రివ్యూ

సూపర్‌స్టార్ ఫ్యామిలీ ప్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు-- శ్రీశ్రీ

తారాగణం:
కృష్ణ, విజయనిర్మల, సాయికుమార్, నరేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, అంగనారాయ్, సుధీర్‌బాబు (అతిథి పాత్ర) తదితరులు
సంగీతం: ఈఎస్ మూర్తి
మాటలు: రామ్ కంకిపాటి
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
నిర్మాతలు:
సాయిదీప్ చాట్ల,
వై బాలురెడ్డి, షేక్ సిరాజ్
దర్శకత్వం: ముప్పలనేని శివ
**
1965లో మొదలైన కెరీర్. అంటే -50ఏళ్ల సినీ ప్రస్థానం. 350 చిత్రాలు చేసిన అనుభవం. ఎన్నో హిట్లు చూశాడు. ఫట్లు ఫేస్‌చేశాడు. సూక్ష్మంగా ఇదీ సూపర్ స్టార్ కృష్ణ. క్యారెక్టర్ హీరోయిజాన్ని కూడా చాలాకాలంగా పక్కనపెట్టేసి విశ్రాంతిలోవున్న కృష్ణ -స్వర్ణోత్సవ సంబరంగా శ్రీశ్రీ చేశాడు. ఫ్యాన్స్ మదిలో ఎప్పటికీ నిలిచివుండే సూపర్ స్టార్ సినిమా. పైగా ఒకప్పుడు హిట్ పెయిర్ అయిన విజయనిర్మలతో కలిసి చేసిన చిత్రం. అందులోనూ కృష్ణ వైవిధ్యమైన గెటప్. అంతకుమించి టైటిల్ -శ్రీశ్రీ. సహాజంగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగినట్టు సినిమా ఉందో లేదో సమీక్షలో చూద్దాం.
కధేంటి?
శ్రీశ్రీ (శ్రీపాద శ్రీనివాస రావు-కృష్ణ) రిటైర్డ్ లా ప్రొఫెసర్. భార్య సుమతి (విజయనిర్మల), కూతురు శే్వత (అంగనారాయ్), కొడుకు, కోడలితో హాయిగా నడిచిపోయే హ్యాపీ ఫ్యామిలీ. కూతురు శే్వత ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. విశాఖ ఏజెన్సీలోని పోతురాజుగూడెంలో జెకె ఇండస్ట్రీస్ కెమికల్ ప్రయోగాలకు బలైపోతున్న అడవి బిడ్డల కథనాన్ని డాక్యుమెంటరీ చేస్తుంది. గిరిజనుల్ని అన్యాయంగా చంపేస్తున్న ముఠా సాక్ష్యాధారాలు సంపాదిస్తుంది. దీంతో శే్వతను, ఆమెకు సహకరించిన గిరిజన నాయకుడు సూర్య (సాయికుమార్)ని టార్గెట్ చేస్తారు జెకె (మురళీశర్మ), భిక్షపతి (పోసాని). జెకె కొడుకు, అతని మిత్రులు శే్వతను నిర్దాక్షణ్యంగా చంపేస్తారు. హత్య కేసు కోర్టులో వీగిపోయి, హంతకులు విడుదలవుతారు. దాంతో శ్రీశ్రీ రంగంలోకి దిగుతాడు. వీరోచితంగా దుర్మార్గుల ఆట కట్టిస్తాడు. అదెలా? అన్నది మిగతా సినిమా.
ఎలా ఉందంటే..
