రివ్యూ

చితక్కొట్టేశాడు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు.. రాయుడు

**
తారాగణం: విశాల్, శ్రీదివ్య, రాధారవి, సూరి, కులాపుల్లి లీల,
ఆర్కే సురేష్ తదితరులు
సంగీతం: డి.ఇమాన్
మాటలు: శశాంక్ వెనె్నలకంటి
నిర్మాత: బి.హరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముత్తయ్య
**

స్క్రీన్‌పై దుమ్ము రేగింది. తెరపై ఇంత ‘ఎక్స్‌ట్రీమ్’ ఉంటేగానీ- తమిళ సినిమా నడవదేమో?! ఫైటింగ్ చేస్తేనో, కత్తి ఝళిపిస్తేనో కనీసం పది తలలు తెగిపడాలి. రక్తం ఏరులై ప్రవహించాలి. రౌడీ మూకలు గాల్లో గిరికీలు కొడుతూ.. దుమ్ములో కలిసిపోతూ -హాహాకారాలు చేస్తూంటే.. హీరో అనబడే ఒకానొక మాస్ నాయకుడు గళ్లలుంగీ పైకి ఎగ్గట్టి.. కట్ బనియన్ కనిపించేలా గుండీలు ఊడదీసిన చొక్కా కాలర్ పైకెగరేసి.. కత్తి నోట్లో పెట్టుకొని.. స్లో మోషన్‌లో తెరపై నడిచొస్తూంటే.. చూట్టానికీ వర్ణించటానికీ అక్షరాలూ చాలవు. కళ్లూ చాలవు. అంతటి బీభత్స భయానక వీరోచిత ‘రాయుడు’ విశాల్ రూపంలో తెలుగు తెరని ‘టచ్’ చేశాడు. తెలుగు ప్రేక్షకులకు ‘కొద్దిగా టచ్‌లో ఉంటూనే’ వస్తున్న విశాల్‌కి తెలుగు తెర అంటే ఉన్న ఇష్టం మాటేమోగానీ.. తమిళ ‘గుబాళింపు’ ఇక్కడ ప్రేక్షకుల బుర్రకి వొంటబడుతుందా? లేదా? అన్నది ఆలోచించలేదేమో?! ఉన్నదున్నట్టుగా డబ్ చేసి పారేసి ‘రాయుడు’ని థియేటర్‌లోకి వదిలితే.. చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కి చెన్నైలో దిగి తమిళ సినిమా చూస్తున్నట్టు ఉందిగానీ.. తెలుగు ప్రాంతంలో సినిమా చూస్తున్న అనుభూతీ కాదుగదా.. బుర్ర చుట్టూ శూన్యం ప్రవేశించి మానసిక స్థితిని అతలాకుతలం చేస్తుంది. ఇక లాజిక్‌లకు దొరకని కథ కోసమో.. స్క్రీన్‌ప్లే నిర్వాకం గురించో ఆలోచించేంత దమ్ము దుమ్ము.. ప్రేక్షకులకు లేకుండాపోయి.. ‘రాయుడు’ ఏది చెప్తే అదే చూసే అచేతనావస్థలోకి వెళ్లిపోయాడు.
కథా అనబడే ఒకానొక సింగిల్‌లైన్ స్టోరీ. రాయుడు (విశాల్) మార్కెట్‌లో కూలీ. మూటలు మోస్తూ.. నాయనమ్మని ప్రేమిస్తూ.. ఆమె ఏంచెబితే అది తు.చ తప్పకుండా పాటించే సౌమ్య మనస్కుడు. సదరు నాయనమ్మగారు -రాయుడిపై చేయి చేసుకొన్న భాగ్యలక్ష్మి (శ్రీదివ్య)ని ప్రేమించమని షరతు విధించే ధీమంతురాలు. భాగ్యలక్ష్మి తన తల్లిని చంపిన ఓ రౌడీ షీటర్ (ఆర్కే సురేష్)పై న్యాయ పోరాటం చేస్తూంటుంది. ఆ కారణంగా ఆర్కే మనుషులు భాగ్యలక్ష్మిని చంపాలని ప్లాన్ వేస్తూంటారు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి జీవితంలోకి ఎంటరైన రాయుడు.. నాయనమ్మ ప్రోద్బలంతో ఆర్కేపై పగ తీర్చుకున్నాడా? భాగ్యలక్ష్మిని అతడి చెరనుంచీ తప్పించాడా? అన్నది తెరపై చూడాల్సిందే.
