రివ్యూ

పసి ఆత్మల పీడ కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు.. వసుధైక 1957
**
తారాగణం: బ్రహ్మాజీ, శ్రీలత, పావని, కారుణ్య, సత్యం రాజేష్, రఘు, బేబీ యోధ, మేకా రామకృష్ణ తదితరులు.
సంగీతం: అమోఘ్ దేశపతి
నిర్మాత: నిడమలూరి శ్రీనివాసులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
బాల
**
ఈ సినిమా ఆరంభంలో ఓ స్ర్తి పాత్ర, పురుష పాత్రలో ‘కాన్ఫిడెన్సు’ ఉండచ్చు కానీ, ‘ఓవర్ కాన్ఫిడెన్సు’ ఉండకూడదు. అది అనర్ధాలను తెస్తుంది అన్న భావంతో ఓ మాటంటుంది. సరిగ్గా ఈ వాక్యం ‘వసుధైక 1957’ చిత్రం పోకడకీ వర్తిస్తుంది. కాస్తంత హారర్ (హారర్ అంటే సినీ పరిభాషలో ‘ఆత్మలు’ లేదా దెయ్యాలతో కూడిన స్టోరీ మెటీరియల్) మసాలాతో తీసిన చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్న అంచనాతో సరైన విధానం లేకుండా ‘ఓవర్ కాన్ఫిడెన్స్’తో చిత్రాన్ని వదిలేసినట్టు అనిపించింది. ఫలితం- సినిమా పేరుకు కాస్త కొనసాగింపుగా మనందరికీ పరిచయమైన వసుధైక కుటుంబం మొత్తాన్ని ఆకర్షించే రీతిలో లేకపోవడం. ఇక కథాకమామీషుల విషయంలోకి వెళ్తే..
కూతురంటే అమిత ప్రేమగల వసుధైక, తన కుమార్తెకూ అదే పేరు పెడుతుంది. అలా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వసుధైక ప్రమాదవశాత్తూ మరణిస్తుంది. (మరణించిన సంవత్సరం 1957). అది తట్టుకోలేని తల్లి వసుధైక మరణానంతర కార్యక్రమాల్ని వసుధైకకు చెయ్యనివ్వదు. ఆ ప్రక్రియలో ఓ లోయలోపడి అర్ధాంతరంగా మరణిస్తుంది. అలా కోరికలు తీరకుండా తనువుచాలించిన ఆమె తన కుమార్తె పోలికలే కలిగిన మరో అమ్మాయి, ఓ ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోతే, ఆమె (ఆ పాప పేరూ వసుధైకే!) రక్షణ బాధ్యతలు స్వీకరిస్తుంది. తర్వాత ఆమెను సంతానం లేని రంజిత్ (బ్రహ్మాజీ) దంపతులు చేరదీస్తారు. అక్కడా ఆ పాపకు రక్షణగా వసుధైక (ఆత్మ) రావడం, అనంతరం అక్కడేర్పడిన పరిస్థితులు, చివరకు ఆ ఆత్మ వసుధైక ఎలా తొలగిపోయిందీ తర్వాతి కథ. ఇంచుమించు పిల్లల కేంద్రంగా ఇలా కోరికలు తీరని ఆత్మచేసిన రక్షణ- హంగామా ఇటీవలొచ్చిన అనువాద చిత్రం ‘శశికళ’లోనూ ద్యోతకమవడం యాదృచ్ఛికం కావచ్చు కానీ పోలికా కేంద్రం ఒక్కటే. ఇలాంటి ఆత్మల కథలకి తర్కాలూ, వగైరా వెతకడం ఫక్తు కాలహరణ కార్యక్రమం కనుక ఆ వైపు వెళ్లొద్దు. పోనీ కనీసం ఏది వాస్తవమన్నారో అందులోనూ క్లారిటీ లేదు. పైగా ఉన్న గంటా నలభై అయిదు నిమిషాల చిత్రం నిడివిలో అనవసరమైన సన్నివేశాలూ, అర్ధంలేని పాటలూ తదితరాలు అనేకం. దయ్యం బారిన పడిన స్టూవర్టుపురం దొంగల గుంపు ఓ స్టోర్ రూమ్‌లో అలా అన్ని రోజులుండగలదా? ఇక చిత్ర గమనానికి ఏ రీతిగానూ కనెక్టుకాని ఓ ఐటెమ్‌సాంగ్ (పుంపహార్...)కు వెచ్చించే సమయాన్ని, చిత్ర కథా కేంద్రానికి మూలమైన ప్రారంభ సన్నివేశంలో భార్యాభర్తలు వాగ్వాదానికి కారణమైన అంశాన్ని, అనంతర సన్నివేశాల్లోనైనా రేఖామాత్రంగా చర్చించడానికి కేటాయించివుంటే అర్ధవంతంగా ఉండేది.