న్యాయశాస్త్రంలోని లొసుగులతో నేరస్తులు తప్పించుకుంటే, అనుభవజ్ఞుడైన రిటైర్డ్ లా ప్రొఫెసర్ వాటినే ఆయుధంగా మలచుకుని హంతకులను వేటాడిన ఓ మరాఠీ చిత్రానికి తెలుగు రూపమిది. నిజానికి కథ చాలాసార్లు చూసేసిందే. కాకపోతే సామాజిక సృహ కలిగిన సబ్జెక్టు కనుక ప్రేక్షకుడు కనెక్టవుతాడు. ఆరంభాన్ని దర్శకుడు ఆసక్తిగా మొదలెట్టినా -ప్రధానమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎక్కువ టైంతో సహనానికి పరీక్ష పెడుతుంది. కథంతా ఫస్ట్ఫాలో చెప్పేసిన దర్శకుడు, సెకెండాఫ్‌లో ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడం కోసం కాలక్షేపం సీన్లు వేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి కథల్లో క్లైమాక్స్ ముందే ఊహించేసుకునే అవకాశం ఉంటుంది కనుక -ఎలా ముగించాడో చూద్దామన్న ఆలోచనతోనే క్లైమాక్స్ కోసం ప్రేక్షకుడు ముడుచుకుని కూర్చోక తప్పలేదు.
కృష్ణ స్క్రీన్ అప్పియరెన్స్ ఓకె. యాక్షన్ ఎపిసోడ్స్‌లో వయసు వెనక్కిలాగింది. ఆయన వయసుకు తగినట్టు స్టోరీని మైండ్‌గేమ్‌లో ప్లాన్ చేసివుంటే, మరికొంత పెర్ఫార్మెన్స్ వచ్చివుండేది. ఫోర్స్‌డ్ డైలాగ్స్ చెప్పడంలో కృష్ణకొక స్టయిల్ ఉంది. శ్రీశ్రీలోనూ ఆ మెరుపు కనిపించింది. విజయనిర్మల స్క్రీన్ అప్పియరెన్స్ శ్రీశ్రీకి ప్లస్ మాత్రం కాదు. పోసాని, మురళీ శర్మ, సాయికుమార్.. ఇలా పాత్రల్లో కనిపించేవాళ్లంతా సీనియర్లే కనుక వంకపెట్టలేని విధంగానే అనుభవాన్ని చూపించారు. కథకు కీలకమైన అంగనారాయ్ నటనపరంగానూ, పాత్ర నిడివిపరంగానూ ప్రత్యేకంగా చెప్పుకునేంత లేదు. సాంకేతిక విభాగంలో ఈఎస్ మూర్తి సంగీతం ఫరవాలేదు. సీరియస్ సబ్జెక్టును డిస్కస్ చేసే చిత్రంలో పాటలు లేకుండా చేస్తే కొంచెం బావుండేది. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో బిజిఎం ఓకే. సినిమాటోగ్రఫీ సహా మిగిలిన సాంకేతిక విభాగాలు శ్రీశ్రీకి చెప్పుకోతగినంత బలాన్ని ఇవ్వలేకపోయాయి.
ప్రధాన పాత్రల్లో కృష్ణ, విజయనిర్మల, నరేష్, మహేష్‌బాబు వాయిస్ ఓవర్, పోలీస్‌గా సుధీర్‌బాబు క్లైమాక్స్ గెస్ట్ అప్పియరెన్స్.. మొత్తంగా కృష్ణ స్వర్ణోత్సవ సమయంలో ‘ఘట్టమనేని’ ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పుకోవడానికి శ్రీశ్రీని తీశారనిపిస్తుంది. ఫ్యామిలీ ఫ్యాక్‌లన్నీ ‘మనం’ కాలేవన్న అనుభవమైతే మిగిలింది. ఇక దర్శకుడు తను నమ్మిన పాయింట్‌ని సిన్సియర్‌గా తీసే ప్రయత్నం చేశాడు. కృష్ణ, విజయనిర్మల కెమిస్ట్రీ క్లిప్పింగ్స్ వాడుకుని ఫ్యాన్స్‌కు చిన్న విందిచ్చి ఒకింత ఊరటనిచ్చాడు. పేలవమైన కథకు బలమైన సంభాషణలు పెట్టుకుని తెలివైన పని చేశాడు. ఎన్ని చేసినా.. కరవైన వినోదం, నత్తనడక కథనం, మలుపుల్లేని కథ వెరసి శ్రీశ్రీని లక్ష్యానికి దూరంగానే ఉంచేశాయి.

-ప్రవవి