రివ్యూ

జెడ్‌కు చేరని కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎబిసిడి * బాగోలేదు
అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి
*
తారాగణం: అల్లు శిరీష్, రుక్సర్ థిల్లాన్, భరత్, కోట శ్రీనివాసరావు, నాగబాబు, శుభలేఖ సుధాకర్, రాజా, హర్షవర్థన్, ప్రియాంక, వెనె్నల కిషోర్ తదితరులు
సంగీతం: జుదా సాండీ
నిర్మాతలు: మధుర శ్రీ్ధర్‌రెడ్డి, యష్ రంగినేని
దర్శకత్వం: సంజీవ్‌రెడ్డి
*
సంపన్నుల సంతతి డబ్బు విలువ తెలీకుండా విచ్చలవి ఖర్చులు చేస్తుంటే, ఆ పోకడలనుంచి వేరుపడి ధనం విలువ తెలిసేలా చేసే కథా సూత్రంతో మన తెలుగులోనే గతంలో అనేక కథలొచ్చాయి. ఆ వరసలో వచ్చిన మరో చిత్రం ‘ఎబిసిడి..’. దీని మాతృక మలయాళంలో ఇదే పేరిట 2013లో వచ్చింది. అందులో దుల్కర్ సల్మాన్ హీరో. ఆ పాత్రను తెలుగులో అల్లు శిరీష్ పోషించాడు. కథాక్రమానికి వస్తే, అమెరికాలో తెలుగు మూలాలున్న పారిశ్రామికవేత్త విద్యాసాగర్ ప్రసాద్ (నాగబాబు) తన కొడుకు అరవింద ప్రసాద్ (అల్లు శిరీష్) చేస్తున్న దుబారా ఖర్చుకు ఠారెత్తిపోయి, అతనికి డబ్బు విలువ తెలియడం కోసం నెలపాటు ఇండియాలో ఉండమని పంపుతాడు. అతనితోపాటు వారి కజిన్ బాలషణ్ముగం (భరత్) కూడా వెళ్తాడు. మరి ఇండియా వచ్చిన వారికి ఎదురైన పరిస్థితులు, వాటివల్ల డబ్బు విలువ తెలుసుకుని సక్రమ పంథాలోకి వచ్చిన వైనంతో ఎబిసిడి.. జెడ్ కార్డ్‌తో పడుతుంది.
చిత్రంలో ప్రధాన లోపం సాధారణంగా ఎలాంటి సినిమాకైనా కావాల్సిన వేగం లోపించడం. సీన్లన్నీ ఏదోక సీరియల్ చూస్తున్న భావన కలిగించాయి తప్ప ఫీచర్ ఫిల్మ్ ఫీలింగ్ కలగదు. దానికితోడు చిత్రం ఆశయం ఒకటి, నడిచిన విధానం మరొకటి కావడంవల్ల బోర్ ఫీలవుతాడు ప్రేక్షకుడు. ఉదాహరణకు సినిమా ప్రధాన ఆశయం నాయకుడికి బాధ్యత తెలియడం. కాగా సినిమాలో అతను ఒక ఇండియన్ అమ్మాయి నేహ (రుక్సర్ థిల్లాన్)ను పెళ్లి చేసుకోవడంతో ముగుస్తుంది. అసలు సినిమా విరామ సీన్ వచ్చేవరకూ దర్శకుడు ఒకదాని తర్వాత ఒకటి సన్నివేశాలు దట్టించేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు తప్ప, అవి ఎంతవరకూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయన్న సంగతి విస్మరించాడు. పోనీ ఇంటర్‌వెల్ అనంతరమైనా సినిమా దారిలో పడుతుందా? అంటే అదీ జరగలేదు. రాజకీయ నాయకుని వారసుడు (రాజా)కి చెందిన ప్రమాదకర రసాయినక కర్మాగారం మూసివేతకు బస్తీవాసులు నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తానన్న హీరో, ఆక్రమంలో పాల్గొన్నట్టు చూపారు కానీ, అది బాగా ఎస్టాబ్లిష్ కావడానికి ప్రయత్నించలేదు. దాంతో ఆ కర్మాగార మూసివేత ఖ్యాతి నాయకుడికి చెందుతుందా? అది ప్రకటించిన రాజకీయ పార్టీ అధినాయకుడు పెద్దాయన (కోట శ్రీనివాసరావు)కు చెందుతుందా? అన్న అయోమయం కలిగింది. ఇలాంటి స్పష్టతాలేమి సినిమాలోని ఎండింగ్ సీన్‌కూ కలిగింది. నేహ, అరవింద ప్రసాద్ ఒకటి కావడంతో ముగుస్తుంది. వాస్తవానికి చిత్ర లక్ష్యం ఇది కాదు.
