రివ్యూ

కిక్కులేని కహానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవర్స్ డే ** ఫర్వాలేదు
**
తారాగణం: ప్రియాప్రకాష్ వారియర్, రోషన్ అబ్దుల్ రహూఫ్, నూరిన్ షరీఫ్, షియాచ్ షాజహాన్, అనీష్ మీనన్, ప్రదీప్ కొట్టాయం, యామీ సోనా
సంగీతం: షాన్ రెహమాన్
నిర్మాత: ఎ.గురురాజ్
కథ, దర్శకత్వం: ఒమర్ లల్లూ
**
సాధారణంగా ఏ చిత్ర విజయానికైనా ఆలంబనగా చిత్రంలోని కథా ప్రక్రియనే భావిస్తారు. కానీ ‘లవర్స్ డే’ విషయంలో మాత్రం కథానాయిక కన్నుగీటే ప్రక్రియనే విజయానికి కేంద్ర బిందువుగా భావించారు. దానికి తగ్గట్లు హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ ఓ పాటలో కన్నుగీటే విధానపు ప్రచార దృశ్యాన్ని చిత్ర బృందం గతేడాది ఫిబ్రవరిలో విడుదల చేసింది. అలా విడుదలైన ప్రచార చిత్రం ప్రభంజనంలా ప్రపంచమంతా వ్యాపించింది. దాంతో ఈ చిత్రాన్ని ఒకేసారి మలయాళం (ఒరు ఆదార్ లవ్)తోపాటు తెలుగు (లవర్స్ డే), తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. చిత్రం ఏమిటంటే, ఈ కన్నార్పి తీసే మ్యాజిక్ టీజర్‌కు పనిచేసినట్లు చిత్ర విజయంలో పనిచేయకపోవడం. అదేమిటో పరిశీలిద్దాం.
పనె్నండవ తరగతి చదివే విద్యార్థినీ విద్యార్థుల్లో ప్రేమ అంకురించడం, మధ్యలో అపార్థాలు రావడం, అనంతరం పోయిన ప్రేమ సాధనకై నాయకుడు, మరో అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లు నటించడం, మరి చివరాఖరుకు ఈ ఎపిసోడ్స్ ఎలా వెళ్తాయి అన్న దాంతో రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు చిత్రం పూర్తవడం జరుగుతుంది. ఈ మాదిరిగా లవ్ ట్రాక్ మారడం తదితరాలు మలయాళంలో కొత్తేమో కానీ, తెలుగుకు మాత్రం బహుపాతవే. ఎందుకంటే ప్రేమికుల రీ యూనియన్ కహానీల్లో ప్రధానంగా నాయకుని ప్రేమ మరొకరిపై మళ్లడం వంటివి జరిగేవే. అయితే సినిమా మొత్తం ఆహ్లాదంగా తీసేయాలన్న తలంపుతో అన్నిరకాల మసాలాలు దట్టించేసిన దర్శకుడు ఒమర్ లులు చిత్రాంతం విషాదాంతం చేయాలన్న తలంపే ఆశ్చర్యకరం. దీంతో ఏ కొద్దో గొప్పో ఓ వర్గపు ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనపర్చినా కథానాయికలో నాయకుని ప్రేమను నిలపాలన్న ఉద్దేశ్యంతో దగ్గరైన హీరో (రోషన్) ద్వితీయ కథానాయిక (నూరిన్ షరీఫ్)లు రౌడీల బీభత్సపు పోరాటాల్లో చావడాన్ని చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. అసలు ఆ టైపు ఎండింగ్ చిత్ర కథ రీత్యా కూడా ఆహ్వాన ఆలోచన కాదు. అయితే ప్రేమకథలన్నిటికీ ట్రాజెడీ ఎండింగే మలుపు అన్న పాత కానె్సప్టుకు పట్టం కట్టాలనే తలంపుతోనే ఒమర్ ఇందుకు ఒడిగట్టారేమో! ఇంకోరకంగా చూసినా అంటే గాధాజాక్స్ (సెకెండ్ హీరోయిన్ నూరిన్ షరీఫ్) పాత్రను తొలినుంచీ ఈ ప్రేమా, వగైరా నాకు సెట్ కావు అనే టైపుతో చిత్రీకరించారు. రోషన్‌తో ప్రేమ కూడా