రివ్యూ

భరించడం కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకల కళావల్లభుడు * బాగోలేదు
*
తారాగణం: తనిష్క్‌రెడ్డి, మేఘాల ముక్త, చిన్నా, సుమన్
సంగీతం: అజయ్
దర్శకత్వం: శివగణేష్
*
ఇటీవలి కాలంలో చిన్న బడ్జెట్ చిత్రాలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. సినిమా జయాపజయాల మాటెలావున్నా కొన్ని చిత్రాలు చక్కని కథతో ప్రశంసలు అందుకుంటుంటే, ఎక్కువ శాతం సినిమాలు ఆడియన్స్‌ని నసపెడుతున్నవే. ఇలాంటి వాటిలో సినిమాపై ఫ్యాషన్‌తోకంటే ఏదో సినిమా తీసేశాంలే అన్న బాపతే ఎక్కువ. తనిష్క్‌రెడ్డి, మేఘల ముక్త హీరో హీరోయిన్లుగా శివగణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -సకల కళావల్లభుడు. టైటిల్‌లోనే హీరో పాత్ర చెప్పేసారు. మరి వల్లభుడు చేసిన పనులేమిటో, చిన్న బడ్జెట్ చిత్రంగా వచ్చిన సినిమా తీరేంటో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాలి.
కథ:
తనిష్క్ (తనిష్క్‌రెడ్డి), చైత్ర (మేఘాల ముక్తా)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ చైత్రకు ఇతగాడి ప్రవర్తన నచ్చక దూరం పెడుతుంది. ఎంతగా వెంటపడినా ప్రేమించేది లేదని తెగేసి చెప్పేస్తుంది. ఈక్రమంలో అనుకోకుండా చైత్ర కిడ్నాప్‌నకు గురవుతుంది. ఇంతకీ చైత్రను కిడ్నాప్ చేసిందెవరు? ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు? చివరికి తనిష్క్ లవ్‌ని ఆమె అంగీకరించిందా? ఆమె గతమేంటి? వీటికి సమాధానమే మిగతా సినిమా.
హీరో తనిష్క్‌రెడ్డి పాత్రవరకు ఫర్వాలేదనిపించినా, నటనపరంగా బలహీనం అనిపించాడు. హీరో ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ పలకలేదు. చాలాకాలం తర్వాత నటుడు చిన్నాకు మంచి పాత్ర దొరికింది. తన కామెడీ టైమింగ్‌తో ఫస్ట్‌హాఫ్‌లో అక్కడక్కడ నవ్వించాడు. ఇక హీరోయిన్ మేఘాల ఉన్నంతలో ఓకే అనిపించింది తప్ప, తన పాత్రను రక్తికట్టించలేకపోయింది. దీనికితోడు ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు, హీరోయిన్ కిడ్నాప్‌నకు గురైన సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోవు. మిగతా నటీనటులు ఉన్నంతలో బాగానే చేశారు. సినిమా నిర్మాణ విలువకు తగిన సాంకేతిక నైపుణ్యమే కనిపించింది. అజయ్ సంగీతం, నేపథ్య సంగీతం నామమాత్రం. ముందే చెప్పుకున్నట్టు చిత్రాన్ని చుట్టేయడమే తప్ప, దర్శకుడు శివగణేష్ ప్రతిభ ఎక్కడా కనిపించదు. సిల్లీ సన్నివేశాలతో కథ, కథనంలో ఏమాత్రం బిగింపులేకుండా సినిమాను చుట్టేసినట్టే అనిపిస్తుంది. రొటీన్ లవ్ స్టోరీయే అయినా, కొత్త దర్శకులు తమ ప్రతిభను ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే వేసుకుని ఆడియన్స్‌ని కాసేపు కూర్చోబెట్టగలుగుతున్నారు. అలాంటి సన్నివేశాలు ఇందులో ఎక్కడా కనిపించవు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పూర్. రొమాంటిక్ ట్రాక్‌పై ఒకింత శ్రద్ధపెడితే బావుండేది. నిర్మాణ విలువలు బడ్జెట్‌కు తగినట్టే అనిపిస్తాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కనుక అక్కడక్కడా విజువల్సే ఆడియన్స్‌కి ఒకింత రిలీఫ్. హీరో పాత్రను గొప్పగా చూపించినా, నడిపించే విధానంతో బోర్ ఫీలవుతాం. ఫస్ట్‌హాఫ్‌తోనే విసుగు పుడితే, హీరోయిన్‌ను హీరో టీజ్ చేసే సీన్లు మరీ సిల్లీగా అనిపిస్తాయి. హీరోయిన్‌ను కాపాడేందుకు హీరో చేసే ట్రిక్స్ సిల్లీగా తోస్తాయి. కమెడియన్ పృథ్విరాజ్, జీవ పాత్రలు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాయి. చివరగా.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన సకల కళావల్లభుడు పూర్తిగా విసిగిస్తాడు. ఆకట్టుకోని కథ, బలంలేని కథనం, నవ్వుపుట్టించని కామెడీ.. వెరసి ఆడియన్స్‌కి సినిమా బోర్ కొట్టింది. ఏమాత్రం కళలు ప్రదర్శించలేని వల్లభుడు ప్రేక్షకులకు పూర్తిగా విసుగు తెప్పించాడు.

-త్రివేది