రివ్యూ

సరికొత్త ప్రేమ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా *** బాగుంది
***
తారాగణం: అనిల్ కఫూర్, సోనమ్ కఫూర్, రాజ్‌కుమార్‌రావ్, జూహీచావ్లా, రెజీనా కాసాండ్రా, మధుమల్తి కఫూర్, అభిషేక్ దుహన్, అబ్దుల్ ఖాదిర్ అమిన్, బ్రిజేంద్ర కళ
సంగీతం: రోచక్ కోహ్లీ, సంజయ్ వాండ్రేకర్, అతుల్ రెనింగ్
సినిమాటోగ్రఫీ: హిమన్ ధమీజా, రంగరాజన్ రాంభద్రన్
నిర్మాత: విధు వినోద్ చోప్రా
కథ: గజల్ ధలివాల్, షెల్లీ చోప్రా ధర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: షెల్లీ చోప్రా ధర్
***
వచ్చిన ప్రతి అవకాశానికీ ఓకే చెప్పేయకుండా సెలెక్టెడ్‌గా సినిమాలు ఎంపిక చేసుకోవడం -సోనమ్ కఫూర్ స్టయిల్. గ్లామర్ టచ్‌తోపాటు తన పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలనే ఇప్పటి వరకూ చేస్తూ వచ్చింది. ఆ కోవలో ‘నీర్జా’ సినిమాతో జాతీయ అవార్డు అందుకుంది. ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఖుబ్‌సూరత్, వీరే ది వెడ్డింగ్, సంజు, ప్యాడ్‌మాన్‌లాంటి చిత్రాలను చూస్తే -సోనమ్ తన సినిమాల ఎంపికలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందన్న విషయం అర్థమవుతుంది. గత ఏడాది ‘వీరే ది వెడ్డింగ్’ ఊహించని స్థాయిలో విజయం అందుకుంటే -ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రం చేసింది. తండ్రి అనిల్ కఫూర్ నటించిన ‘1942-ఏ లవ్ స్టోరీ’ సినిమాలోని పాటే ఆమె సినిమా టైటిల్ కావడం, ఈ సినిమాలో అనిల్, సోనమ్ రీల్ లైఫ్ తండ్రీ కూతుళ్ల పాత్రల్లో కనిపించటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. గత ఏడాది స్ర్తితో సంచలన విజయాన్ని అందుకున్న రాజ్‌కుమార్ రావ్‌తో జోడీకట్టిన సోమన్ కఫూర్ -ఇద్దరూ మరో విజయాన్ని సొంతం చేసుకున్నారో లేదో సమీక్షలో చూద్దాం.
కథ:
పంజాబీ సంప్రదాయ కుటుంబంలో పుట్టిన గారాలపట్టి స్వీటీ చౌదరి (సోనం కఫూర్). పెద్దాయ్యాక వేడుకలా జరగాల్సిన పెళ్లి వైభోగాన్ని ఊహించుకుంటున్న స్వీటీ సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. ఆ కలల్లోనే స్వీటీ పెద్దదవుతుంది. ఈడొచ్చిన స్వీటీకి పెళ్లి చేద్దామన్న ప్రతిపాదన తెస్తాడు బల్బీర్ చౌదరి (అనిల్ కఫూర్) కొడుకు అభిషేక్ దుహన్. ఇందుకు ఇంట్లోవాళ్లంతా ఆనందడోలికల్లో మునిగిపోతారు. కానీ పెళ్లిపై స్వీటీ అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఇంట్లోవాళ్లు ప్రయత్నించరు. ఇది జరుగుతున్న టైంలోనే స్వీటీని షహీల్ మీర్జా (రాజ్‌కుమార్ రావ్) కలుస్తాడు. షహీల్‌ను ఇష్టపడుతుంది స్వీటీ. వీరి ప్రేమకు ఇంట్లోవాళ్లు అంగీకారం తెలుపడంతో కథ సుఖాంతం అనుకుంటాం. అంతలోనే అనుకోని అవాంతరం ఎదురవుతుంది. చాలాకాలంగా తనలోనే దాచుకున్న నిజాన్ని బహిర్గతం చేయాలనుకుంటుంది స్వీటీ. కానీ తనవాళ్లు ఏమనుకుంటారోనన్న ఆందోళన, సామాజిక భయంతో మనసులోనే దాచేస్తుంది. చివరకు తాను ఇష్టపడిన షహీల్‌తో వద్ద ఆ రహస్యాన్ని బహిర్గతం చేస్తుంది. స్వీటీ చెప్పిన రహస్యమేంటి? షహీల్‌కే ఎందుకు చేప్పింది? ప్రేమికుల పెళ్లి జరిగిందా? ఈ ప్రశ్నలకు స్క్రీన్ మీద చూపించిన సమాధానాలే -ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా.
