకే అనిపించారు. ఆరంభంలో ఆసక్తికరంగా అనిపించినా క్రమేపీ బలహీనమైన కథ, విసుగు తెప్పించే ప్రజెంటేషన్ మాత్రం నిరాశకు గురి చేస్తాయి.

-త్రివేది