రివ్యూ

వన్ మ్యాన్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసరి *** బాగుంది
***
తారాగణం: అక్షయ్‌కుమార్, పరిణీతి చోప్రా, రాకేష్ చతుర్వేది, జస్ప్రీత్ సింగ్, వివేక్ సైనీ, విక్రమ్ కొచ్చర్, సివిందర్ విక్కీ, మీర్ సర్వర్, అశ్వంత్ భట్, రామ్ అవానా తదితరులు
కథ: అనురాగ్ సింగ్, గిరీష్ కోహ్లి
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: రాజు సింగ్
సినిమాటోగ్రఫీ: అన్షుల్ చోబె
ఎడిటింగ్: మనీష్ మోర్
ప్రొడక్షన్: ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనురాగ్ సింగ్
***
హాలీవుడ్ డైరెక్టర్ జాక్ స్నైడర్ 2006లో ‘300’ చిత్రాన్ని రూపొందించాడు. హాలీవుడ్ చారిత్రక కథగా వచ్చిన సినిమా బ్లాక్‌బస్టరైంది. 300మంది స్పార్టాన్లు మూడు లక్షల మంది పర్షియన్ సైనికులను కదనరంగంలో ఎలా నియంత్రించారన్నది చిత్రం ఇతివృత్తం. తాజాగా అక్షయ్‌కుమార్ చేసిన ‘కేసరి’ చిత్రం ఆ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే. 1897లో సంభవించిన చారిత్రక సారాగడి యుద్ధరంగంలో 21మంది సిక్కు సైనికులు పదివేల ఆఫ్ఘాన్ సైనిక మూకను ఎలా నియంత్రించారన్నదే కథ.
సామాజిక అంశాలను, దేశభక్తి నేపథ్య కథలను ప్రేక్షకుల చెంతకు చేర్చే విషయంలో బాలీవుడ్‌లో దాదాపుగా అక్షయ్‌కుమార్ పేటెంట్ రైట్ తీసేసుకున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన అనేక చిత్రాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంతేకాదు, వైవిధ్యమైన కథలనూ తెరకెక్కించటంలో అక్షయ్ ముందుంటున్నాడు. గతేడాది ప్యాడ్‌మ్యాన్, గోల్డ్ చిత్రాలతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. స్టార్ హీరో అనే చట్రంలో ఇమిడిపోకుండా -నటుడిగా ‘2.ఓ’లో అక్షయ్ ప్రతినాయకుడి పాత్రతో మెప్పించారు. ‘ఇంకెంతకాలం యాక్షన్ హీరోగా కొనసాగగలనో తెలీదు. ఉన్న టైంలో నా అభిరుచి మేరకు చేయాల్సిన చిత్రాలు చాలానే ఉన్నాయి. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా నేను అనుకున్న కథలతో స్క్రీన్‌పై రావాలన్న సంకల్పంతో ఉన్నా’ అంటూ ‘కేసరి’ విడుదలకు ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ చెప్పారు. ఆ కోణంలోనే కేసరి చిత్రంతో హవాల్దార్ ఇషాన్ సింగ్‌గా ఆడియన్స్ ముందుకొచ్చాడు. 1897లో జరిగిన సారాగడి అన్నది చారిత్రక నేపథ్యమున్న యుద్ధ సన్నివేశం. ఆ ఎపిసోడ్ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘కేసరి’.

బ్రిటీష్ పాలనలో ఉన్న భారత దేశంపైకి ఆఫ్ఘాన్ నుంచి సుమారు పదివేల మంది సైనికుల దండెత్తివచ్చారు. భారత సైన్యంలోని సిక్కు విభాగానికి చెందిన 21మంది సైనికులు సారాగడి ప్రాంతంలో వారిని నిలువరించారు. రెండు సేనల మధ్య భీకర యుద్ధం నడించింది. అంత పెద్ద బలగాలను చూసి భారత సైనికులు బెదిరిపోలేదు. వెనకడుగు వేయలేదు. సైనిక గుండె నిబ్బరాన్ని ఆయుధంగా చేసి ఆఫ్ఘాన్ సైనికులకు ఎదురెళ్ళారు. చొరబాటుదారులను ఊచకోత కోసి శత్రుమూకను ఏరిపారేశారు. చివరకు ఆ యుద్ధంలో సిక్కు సైనికులంతా వీరమరణం పొందారు.
1897 సెప్టెంబర్ 12న జరిగిన ఈ సంగ్రామానికి నాయకుడు హవాల్దార్ ఇషార్ సింగ్ (అక్షయ్‌కుమార్). సిక్కు సైనికుల పరాక్రమానికి ఆ యుద్ధ సన్నివేశం ఓ ప్రతీక. రోమాలు నిక్కబొడిచే వీరోచిత యుద్ధ సన్నివేశాలే కాదు, దేశంకోసం సైనికులు చూపించే తెగువ, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయని నిజాయితీ, ఇషార్ సింగ్ నాయకత్వ పటిమ, భావోద్వేగ సన్నివేశాలు, ‘సారాగడి’కి ముందు, తరువాత సన్నివేశాలను -దర్శకుడు అనురాగ్ సింగ్ ఎంత ప్రతిభావంతంగా చూపించాడన్నదే అసలు సినిమా. స్క్రీన్‌మీదే చూడాలి.
చారిత్రక నేపథ్యమున్న పెద్ద కథను క్లుప్తంగా, సామాన్య ప్రేక్షకుడికీ అర్థమయ్యేరీతిలో చెప్పడం అంటే అంత సులువైన విషయం కాదు. ఈ విషయంలో కథకులు అనురాగ్, గిరీష్ కోహ్లిలు విజయం సాధించారు. చారిత్రక నేపథ్యమున్న కథ కనుక పాత్రల చిత్రీకరణ విషయంలో అక్కడక్కడా దర్శకుడు ఒకింత స్వేచ్ఛ తీసుకున్నా -ఓవరాల్‌గా ‘్ఫల్’ని అందించటంలో ఎక్కడా పొరబాట్లు చేయలేదు. వ్యాపారాత్మకంగానూ సినిమా నిలవాలి కనుక స్క్రీన్‌ప్లే, పాత్రల చిత్రీకరణలో చూపించిన ‘అతి’ -కేసరి స్టేటస్ గ్రాఫ్‌ను కిందికి దించేసింది. యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో అనురాగ్ పడిన కష్టం కనిపించింది. కాకపోతే, యుద్ధ నేపథ్య సినిమాగా బలమైన ముద్ర వేసుకోడానికి డిజైన్ చేసిన కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతలా అనిపిస్తాయి.
దర్శకుడిగా అనురాగ్ పనితనాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ‘పంజాబ్ 1984’ కథతో జాతీయస్థాయి అవార్డు అందుకున్నాడు అనురాగ్. తప్పిపోయిన కొడుకును వెతుక్కునే తల్లి కథను చూపించి కంటతడి పెట్టించాడు. అదే భావోద్వేగాన్ని ‘కేసరి’ చిత్రంలోనూ ఆవిష్కరించగలిగాడు. చరిత్రను కళ్లముందు చూపించే ప్రయత్నంలో -కొన్ని యుద్ధ సన్నివేశాల కోసం 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులను సెట్స్‌మీదకు తీసుకొచ్చాడంటే దర్శకుడిగా అనురాగ్ తపనను అంచనా వేయొచ్చు. అద్భుతమైన నిర్మాణ విలువలు -బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్న విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. పాటలు బావున్నాయి. సారాగడి యుద్ధాన్ని చదువుకున్న వాళ్లు తక్కువ కనుక -సామాన్యు ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యే రీతిలో ప్రతి సన్నివేశానికి ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తేలా డిజైన్ చేయడం బావుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే అయినా, ఫిక్షనల్ సన్నివేశాలు తప్పలేదంటూ చిత్రం ఆరంభంలోనే చెప్పడాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. దీనే్న అడ్వాంటేజ్‌గా తీసుకుని -కొన్ని సన్నివేశాలను లాజిక్కుకు దూరంగా తెరకెక్కించిన విధానమే బాగలేదు.
అక్షయ్ వన్ మ్యాన్ ఆర్మీ షో చూపించాడు. దేశభక్తిని చాటి చెప్పే నిజ జీవిత సంఘటనలంటే మక్కువచూపే అక్షయ్, హవాల్దార్ ఇషాన్ సింగ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. సిక్కు సంప్రదాయం మేరకు సినిమా మొత్తం తలపాగా ధరించి ఉండాలి కనుక చిత్రీకరణలో ఇబ్బంది తలెత్తకుండా ముందే గుండు చేయించుకున్నాడు అక్షయ్. ఈ పాత్ర విషయంలో ఎంత నిబద్ధత ప్రదర్శించాడో అర్థం చేసుకోవచ్చు. సంపూర్ణత్వం కోసం అక్షయ్ జోడీగా పరిణీతిని చూపించారు తప్ప, ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.
అటు నటవర్గాన్ని, ఇటు సాంకేతిక వర్గాన్ని ఎంచి చూపాల్సిన పనిలేకుండా సంధానంతో చేసిన సినిమా అనిపిస్తుంది. అతిగా సమీక్షించేకంటే, సినిమాను చూసిన ఆనందం వేరుగా ఉంటుందనటంలో సందేహం లేదు.

-మహాదేవ