రివ్యూ

చేదు.. మిఠాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిఠాయి * బాగోలేదు

తారాగణం: రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శే్వతావర్మ, ఆదితి మైకల్, కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవి వర్మ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: రవివర్మన్
నిర్మాత: ప్రభాత్‌కుమార్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌కుమార్
=========================================================
వైవిధ్యమైన సినిమాలు ఇప్పటికే తెలుగులో ఎన్నోవచ్చాయి, వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అర్భన్ నేపథ్యం, ఆ నేటివిటీతో కొన్ని ఫక్తు హైదరాబాదీ సినిమాలూ చూసేశాం, అవి కూడా డార్క్ కామెడీ రూపంలో. ఆ నేపథ్యంలో తాజాగా వచ్చిన చిత్రం మిఠాయి. పూర్తిస్థాయి కామెడీ సినిమాగా తెరకెక్కిన మిఠాయి ట్రైలర్స్‌తో బాగానే ఆకట్టుకుంది. అసలు కథలో మిఠాయి తీపి పించిందా? లేక చేదు మిగిల్చిందా? -తెలుసుకోవాలంటే కథలోని పాళ్లు చూడాలి.
వెంకట్ సాయి (రాహుల్ రామకృష్ణ) కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి. అనుకోని కారణాలతో ఉద్యోగం పోతుంది. మరో మూడు రోజుల్లో పెళ్లి అనగా.. ఇంట్లో దొంగతనం జరిగి విలువైన వస్తువులూ పోతాయి. చేయగలిగేది లేక మిత్రుడు జానీ (ప్రియదర్శి)తో కలిసి దొంగలెవరో పట్టుకునే పనిలో పడతాడు సాయి. ఈక్రమంలో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. చివరికి దొంగ దొరికాడా లేదా? మరి సమస్యలన్నీ తీరి సాయి పెళ్లి సజావుగా సాగిందా? లేదా? అన్నది మిగతా కథ.
మిఠాయి హీరోలు రాహుల్, ప్రియదర్శి పెర్ఫార్మెన్స్‌ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కామెడీకి ఇప్పటికే ఆడియన్స్ బాగా కనెక్టై ఉన్నారు కనుక, ఆమేరకు కష్టంలేకుండా పాత్రల్ని లాగించేశారు. కాకపోతే ప్రత్యేకంగా సంభాషణలంటూ రాసుకోలేదనుకుంటా. ఎందుకంటే రాహుల్, ప్రియదర్శి సందర్భానుసారం ఏదోకటి మాట్లాడేస్తూ సాగిపోయినట్టుగానే అనిపిస్తుంది. వాళ్ల నేటివ్ పంచ్‌లు అక్కడక్కడా అలరించాయి. అయితే సినిమా విషయంలో వాళ్లిద్దరికైనా ఎంత క్లారిటీ ఉంది? అన్న సందేహం మాత్రం ఆడియన్స్‌ని కడవరకూ వెంటాడుతుంది. హీరోలకు జోడీ ఉంటేనే సినిమా సంపూర్ణమన్న ఫార్మాట్ ప్రకారం -ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు. ఉన్నారంటే ఉన్నారంతే. వాళ్లిద్దరి పెర్ఫార్మెన్స్‌ని ఆడియన్స్‌కి రుచి చూపించేందుకు తగినంత పాత్రలైతే లేవు. సో, శే్వతావర్మ, ఆదితి మైకల్ గురించి తక్కువ చెప్పుకోవడమే ఉత్తమం. రవివర్మ, భూషణ్ కల్యాణ్, కమల్ కామరాజులు ఎందుకు సినిమాలో నటిస్తున్నారోనన్న అనుమానం ఆడియన్‌కి పుడుతుంది. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడికి స్థిమితం లేకుండా వెంటాడే ఒకే ఒక్క ప్రశ్న -మిఠాయి పేరుపెట్టి దర్శకుడు కషాయాన్ని చూపిస్తున్నాడేంటనే. అసలు దర్శకుడి టార్గెట్ ఆడియన్స్ ఎవరన్న అనుపాన సందేహాలూ ముసురుకోక మానవు. సాధారణంగా డార్క్ కామెడీతో మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తుంటారు. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు చూసేవాళ్లకు ఈ జోనర్ ఏమాత్రం ఎక్కదన్నది అనేకసార్లు నిరూపితమైన విషయమే. పోనీ బీ సెంటర్ ఆడియన్స్ ఏమైనా ఎగబడతారా? అంటే ఎవ్వరికీ ఏమీ అర్థంకాని అయోమయమే స్క్రీన్‌పై కనిపించింది.
సాంకేతిక నిపుణులూ సినిమాను భుజాలపై మోయలేకపోయారు. వివేక్‌సాగర్ పాటలేవీ ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం వరకూ ఫరవాలేదనిపించాడు. ఈ తరహా సినిమాలకు అవసరమైన ఔట్ పుట్ ఇచ్చాడని మాత్రం చెప్పొచ్చు. రవివర్మ చాయాగ్రహణం జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు సాధారణం. కొత్తతరహా కథను చేస్తున్నానన్న భావనలోంచి దర్శకుడు ప్రశాంత్‌కుమార్ బయటకు రాలేకపోవడంతో మిఠాయి చెదెక్కింది. అసలేమాత్రం రీరైట్ లేని రైటింగ్, పనితనం కరవైన టేకింగ్‌తో గందరగోళం ఏర్పడి ‘మిఠాయి’ అసలు రుచి మారిపోయింది. ఆరంభంలో కొన్ని సీన్లు కొత్తగా అనిపించి ఏదో వైవిధ్యమైన సినిమా చూడబోతున్నామన్న భావన కలిగిస్తాయి. కానీ పావుగంట తరువాత మొదలైంది అసలు కథ. ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థంకాదు. ఏ పాత్రేమిటో తెలీదు. చిర్రెత్తుకొచ్చే సంభాషణలు, అర్థంలేని మలుపులతో ప్రేక్షకుడిని ఆట ఆడేసింది. ద్వితీయార్థం మరీ దారుణం. ఆడియన్స్ అటెన్షన్ ఏమాత్రం సాధించకుండానే సినిమా సాగిపోవడం ఓ వింత అనుభూతి. రాహుల్, ప్రియదర్శిలాంటి మంచి కామెడీ టైమింగ్ ఆర్టిస్టుల్ని పెట్టుకుని అర్థరహిత కథా కథనాలతో సినిమా ఎలా తీయాలో తెలుసుకోవాలంటే -మిఠాయే చూడాలి.

-త్రివేది