కథాక్రమంలో మద్యపానాలూ వగైరా మామూలైపోయాయి ఇప్పటి సినిమాల్లో. కానీ ఇందులో తల్లి పాత్రధారిణే తండ్రి పాత్రతో కొడుకునుద్దేశించి ఈ వయసులో కాకపోతే ఇలాంటివి (మద్యపానం) ఎపుడు ఎంజాయ్ చేస్తారని సమర్థించడం సహేతుకత అనిపించుకోదు. అందులోనూ సినిమా ప్రధాన పాయింటే డబ్బు విలువ, బాధ్యత తెలపడం. బాధ్యత నేర్చుకునే ప్రక్రియలో ఈ మాదిరి దుర్వ్యసనాలను సాక్షాత్తూ తల్లే ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమో సంజీవరెడ్డి (దర్శకుడు) ఆలోచిస్తే బావుండేది. చిత్రానికి ఉపశీర్షికగా అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి అని విస్తృతపర్చడం బానేవుంది కానీ కలిగిన కన్‌ఫ్యూజ్‌కి చివరికైనా క్లారిటీ కలిగిస్తే అర్థవంతంగా ఉండేది. అరవింద్ ప్రసాద్‌గా అల్లు శిరీష్, సినిమా పేరుకు తగ్గట్టే ప్రాథమిక స్థాయిలోవున్న నటుడు కాబట్టి ఆ మోతాదులోనే నటన ఉంది. అయితే డబ్బు విలువ తెలియజేసే సన్నివేశంలో ఆకట్టుకున్నాడు. అలాగే.. అతను, భాషా బార్‌లో కేవలం ఒక్క పెగ్కుకోసమే వచ్చి రెండు మూడు అలా అనేక పెగ్గులు కొట్టేసిన సీన్లో హావభావాలు బాగా పలికించాడు. కానీ హీరోయిన్‌తో వున్న సన్నివేశాలు తదితరాల్లో భావప్రకటన నైపుణ్యలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. నేహాగా రుక్సర్ ధిల్లాన్ పెద్దగా నటన ప్రదర్శించడానికి స్థానం లేకపోయింది. ఉన్నంతలో ఓకె. బాలనటుడిగా గతంలో ఆకట్టుకున్న మాస్టర్ భరత్, పెద్దై ఇందులో భాషా అవతారమెత్తాడు. హీరో ఫ్రెండ్‌గా చూసినవాళ్లనే చూసి బోరు కొట్టినవాళ్లకి భరత్ ఓ బూన్‌లా వచ్చాడు. అయితే దర్శకుడు ఈయన్నింకా పూర్తిస్థాయిలో వాడుకుంటే బావుండేది. నాయకుని తండ్రిగా నాగబాబు, యువ రాజకీయ నాయకుడిగా రాజా, అతని తండ్రిగా శుభలేఖ సుధాకర్, పెద్దాయనగా కోట శ్రీనివాసరావు పాత్రల పరిధి తక్కువ. వీలైనంతవరకూ యువ రాజకీయ నాయకుడు భార్గవ్‌గా రాజా తన నటనను ప్రదర్శించడానికి ప్రయత్నించాడు. కానీ సన్నివేశాల్లో బలం లేకపోవడంవల్ల నిలబడలేకపోయింది. రామ్ తన ఛాయాగ్రహణంలో అమెరికా అందాలు ఎంత బాగా చూపారో, అంత డీటైల్డ్‌గా హైదరాబాద్‌లోని మురికివాడలనూ చూపారు. జూదా సాండీ స్వరాలు ఏదీ గుర్తుపెట్టుకునే స్థాయిలో లేవు. ‘మెల్ల మెల్లగా’ ఒక్కటే ఓ మాదిరిగా ఉంది. ‘ఇండియాలో ఏముంది పాప్యులేషన్ పొల్యూషన్ తప్ప’ అని నాయక పాత్రతో అనిపించడం బాగులేదు. దీని ఉద్దేశ్యం హీరోకి తొలుత భారతదేశంపై వున్న అభిప్రాయాన్ని చెప్పించడమైనా అది అంతకుముందు సన్నివేశాల్లోనే చూపారు కనుక ఈ డైలాగ్ అనవసరం. ‘బాగుపడాలంటే బాధలు పడాలి’ అన్న సంభాషణ స్ఫూర్తిదాయకంగా వుంది. ఇంకో సన్నివేశంలో ‘చిచోర్’ పాత్రతో మరొక పాత్ర ‘ఏంటి?’ అని అడిగితే ‘నైంటి’ అనిపించడం చూపిన సన్నివేశపరంగా బాగా ఫిట్టైంది. కాఫీ విత్ కరణ్ పేరడీగా కాఫీ విత్ కిషోర్ పాత్రలో వెనె్నల కిషోర్ తన బ్రాండ్ నటనని మరోసారి వదిలేశారు. ఆ పాత్రతో భాష రానివాడే ‘ప్రాస’ వాడతాడు అనిపించడం యాప్ట్‌గా ఉంది. కథ ప్రారంభంలో రోజుకి 38 రూపాయలతో సగటు మానవుడు బ్రతకొచ్చు అన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి వాక్యాలను మరింత క్లారిటీగా చెప్పివుంటే బాగుండేది. మరి దాన్ని తిరగేసి రోజుకి 83 రూపాయలతో బ్రతికేయొచ్చు అన్న నాయకుడి శైలినీ చూపడం ఆ 38 ఫిగర్‌ని వాడుకోవడం కోసమే అన్నట్టు అనిపించింది. దర్శకుడు సంజీవ్‌రెడ్డికి సినిమా టైటిల్ (ఎబిసిడి)లాగే తొలి తొలి అడుగుల చిత్రం కనుక ఆ మాదిరి కన్‌ఫ్యూజన్ బాపతు ధోరణి కన్పడింది. అసలీ కన్‌ఫ్యూజన్‌ని అధిగమిస్తే ఎబిసిడి కనీసం ఆర్.. ఎస్.. టి స్థాయికి చేరుండేది..

-అన్వేషి