రివ్యూ

కళ తప్పిన పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు.. బ్రహ్మోత్సవం

తారాగణం:
మహేష్, సమంతా, కాజల్, ప్రణీత, సత్యరాజ్, రావు రమేష్, జయసుధ, రేవతి, తులసి, సీనియర్ నరేష్, జయప్రకాష్ రెడ్డి, వెనె్నల కిషోర్, షాయాజీ షిండే, ముఖేష్ రుషి, కృష్ణ్భగవాన్ తదితరులు

సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
ఫొటోగ్రఫీ: ఆర్ రత్నవేలు
బ్యానర్: పివిపి సినిమా,
మహేష్‌బాబు ప్రొడక్షన్స్ పై.లి.
నిర్మాతలు: పరమ్ వి పొట్లూరి,
కెవిన్ అనె్న
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
***

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ముకుంద లాంటి చిత్రాలతో ఆడియన్స్‌పై తన మార్క్ వేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. వరుసగా రెండు డిజాస్టర్ల తరువాత శ్రీమంతుడుతో ఊహించని బ్లాక్‌బస్టర్ అందుకున్న మహేష్‌బాబు. గ్లామర్‌కు ఏమాత్రం కొదువలేదన్నట్టు కాజల్, సమంత, ప్రణీతలాంటి హీరోయిన్లు. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే బడ్జెట్‌కు ఏమాత్రం వెనుకడుగువేయని పరమ్ వి పొట్లూరి, కెవిన్ అనె్నలాంటి నిర్మాతలు. ఒక ఫ్రేమ్‌లో ఎంతమంది తెలిసిన తారలున్నారో లెక్కపెట్టడానికే కన్ఫ్యూజయ్యేంత భారీ తారాగణం. ఇదీ -విడుదలకు ముందు కనిపించిన బ్రహ్మోత్సవం. దీంతో సహజంగానే ఆడియన్స్‌లో పల్స్‌రేటు పెరిగింది. చాలాకాలంగా ఊరిస్తున్న బ్రహ్మోత్సవం ఎట్టకేలకు విడుదలైంది.
**
నలుగురు కలిసి నలుగురితో పంచుకునే బతుకే -బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన సింగిల్ లైన్ స్టోరీ సూపర్‌స్టార్ మహేష్‌కు పిచ్చిగా నచ్చేసి ఉంటుంది. సోలో లైన్‌ను స్క్రీన్‌మీద ప్రజెంట్ చేయడానికి ఎవరి ఓపికమేరకు వాళ్లు కష్టపడ్డారు. కానీ -సినిమా మొదలైన దగ్గర్నుంచీ ఇంటర్వెల్ బ్యాంగ్ పడేవరకూ మదిలో మెదిలే ప్రశ్నకు సమాధానం దొరక్క ప్రేక్షకుడే కుర్చీలో కూలబడ్డాడు. స్క్రీన్‌మీద గ్రాండియర్‌గా సినిమా సాగిపోతున్నా -‘ఏం జరిగింది. ఏం జరుగుతుంది. ఏం జరగబోతోంది. నాకు తెలియాలి’ అన్న ఎంఎస్ నారాయణ పాపులర్ డైలాగ్ ప్రేక్షకుడిని వెంటాడుతుంది. ద్వితీయార్థం మొదలైన తరువాతగానీ సినిమా దేనిగురించి అన్న విషయం అర్థంకాదు.
నలుగురితో కలిసి ఉండాలని ఆశపడే సత్యరాజ్. నాన్న నమ్మిన బతుకు సిద్ధాంతాన్ని అనుసరించాలని తపనపడే కొడుకు మహేష్. ఈ ఇద్దరి అంతరంగాలే బ్రహోత్సవం కథ. ఫస్ట్ ఫ్రేమ్‌నుంచే లెక్కలేనంత తారాగణం (ఒకే కుటుంబం) ఆటపాటలు, సంబరాల్లో మునిగితేలుతూ బ్రహ్మానందాన్ని చూపిస్తారు. ఆ గొప్పింట్లో ఆనందం అర్థమవుతుంది తప్ప, కథేంటన్న అవగాహన మాత్రం కలగదు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆనందాల భవంతిమీద ఆస్ట్రేలియా నుంచి ఎగిరొచ్చిన కాజల్ వాలుతుంది. హీరోయిన్ రాక కథకు ట్విస్ట్‌మో అనుకున్న కొద్దిసేపటికే -రెండు పాటల భారం తప్ప ఆమె పాత్రేమీ లేదని తెలుస్తుంది.