**
అప్పుడెప్పుడో అనిల్‌కఫూర్ చేసిన -1942 లవ్ స్టోరీతో ప్రేమకథల తీరు మారిపోయింది. ప్రేమలోని సున్నితత్వం, అభివ్యక్తీకరణను ఆ చిత్రంలో మనసుకు హత్తుకునేలా చెప్పడంతో గ్రేట్ లవ్ స్టోరీగా చరిత్రకెక్కింది. ఇప్పుడు అనిల్ కుమార్తె సోనమ్ చేసిన ప్రేమకథనూ అంతస్థాయిలో అన్వయించుకోకుండా ఉండలేం. అయితే, ఇక్కడ ప్రేమను సరికొత్త కోణంలో ప్రతిబింబించిన తీరు అద్భుతం. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాల కోవలో -‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’కూ స్థానం దక్కుతుందని కచ్చితంగా చెప్పొచ్చు. స్వలింగ సంపర్కం కానె్సప్ట్‌తో గజల్ ధలి వాల్, షెర్లీ చొప్రాధర్‌లు రాసుకున్న కథే సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లగలిగే స్పాన్ ఉంది. ఇలాంటి కథలో లీడ్‌రోల్ చేయడానికి సోనం అంగీకరించడాన్నిబట్టే -ఆమె గట్స్‌ను అంచనా వేసుకోవచ్చు. కళ్లముందు సాగుతోన్న కొత్త అనుభవం కనుక -ప్రతి సన్నివేశాన్ని ఆసక్తితో ఆలోచనతో చూస్తుంటాం. అసలు కథలోకి ఆడియన్స్‌ని తీసుకెళ్లడానికి ఒక మూడ్ క్రియేట్ చేయాలి కనుక -ప్రథమార్థంలోని సన్నివేశాలను పూర్తిగా అందుకే వాడుకుంది దర్శకురాలు షెర్లీ. స్వీటీ రహస్యం బహిర్గతమైన దగ్గర్నుంచీ -ద్వితీయార్థంలో అసలు కథ బిగింపుగా సాగుతుంది. సినిమాలో రాజ్‌కుమార్ రావు, సోనమ్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. అనుభవజ్ఞులైన జూహీ చావ్లా, అనిల్ కఫూర్‌లు -తమ పాత్రలతో బరువైన కథలో బోర్‌డమ్ లేకుండా చిత్రాన్ని ముందుకు నడిపించేశారు. సందర్భానికి తగిన సాహిత్యంతో పాటలు ఆకట్టుకుంటాయి.
ఈ సినిమాలో ఫలానా నటి, నటుడు బాగా చేశారని చెప్పాలన్న ఆలోచన ఎక్కడా రాదు. కాకపోతే అనిల్, సోనమ్‌ల పాత్రలు కీలకం కనుక -ఎక్కువ భాగం స్క్రీన్‌మీద చూస్తాం. అందం, అభినయంతో సోనమ్ ఆకట్టుకుంది. పాత్రకు తగిన భావోద్వేగం, భయం, ఆందోళనలను అద్భుతంగా పలికించింది. అనిల్ కఫూర్ పాత్ర అతనికి టైలర్ మేడ్. ఎప్పటిలాగే హస్య చతురతతో నవ్విస్తూనే, భావోద్వేగపు సన్నివేశాల్లో గుండెను మెలితిప్పాడు. వయసు మీదపడుతున్నా జూహీచావ్లాలో ఏమాత్రం అందం తగ్గలేదనడానికి ఈ చిత్రాన్ని ఉదహరించొచ్చు. తన కామెడీ టైమింగ్‌తోనూ ఆమె సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక రాజ్‌కుమార్ రావ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గత ఏడాది వచ్చిన ‘స్ర్తి’ చిత్రంలో తన స్టామినాను ప్రూవ్ చేసుకున్న రాజ్‌కుమార్ -ఈ చిత్రంలో మరింతగా స్క్రీన్ ప్రజెన్స్ ఇచ్చాడు. సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రను అంత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. కుహూ పాత్ర పోషించిన రెజీనా చిత్రానికి టర్నింగ్ పాయింట్. నిడివి తక్కువ ఉన్న పాత్రే అయినా -ఉన్నంతలో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది. ఈ పాత్రకు రెజీనాను ఎంపిక చేసుకోవడం దర్శకురాలి ప్రతిభనే చెప్పాలి. మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు.
స్వలింగ్ సంపర్కం -కానె్సప్ట్‌ను ఎత్తుకుని సంప్రదాయ కుటుంబంలోని ఓ అందమైన అమ్మాయికి అన్వయించి కథ రాసుకోవడం, దాన్ని అంతే నిజాయితీగా తెరకెక్కించిన విధానంలో దర్శకురాలి ప్రతిభ కనిపించింది. కథ, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు.. ఇలా ఏ విభాగాన్నీ తక్కువగా చేసి చూపించలేం. ఓ సినిమాకు కావాల్సిన సమపాళ్ల మేళవింపుతో -‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

-ప్రవవి