ఇక పాప తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించి ఆరు నెలలైనా ఆమెకు చెందిన ఎవరూ ఎక్కడా ఎవరినీ సంప్రదించకపోడం విచిత్రం. అలాగే ఓ సైకోని పట్టుకోడానికి వెళ్లిన పోలీసాఫీసరు, సదరు విషయాన్ని పూర్తిగా గాలికొదిలేసినట్టు చూపడం, సినిమాలో ఏ సన్నివేశం పట్లా సంబంధితులు శ్రద్ధవహించకపోడం వంటి నిర్బాధ్యతా తత్వాన్ని ఎత్తిచూపిస్తోంది. ‘గబ్బర్‌సింగ్’ సినిమా నుంచీ ఆచారంగా వచ్చేసిన అంత్యాక్షరి- (అదీ విలన్స్ గ్యాంగ్‌తో) మోడల్‌కు కాస్త భిన్నంగా ఇందులో ఒకే పదం మకుటంగా ఉన్న పల్లవిలతో కలిగిన పాటల్ని వివిధ పాత్రలలో అభినయ పూర్వకంగా చూపే సహనానికి తీవ్ర పరీక్ష పెట్టారు. చివరకు ఎలా ముగించాలో తెలియక పాప చుట్టూ పరిభ్రమిస్తున్న ‘ఆత్మ’ను ఆ పాపను పెంచుకుంటున్న తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా సినిమా ఎండ్ చేశారు. ఇలాంటి ‘కౌన్సిలింగ్’తోనే ‘శశికళ’ చిత్రంలోని ఆత్మకీ ముగింపు పలకడం గమనార్హం. చిత్రంలో కాస్తంత నటించడానికి స్కోప్ ఉన్నది ప్రియ పాత్రధారిణికే. బ్రహ్మాజీ, సత్యం రాజేష్ తదితరులు తమకలవాటైన నటనని ఒలికించేసి వెళ్లిపోయారు. ‘పగకు అంతం ఉంటుంది కానీ ప్రేమకు అంతం ఉండదు’ వంటి మంచి వాక్యాలు రాసిన సంభాషణాకర్త అక్కడక్కడ కాలంచెల్లిన దంద్వార్ధాల్ని ఉపయోగించడం శోచనీయం. అమోఘ్ అందించిన స్వరాల్లో ‘వెనె్నలై వచ్చావే’ ఒక్కటే సో.. సోగా ఉంది. ప్రత్యేక గీతం ‘పుంపహార్...’ స్వరంలో ఇంతకుముందు విస్తృత ప్రాచుర్యం పొందిన మరో ఐటెంసాంగ్‌ని తప్పనిసరిగా మనకు గుర్తు చేసింది. చిత్రానికి పేరు (వసుధైక...) పెట్టడంలో కనపర్చిన ఉన్నతత్వపు ఆలోచనను ఇతివృత్తపరంగానూ పెట్టుంటే బాల (దర్శకుడు) ప్రథమ ప్రయత్నం బాలారిష్టాలను దాటి ఉండేదేమో.

-అనే్వషి