రివ్యూ

ఇంకా టైముంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వు తోపురా * బాగోలేదు
*
తారాగణం: సుధాకర్ కొమాకుల, నిరోషా, నిత్యశెట్టి, రవివర్మ, శ్రీధరన్, దివ్యారెడ్డి, జెమిని సురేశ్, జబర్దస్త్ రాకేశ్, దువ్వాసి మోహన్, ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: విశ్వరఘు, విజయ్ ప్రకాశ్
ఎడిటింగ్: ఎస్‌బి ఉద్దవ్
నిర్మాత: డి. శ్రీకాంత్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరినాథ్ బాబు బి
*
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నాగరాజు పాత్రతో పరిచయమైన సుధాకర్ కొమాకుల -హీరోగా ప్రూవ్ చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ‘ఎల్‌ఐబి’ తరువాత చేసిన రెండు చిత్రాలు (ఉందిలే మంచికాలం ముందు ముందునా, కుందనపు బొమ్మ) ఆడియన్స్‌ని మెప్పించలేకపోయాయి. ‘నువ్వు తోపురా’ అంటూ తాజాగా నాలుగో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా ప్రచార చిత్రాలు చూసినపుడే -మరోసారి నాగరాజ్‌లాంటి పాత్రతో సుధాకర్ ప్రయోగం చేస్తున్నాడన్న విషయం అర్థమైంది. కథలపరంగా, బడ్జెట్‌పరంగా మారుతోన్న తెలుగు సినిమా ధోరణులకు అనుగుణంగా చేసిన చిత్రమిది. సాల్ట్‌లేక్ సిటీలో ఎక్కువ భాగం తెరకెక్కించిన ఈ చిత్రంతో అటు విదేశీ, ఇటు స్వదేశీ కల్చర్‌ను మిళితం చేసి కథను తీర్చిదిద్దుకున్నారు. ఓ హిట్ కోసం వెయిట్ చేస్తున్న సుధాకర్ క్రెడిబిలిటీని ఈ సినిమా ఎంతవరకు పెంచగలదో చూద్దాం.
కథేంటంటే:
సరూర్‌నగర్‌కు చెందిన కుర్రాడు సూరి (సుధాకర్ కొమాకుల). తండ్రిలేని పసివయసు సూరిని చంకనేసుకుని, ఉద్యోగం చేస్తూ సాకుతుంది తల్లి (నిరోషా). బతుకుదెరువుకు ఆధారమైన ఉద్యోగ వత్తిడితో కొడుకును సరిగా పట్టించుకోకపోవడంతో, తల్లీకొడుకుల మధ్య అనుబంధం తగ్గి అంతరం పెరుగుతుంది. తల్లి నియంత్రణ కూడా లేకపోవడంతో, బీటెక్ ఫెయిలైన సూరి కుటుంబాన్నీ నిర్లక్ష్యం చేస్తూ గల్లీ కుర్రాళ్లతో జులాయిగా తిరుగుతుంటాడు. ఆక్రమంలోనే రమ్య (నిత్యశెట్టి)కి ఆకర్షితుడై ప్రేమలో పడతాడు. ప్రేమ సవ్యంగా సాగుతున్న దశలో చిన్న బ్రేకప్. రమ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోతుంది. అలా సూరికి అమెరికా వెళ్లే అవకాశం రావడం, వెళ్లాక జీవితంలో తల్లి విలువ తెలియడం జరుగుతుంది. మంచి చెడుల మధ్య సన్నని గీతపై నిలబడిన సూరి జీవితం ఏమైంది? అమెరికాలో కలిగిన పరివర్తన ఎలాంటి మార్పునకు దారితీసింది? బంధాల విలువ తెలిసొచ్చాక, ఎలాంటి ప్రయత్నాలు మొదలెట్టాడు? అమెరికాలో ఎదురైన సమస్యలు, వాటిని పరిష్కరించుకోడానికి జరిపే పోరాటంలో గెలిచాడా? రమ్య దగ్గరైందా? ఇలాంటి ప్రశ్నల సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.
