రివ్యూ

శుద్ధ మోహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** సర్వం తాళమయం
**
తారాగణం: జీవీ ప్రకాష్. అపర్ణ బాలమురళి, నెడుముడి వేణు, వినీత్ తదితరులు
ఎడిటర్:ఆంటోని
సంగీతం: ఎ.ఆర్.రెహ్మాన్
నిర్మాత: లతా మీనన్
దర్శకత్వం: రాజీవ్ మీనన్
**
ప్రేమకథా చిత్రాలు.. సంగీత ప్రాధాన్య చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న రాజీవ్ మీనన్ చాలా గ్యాప్ తరువాత తెరకెక్కించిన చిత్రం సర్వం తాళమయం. ఈ సినిమా సంగీత ప్రాధాన్యమైన కథే అయినా సంగీతం ఏ ఒక్క వర్గానికో, జాతికో చెందినది కాదని.. ఓ వ్యక్తి నిజ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ హీరోగా, అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు తమిళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా గురించి తెలియాలంటే కథలోకి వెళ్దామా...
కథ:
పీటర్ (జి.వి.ప్రకాష్) మృదంగం తయారుచేసే ఒక వెనుకబడిన దళిత సామాజిక వర్గానికి చెందిన కుర్రాడు. తమిళ హీరో విజయ్‌కు వీరాభిమాన సంఘంలో ఒకడు. ఆ అభిమానం మత్తులో తన జీవితాన్ని వృధా చేస్తూ.. కాలం గడుపుతున్న అతను.. తన తండ్రి తయారుచేస్తున్న తంబూరను కర్నాటిక్ సంగీత విద్వాంసుడిగా ప్రసిద్ధి చెందిన రామాశాస్ర్తీ (నెడుముడి వేణు) కార్యక్రమానికి ఇవ్వడానికి వెళ్లి అక్కడ తంబూరను ఎలా అతను స్వరాలు పలికించాడో దగ్గరనుండి చూసి.. తనకు సంగీతం పట్ల ఆకర్షణ మొదలవుతుంది. ఆ తరువాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పీటర్ చివరికి రామశాస్ర్తీ దగ్గర శిష్యుడిగా చేరతాడు. అతడు తక్కువ కులం వాడు కాబట్టి.. ఈ టీమ్‌లో చేర్చుకోవద్దంటూ వ్యతిరేకిస్తుంటాడు మణి (వినీత్).. అయినాసరే పట్టుబట్టి సంగీతంలో జ్ఞానం సంపాదించుకుంటున్న పీటర్ జీవితంలో కొన్ని తెలియకుండా జరిగే సంఘటనలు పోలీసులదాకా వెళ్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సంగీతం మీద తన ఇష్టాన్ని.. సంగీతంలో తన శిక్షణను మాత్రం ఆపడు. మరి పీటర్ తాను అనుకున్నట్లు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడా? తన గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడా? సంగీత విద్వాంసుడిగా మారతాడా? లేదా అన్నది అసలు కథ.
దేశంలో ఇంకా అగ్రవర్ణాల అణచివేత ఉందన్న విషయాన్ని దర్శకుడు చాలా క్లుప్తంగా కొన్ని సన్నివేశాలతో చెప్పే ప్రయత్నం చేశాడు. సంగీతం అన్నది కేవలం ఒక వర్గానికే కాదని.. టాలెంట్ ఉండి నేర్చుకోవాలన్న తపన వున్న ప్రతి వ్యక్తి అర్హుడనే కధతో వచ్చిన ఈ సినిమాలో సామాజికంగా దళిత వర్గానికి చెందినవాళ్ళకు ఎదురైన అవమానాలను, ఇబ్బందులను సినిమాలో చాలా చక్కగా చూపించారు. డప్పులు, ఇతర సంగీత వాయిద్యాలు తయారుచేసే కుటుంబంలో పుట్టిన కుర్రాడుగా నటించిన జి.వి.ప్రకాష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అలానే సంగీత విద్వాంసుడిగా మారుతున్న క్రమంలో అతని నటన కూడా పాత్రకు అనుగుణంగా మారుతూ ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా నటించిన అపర్ణ బాలమురళి సారా అనే నర్సు పాత్రలో నటించింది. అలాగే హీరోతో సాగే లవ్ ట్రాక్‌లో హీరోను మోటివేట్ చేసే సన్నివేశాల్లో బాగా చేసింది. తక్కువ జాతివాళ్ళంటే గిట్టని వ్యక్తిగా నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో మాజీ హీరో వినీత్ చక్కగా నటించాడు. సంగీత విద్వాంసుడిగా నెడుముడి వేణు నటన హైలెట్‌గా నిలుస్తుంది. అలాగే మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగా నటించారు.
ఈ సినిమాకు కీలంగా మారింది సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం విషయంలో ఏ.ఆర్.రెహమాన్ మరోసారి తన టాలెంట్ ప్రదర్శించి సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాడు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫి అద్భుతం. ఇక దర్శకుడిగా ఆయన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అచ్చమైన పెయింటింగ్‌లా ప్రతి సన్నివేశం ఉండేలా ఫీల్ కలిగిస్తారాయన. వర్క్‌చాలా బాగుంది. ఆయన కథకి అనుగుణంగా సినిమాలోని సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించారు. రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. అయితే కథనాన్ని బాగా స్లోగా నడిపినా.. సంగీతానికి సంబంధించిన బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అలాగే ఎడిటింగ్ వర్క్ సూపర్. ఇక నిర్మాణ విషయంలో ఎక్కడా తగ్గలేదు.. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓ కింది వర్గం కుర్రాడు సంగీతం నేర్చుకోవడానికి పడిన కష్టాల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన విధానం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం నెమ్మదిగా సాగింది. హీరో సంగీతం నేర్చుకునే క్రమంలో అతను పడిన ఇబ్బందులకు సంబంధించిన సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం వున్నప్పటికీ దర్శకుడు మాత్రం వాటిని అంతగా పట్టించుకోలేదు. సినిమాలో కీలక భాగాన్ని ఎమోషనల్‌గా ప్రేరణ కలిగించే విధంగా నడిపినప్పటికీ.. కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ ఎమోషన్‌ని ఆ స్థాయిలో కంటిన్యూ చేయలేకపోయాడు. పైగా ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా దాన్ని ఆవిష్కరించే విషయంలో దర్శకుడు పూర్తిగా కమర్షియాలిటీని పక్కన పెట్టడంతో సినిమా చూసే ప్రేక్షకుడు బోర్ ఫీలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సంగీతం అన్నది ఎవరైనా నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవచ్చు. అలాగే సినిమాలో కామెడీ.. ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అంశాల జోలికే దర్శకుడు వెళ్లలేదు. ఇలాంటి కొన్ని విషయాలను పక్కనబెడితే.. సర్వం తాళమయం సంగీతం అంటే ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది.

-శ్రీ