నిజానికి -ఈ సినిమాలోనూ కథలోనూ ఎటువంటి లోపం లేదు. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు అంతుచిక్కని అంశం. స్క్రీన్‌పై ఆ వేషధారణలూ.. విపరీతంగా జుట్టూ, గడ్డాలూ పెంచేసుకొని.. అరివీర భయంకరంగా కనిపించే మాస్ రౌడీలూ.. దుమ్ము ధూళి తప్ప ‘క్లాస్’కి ఆస్కారం లేని కథనం.. స్క్రీన్‌పై ఇంతమంది రౌడీలూ.. ఆ పల్లెటూరి ‘మాస్’ వాతావరణం తెలీని అర్థంకాని అనుభూతిని కలిగిస్తాయి. ఇదంతా అక్కడ సహజం కాబట్టి.. తమిళ ప్రేక్షకులకు ప్రతి సన్నివేశంలోనూ కొత్తదనం కనిపిస్తుంది. ఈలలు వేస్తూ కథలో ఇన్‌వాల్వ్ అవుతాడు. ఆ పరిస్థితి ఇక్కడ ఉండదు. ఆ కథకి కనెక్ట్ అవటానికి ప్రయత్నించినా.. అడుగడుగునా తమిళ వాసన కొడుతూ.. తెలుగు ప్రేక్షకుణ్ణి దూరం జరిపేస్తున్నట్టు అనిపిస్తుంది.
ఒక్క మాటలో చెప్పుకొంటే- నాయనమ్మ సెంటిమెంట్.. నాలుగు ఫైట్లు.. నాలుగు ప్రేమమాటలు. ఈ సినిమా చూస్తూంటే.. పాతకాలంనాటి కథలన్నీ మళ్లీ తెరపై చూస్తున్నట్టు.. ఇంతోటి కథని ఇన్నిసార్లు తీయాల్సిన అవసరం ఉందా? లాంటి ప్రశ్నలన్నీ చుట్టుముడతాయి. యాక్షన్ సన్నివేశాలు కానీ.. కామెడీ గానీ.. నాయనమ్మ సెంటిమెంట్ -ఇలా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఫర్వాలేదనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కావల్సినన్ని ఉన్నాయి. కాకపోతే ‘అతి’ నటనని జీర్ణించుకోలేక పోవటంవల్ల ‘రాయుడు’ ఆమడ దూరంలోనే ఉండిపోయాడు. కథాపరంగా -పెద్దగా మలుపులు లేని కథ. ఎంతో సాఫీగా సాగిపోయే స్క్రీన్‌ప్లే. ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం మొదలవుతుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించుకోగలడు. ఇటువంటి కమర్షియల్ కథల్లో ‘రొమాంటిక్ టచ్’ని ఆశించటం ఇబ్బంది పెడుతుంది. ‘మాస్’కీ లవ్ ‘క్లాస్’కీ అస్సలు పొంతన కుదరదు. అయినా విశాల్ ‘మాస్’ యాక్షన్ కోసం మాత్రమే సినిమా చూడొచ్చు. శ్రీదివ్య, నాయనమ్మ పాత్రధారిణి, ఆర్కే సురేష్, సూరి మంచి మార్కులు కొట్టేశారు. డి.్ధమన్ సంగీతం ఫర్వాలేదు. ‘ఒంటి జడ’ పాట చిత్రీకరణ బాగున్నప్పటికీ.. తమిళ సంగీతం కావటంతో చెవుల వరకూ వచ్చి ఆగిపోయింది. మైండ్‌లో రిజిస్టర్ అవ్వదు. కెమెరా పనితనం బాగుంది. ఇది పక్కా ఊర మాస్ సినిమా. కాబట్టి -కమర్షియల్ ధోరణిలో మాత్రమే చూడాలి. అంతే!?

-ప్రనీల్