రివ్యూ

పోలీసు కితకితలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ * బాగోలేదు
*
తారాగణం: మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, గోరటి వెంకన్న తదితరులు
సంగీతం: సాబూ వర్గీస్
సినిమాటోగ్రఫి: తోట వి రమణ
నిర్మాత: మహంకాళి శ్రీనివాస్
దర్శకత్వం: నాగసాయి మాకం
*
ఇప్పటివరకు మనమెన్నో పోలీస్ కథలని చూశాం. అవన్నీ సీరియస్ యాంగిల్స్‌లో కనిపించేవి. కానీ మొదటిసారి పూర్తిస్థాయి హాస్యకోణంలో తెరకెక్కిన పోలీస్ చిత్రం -బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్. టైటిల్‌లోనే పూర్ పోలీస్ అంటూ హింటిచ్చి మరీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. శ్రీనాథ్ మాగంటి, శాన్వి మేఘన జంటగా నటించిన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. మంచి అంచనాలతో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మరి బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ కథా కమామీషేంటో చూద్దాం.
కథ
బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా ఉంటాడు సూర్య (మాగంటి శ్రీనాధ్). చాలా కేసుల్ని అవలలీగా పరిష్కరించే అతను ఎవరికీ భయపడడు. ఒకరోజు బ్యాంక్ లూటీ జరుగుతుంది. దొంగల్ని పట్టుకుని రికవరీ కోసం తీసుకెళ్తుంటే తప్పించుకుంటారు. ఆ పోరాటంలో తీరా చూసేసరికి ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఇంతకూ అతన్ని ఎవరు చంపారు? మర్డర్ ఎలా జరిగింది? ఈ విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
పోలీస్ పాత్రలో హీరోగా నటించిన శ్రీనాధ్ ఆకట్టుకున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ బాగుంది. అలాగే హీరోయిన్‌గా చేసిన శాన్వి ఉన్నంతలో బాగానే చేసింది. కానిస్టేబుల్ పాత్రలో ప్రజా గాయకుడు గోరటి వెంకన్న ఆకట్టుకున్నాడు. సినిమాలో మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధులమేరకు నటన ప్రదర్శించారు. ఇందులో కోడెదూడ గొడవ ఫన్నీగా ఉంటుంది. బ్యాంక్ చోరీ చేసిన దొంగల్ని పట్టుకునే క్రమంలో చేసిన యాక్షన్ బాగుంది. కమర్షియల్‌గా బాగా డిజైన్ చేశారు. హీరో శ్రీనాథ్ ఈ ఫైట్‌లో బాగా కనిపించాడు. శ్రీనాథ్‌కు సరైన పాత్రపడితే మాత్రం తప్పకుండా నిలదొక్కుకుంటాడు. ఫంక్షన్‌లో నాన్‌వెజ్ కోసం కొట్టుకునే సీన్‌కి నవ్వకుండా ఉండలేరు. డమీ పోలీస్ కామెడీ ఇరగదీశారు. హీరో హీరోయిన్‌ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. ఓవైపు బ్యాంక్ దొంగతనం, మరోవైపు మర్డర్ మిస్టరినీ ఛేదించే సన్నివేశాలు బాగా డిజైన్ చేశారు. 14 ఏళ్ల అమ్మాయి కనిపించకుండాపోయే సన్నివేశాలు సస్పెన్సుగా సాగుతాయి.
టెక్నికల్ హైలెట్స్ విషయంలో సాబూ వర్గీస్ అందించిన సంగీతం జస్ట్ ఓకె. సెకెండ్‌హాఫ్‌లో వచ్చే డ్యూయెట్ సాంగ్ బాగుంది. గోరటి వెంకన్న కళ్లు సాంగ్ ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాకు రీరికార్డింగ్ గురించి పెద్దగా చెప్పుకోవలసిన పనిలేదు. పాటల రచయిత వౌనశ్రీ మల్లిక్ పాటలు ఒకటి రెండుతప్ప మిగతావి పెద్దగా ఆకట్టుకోవు. ఇక సినిమాటోగ్రాఫర్ తోట వి రమణ కెమెరావర్క్ ఫర్వాలేదు. నిర్మాత మహంకాళి శ్రీనివాస్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. దర్శకుడు నాగసాయి ఆద్యంతం సహజంగా సాగే కథ కథనాలతో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సందేశాత్మకంగా ఉన్న వాణిజ్య అంశాలు మిస్సయ్యాయి. ఎడిసోడ్స్ ఎడిసోడ్స్‌లా చూస్తే బాగానే కనిపించే చిత్రం -కథలా చూస్తే బోర్ ఫీలవుతాం.
క్రైం నేపథ్యంలో సాగే సినిమా పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఆకట్టుకునేంత చిత్రంగా నిలవలేదు. మొదటి భాగంలో కామెడీపై ఫోకస్ పెట్టారు కానీ రెండోభాగంలో మరింత డల్‌గా ప్లేను నడిపించారు. ముందే చెప్పుకున్నట్టు ఎపిసోడ్స్ మాదిరి చూడాలి తప్ప, ఏకమొత్తంగా చూస్తే సన్నివేశాల మధ్య పొంతన లేక విపరీతమైన విసుగు పుట్టడం ఖాయం.

-ఎస్సార్