విడిపోయిన ప్రేమికుల్ని కలపడానికి ఉద్దేశించినదే కనుక ఆమె ఒప్పుకున్నట్లు చూపారు. మరి ఆమే అనంతరం ప్రేమలో నిజంగానే పడినట్లు చూపడం, తదనుగుణంగా రోషన్ (హీరో) స్పందించడం పరస్పర విరుద్ధ అంశాలు. దీనివల్ల చిత్రం పునాది అంశం పల్చబడిపోయింది. అలాగే చిత్రం మొత్తాన్ని ఒక వర్గపు ప్రేక్షకుల్నే లక్ష్యపెట్టుకున్నవారికి సైతం బోర్‌కొట్టేలా లెక్కలేనన్ని క్లాస్‌రూమ్ సీన్స్ పెట్టారిందులో. విద్యార్థుల్ని ఏ ఉపాధ్యాయుడూ పనె్నండవ తరగతి స్థాయిలో ‘ఏరా, ఒరేయ్’ అని సంబోధించే కాలం కాదిది. అయినా ఇందులో అలా పిలవడం ఏమాత్రం బావులేదు. దానికితోడు టీచర్స్‌ని సైతం శృతిమించిన పరస్పరాకర్షణ సన్నివేశాలను ఉపయోగించడం, స్టూడెంట్స్, లేడీ టీచర్‌తో ద్వందార్థాలు మాట్లాడడం ఏవిధంగా చూసినా హర్షణీయం కాదు. ఇవన్నీ చాలవన్నట్లు టీచర్స్ డే పేరిట ప్రదర్శించిన ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ నాటకాన్ని అపహాస్యంగా చూపడం, డైలాగ్స్ పలికించడం వంటివి ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇవన్నీ దర్శకుని చీప్ టేస్ట్‌కి సంకేతాలు. భీమసేన పాత్రధారి మేకప్‌రూంలో మద్యం తాగినట్లు చూపడం ఈ తరహా అసభ్యతకు పరాకాష్టలే. ఇవన్నీ ఎంత హాస్యానికనుకున్నా మింగుడుపడని జటిల అంశాలు. నటీనటుల నటనా ప్రావీణ్యతాంశాల విషయానికొస్తే నాయికీ నాయకులకన్నా ముందుగా రెండవ కథానాయిక- గాధా జాక్స్ పాత్ర పోషించిన నూరిన్ షరీఫ్ సంగతే చెప్పుకోవాలి. ఈ పాత్రకు కావాల్సిన ఈజ్, ఫ్రెండ్స్‌ను కలపడంలో, పరిస్థితినర్థం చేసుకుని ఆ ప్రకారంగా నడుచుకునే నేర్పు ప్రదర్శించే సందర్భంలో పక్కా పరిణతితో నటించారు. ప్రియాప్రకాష్ వారియర్ విషయానికొస్తే చిత్రం విడుదల ముందే బహుళ సంఖ్యాకుల అభిమానాన్ని పొందేసింది. దానికి తగ్గట్టే అభినయాన్నిచూపి ఆకట్టుకున్నారు. కాకపోతే ఆమె పాత్రని ఉపయోగించుకుని ఉంటే బావుండేది. రోషన్ క్యూట్ లుక్స్‌తో ఈ కాలం అబ్బాయికి ప్రతిబింబంగా నటించాడు. ఈ జోనర్ సినిమాలకు కావాల్సిన మ్యూజిక్ జోష్‌ని షాన్ రెహమాన్ శక్తివంచన లేకుండా అందించాడు. అన్నిట్లోకీ ‘మాణిక్యామణి’ మెలోడియస్‌గా ఉంది. ఫ్రెండ్‌షిప్ అంటే దాని నిర్వచనాలు (్ఫర్ ఎవ్విరీ ఫ్రెండ్.. పాటలో) ఆ పాట రచయిత బాగా చెప్పారు. కానీ కొన్నిచోట్ల ‘మందుకొట్టేటప్పుడు మంచింగ్ అవుతాడు’ లాంటివి అభ్యంతరకరం. అయితే మరోపాటలో ‘రాతి గుండె చేసి పోయే రక్తసంతకం’ ప్రయోగం సందర్భానికి తగ్గట్లు ఉంది. ‘జరగకుండా జరిగినట్లు ఉండాలి’ లాంటి చిన్న చిన్న చమక్కులు సంభాషణల్లో అక్కడక్కడా దొర్లాయి. నటీనటుల నుంచి అద్భుత ప్రతిభ (అది చిన్న క్యారెక్టరునుంచైనా సరే)ను రాబట్టిన ఒమర్, కథాంశాల వాస్తవికత పట్లా దృష్టి సారించి ఉంటే ‘లవర్స్ డే’ అందరి లవ్‌నీ నిశ్చయంగా పొందుండేది.

-అన్వేషి