ఎలా ఉందంటే:
‘ఈసూరి ఎవ్వరికీ ఒంగడు’ అంటూ సరూర్‌నగర్ కుర్రాడిగా టెంపర్‌మెంట్ చూపించిన సూరి, అమెరికా వాతావరణంలో ఎలాంటి పరిస్థితుల ప్రభావానికి గురయ్యాడన్న సీడ్ పాయింట్‌పైనే కథ నడిపించే ప్రయత్నం చేశారు. అమ్మ, స్నేహితులు, దేశం విలువ ఎంతటిదో అమెరికాకు వెళ్లాక ఎలా అర్థమయ్యాయన్నది కథలో కీలకం. సరూర్‌నగర్ నేపథ్యంలోనే కథ మొదలైనపుడే -హీరోగా తనని తాను వైవిధ్యంగా నిరూపించుకోడానికి సుధాకర్ పడేతపన కనిపించింది. గల్లీ కుర్రాళ్లతో చేసే అల్లరి, ప్రేమలో పడ్డాక ప్రేయసి వెంటపడుతూ చేసే సందడి, రమ్య పేరెంట్స్‌తో పెళ్లిమాటల సన్నివేశాలు -సాదాసీదాగానే సాగిపోయాయి. సూరి అమెరికా చేరుకున్న తరువాతే కథలో ఆసక్తి పెరుగుతుందని అనుకుంటే -అదీ జరగలేదు. చదువబ్బని గల్లీ కుర్రాడు తెలంగాణ కల్చర్ అసోసియేషన్ తరఫున అమెరికా వెళ్లడం, అక్కడ నిర్వాహకులతో గొడవ పెట్టుకుని బయట బతకాల్సి రావడం, అందుకోసం పడే కష్టం, ప్రయాణంలో అనూహ్యంగా చోటు చేసుకున్న మలుపులు ప్రేక్షకుడిని కథనుంచి ఎటో తీసుకుపోయాయి. మధ్యలో వినోదం, సెంటిమెంట్‌ను పండించే ప్రయత్నం అతకలేదు. నాగరాజ్ తరహా పాత్ర ఆహార్యానే్న సుధాకర్ మరోసారి అనుసరించినా వినోదమే పండించాడు కానీ, కథని నడిపించటంలో మాత్రం దర్శకుడు హరిబాబు పూర్తిగా వైఫలమయ్యాడు. తల్లీకొడుకుల అనుబంధానికి సంబంధించి సరైన సన్నివేశాలు రాసుకోకపోవడమే కథ తేలిపోయి -దర్శకుడి అసలు లక్ష్యం దెబ్బతింది. నాయకా నాయికలు ప్రేమ సన్నివేశాలు, హీరో కష్టాలు, కుటుంబం నేపథ్యంలో భావోద్వేగాలను బలంగా చూపించలేకపోవడంతో ఆడియన్స్ బోర్ పీలయ్యారు. పతాక సన్నివేశాల్లోనూ దర్శకుడి పట్టు కనిపించలేదు. గ్రీన్ కార్డు కోసం అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం, డబ్బులు కోసం డ్రగ్ మాఫియాతో సంబంధాలు, తరువాత వాళ్లతో గొడవలు.. మధ్యలో సంబంధం లేకుండా వచ్చిపోయే పాటలు.. ప్రేక్షకుడికి స్థిమితం లేకుండా చేసేశాయి. వరుణ్ సందేశ్ ఇందులో కీలక పాత్రలో కనిపించి, హీరోతో కలిసి సందడి చేసే ప్రయత్నం చేశాడు.
సరూర్‌నగర్ సూరి పాత్రకు సుధాకర్ కొమకుల అతికినట్టు సరిపోయాడు. బస్తీ కుర్రాడి స్వభావాన్ని తన పెర్ఫార్మెన్స్‌లో చూపించాడు. సంభాషణల తీరుతోనూ ఆకట్టుకున్నాడు. నిత్య శెట్టి పాత్ర పరిధి మేరకు నటించింది. నిరోషా మధ్యతరగతి తల్లిగా మెప్పించారు. కానీ ఆ పాత్రని తీర్చిదిద్దడంలో దర్శకుడి వైఫల్యం కనిపించింది. వరుణ్ సందేశ్‌తోపాటు, అమెరికాకు చెందిన కొందరు నటులు తెరపై కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఓకే. అమెరికా అందాలను చూపించిన విధానం నిర్మాణ విలువల్ని స్పష్టం చేశాయి. సాంకేతిక వర్గం పనితనాన్ని మెచ్చుకోవచ్చు.