‘చాలా ఎక్కువ బతికేసినట్టుందిరా’ అంటూ కొడుకు మహేష్‌తో తండ్రి సత్యరాజ్ చెప్పడం, శ్రీరాముడంతటి గొప్ప బావ మీద హనుమంతుడు లాంటి బావమరిది (రావు రమేష్) రివర్సవ్వడం.. వరుసగా వచ్చే సన్నివేశాలతో స్టోరీ కొత్తమలుపు తిరిగిందన్న ఫీలింగ్ మళ్లీ కలుగుతుంది. నలుగురు కలిసిబతికే కుటుంబం నుంచి ఒక్కడు బయటకు వెళ్లిపోవడం తట్టుకోలేని సత్యరాజ్ ఊపిరి ఆగిపోవడం ఇంటర్వెల్ బ్యాంగ్. కథ రసకందాయంలో పడిందిలే అనుకుంటూ ఉద్వేగంగా స్క్రీన్‌వైపు చూసిన ప్రేక్షకుడికి -ఆ ఆనందమూ ఎంతోసేపు మిగల్లేదు. అకస్మాత్తుగా -సమంతా సీన్లోకి రావడం, ఆమెను తీసుకుని హీరో తన మూలాలు వెతుక్కుంటూ నార్త్ ఇండియా టూర్‌కి వెళ్లిపోవడం... అంతే! అక్కడ్నుంచి కథ ఎటెటో పోయింది. అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాల మీద సుదీర్ఘంగా సంభాషణలు సాగిపోతాయిగానీ, ఏ ఒక్కటీ మనసుకు హత్తుకున్న భావన కలగలేదు.
ఇంటర్వెల్ నుంచి జర్నీ స్టోరీ మొదలవుతుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల బంధువులను వెతుక్కుంటూ ఉత్తర భారతం మొత్తం తిరిగొచ్చిన హీరో ప్రయాసకు -కథలో ఎక్కడా పే ఆఫ్ కనిపించదు. కలుపుకొచ్చిన బంధువులంతా క్లైమాక్స్ పెళ్లిలో ఓ మూల కూర్చుంటారే తప్ప, చాలా ఏళ్ల తరువాత కొన్ని తరాలు కలిసిన ఆనందాన్ని హైలెట్ చేసే సన్నివేశాలు పడలేదు. ప్రథమార్థంలో కథను మలుపుతిప్పే సమస్య రావు రమేషే అయినా, పతాక సన్నివేశంలోగానీ మళ్లీ కనిపించక పోవడం చూస్తే -బ్రహ్మోత్సవంలో బలమెంతో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు సన్నివేశాల్లో సీక్వెన్స్ కొరవడటం, పద్ధతిగా ప్రయాణించాల్సిన కథకు అడ్డుపడుతూ అధాటుగా పాటలు రావడం.. విసుగుపుట్టించింది.
ఇంతమందితో కలిసుండటం కష్టం -అన్న కాజల్ డైలాగ్‌తోనూ, ఇంతమంది లేకుంటే బతకడం కష్టమన్న -సమంతా డైలాగ్‌తోనూ ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అవుతాంగానీ ఆ ఫీల్ ఎక్కువ సేపు నిలవదు.
చార్మింగ్ స్క్రీన్ ప్రజెన్స్‌తో మహేష్ మాత్రం ఆకట్టుకున్నాడు. నిత్యం బ్రహ్మోత్సవ వాతావరణం ఒక ఇంట్లో కనిపిస్తే ఎలా ఉంటుందో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అద్భుతమైన కెమెరా పనితనంతో చూపించాడు. ముగ్గురు హీరోయిన్లు, తెరనిండా తెలిసిన ఆర్టిస్టులు, గ్రాండియర్ లొకేషన్లు ఇవే థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్‌కి ఒకింత ఉపశమనం. ఇంటర్వెల్ బ్యాంగ్, పతాక సన్నివేశాల్లోని భావోద్వేగ గాఢత బ్రహోత్సవంలోని మిగతా లోటుపాట్లు గుర్తురాకుండా మాత్రం చేశాయి. భావోద్వేగాల్లోని బలాన్ని నమ్ముకుని తీసే కమర్షియల్ సినిమాల్లో కదిలించే సన్నివేశాలు, వినోదాన్ని అందించే సంభాషణలే ప్రాణం. అవి బ్రహ్మోత్సవంలో తక్కువవడంతో -కథలో లీనమవడానికి ఆడియన్స్ కారణాలు వెతుక్కోవాల్సి వచ్చింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మధ్యతరగతి కుటుంబంలోని ప్రేమ, అనుబంధాలను అత్యంత సహజంగా ఆవిష్కరించిన శ్రీకాంత్ అడ్డాల, ఈసారి ఆ మార్క్ వేయడంలో విఫలమయ్యాడు. సన్నివేశాలన్నీ యాంత్రీకంగా అనిపించాయే తప్ప, హృదయానికి హత్తుకున్నవి ఒకటో రెండో మాత్రమే కనిపిస్తాయి. నిడివి తక్కువ, పాత్రలెక్కువ కావడంతో -ఏ పాత్రనూ సరిగ్గా చిత్రీకరించలకపోయారు. మహేష్, సత్యరాజ్, రావు రమేష్‌లే సినిమా మొత్తాన్ని తమ భుజాలపై మోశారు. యానిమేషన్ క్యారెక్టర్‌గా రావు గోపాలరావును చూపించిన ప్రయోగం అద్భుతమే అయినా, ఆ స్థాయికి తగిన సంభాషణలు లేవు. అతి పెద్ద కుటుంబ చిత్రమే అయినా, అందుకు తగిన భావోద్వేగ సన్నివేశాలు లేని బ్రహ్మోత్సవాన్ని మహేష్ స్టార్‌డమ్ మాత్రమే నిలబెట్టాలి.

-ప్రవవి