రివ్యూ

కాకి బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు-- శ్రీమతి బంగారం

తారాగణం:
రిషి, రాజీవ్ కనకాల, రీచాసిన్హా, శీతల్, వేణుమాధవ్,
హేమ తదితరులు.
సంగీతం: సిద్ధబాపు.
కెమెరా: బాబు
నిర్మాతలు:
చెన్న శ్రీనివాస్,
కొత్త సత్యనారాయణరెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వినయ్‌బాబు.
**

పెళ్లయినప్పటినుండి ఆలు మగల శ్వాస ఒకే విధంగా ఉండాలి. జీవితాంతం కలిసి ఉండాల్సిన వారిరువురు ప్రతి విషయాన్ని ఒకరికొకరు చర్చించుకొని, నిర్ణయాలు తీసుకోవాలి. మంచైనా, చెడైనా కలిసి పంచుకోవాలి. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించి దాంపత్యంలోని మాధుర్యాన్ని అనుభవించాలి. ఇదే పెళ్లికి పెట్టిన ప్రధానమైన నియమం. కానీ నేటి యువత ఎలా పెళ్లి సూత్రాలను కాలరాచి తమ ఇష్టానుసారం జీవితాలను సాగిస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తుంది శ్రీమతి బంగారం. ఒక్కసారి తప్పుచేస్తే ఆ తప్పుని క్షమించవచ్చు. కానీ తప్పని తెలిశాక కూడా పదే పదే తప్పుచేస్తూ పోతే అది క్షమించరాని నేరం. అటువంటి నేరం చేయడానికి తమవంతు సహకారాన్ని, తమ ఇబ్బందులతో బేరీజు వేసుకుంటే అది పొసగని విషయం. అటువంటి విషయాల సమాహారంగా ఈ చిత్రం సాగుతుంది.
కథేంటి?
సంజు (రాజీవ్‌కనకాల) ఓ కార్పొరేట్ కంపెనీకి యజమాని. అతని భార్య భువన (రీచాసిన్హా) ఇద్దరిదీ అన్యోన్యమైన దాంపత్యం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. ఎవరెవరికి ఏది ఇష్టమో వాళ్లిద్దరికీ తెలుసు. అందుకు తగ్గట్టుగా వారిరువురు సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు. అదే కంపెనీలో పనిచేసే శ్రీరామ్ (రిషి) నమ్మకంగా భార్యాభర్తల గౌరవాన్ని పొందుతాడు. ఇవే సీన్లతో ఓ అరగంట సాగాక సంజు తన కంపెనీకి అనుబంధ సంస్థను ప్రారంభించడానికి అమెరికా వెళతాడు. అప్పటినుంచి భువన సంజు ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ ఉంటుంది. వయసు కోరికలను హద్దులో పెట్టుకోలేకపోతుంది. 24 గంటలు సంజుకు ఫోన్ చేసి విశేషాలు అడుగుతుంటుంది. అక్కడ సంజు విపరీతమైన పని వత్తిడితో తన భార్యతో మాట్లాడలేకపోతుంటాడు. ఈ నేపథ్యంలో తనవద్ద పనిచేసే శ్రీరామ్‌ను తన అడ్డులేని కోరికలను తెలిపి, తనకు ఆనందాన్నివ్వమని అడుగుతుంది భువన. మొదట రిషి ఆమె అభ్యర్థనను వ్యతిరేకించినా చివరికి వయసు పోరు తట్టుకోలేక ఆమెకు లొంగిపోతాడు. అయినా కానీ తప్పు తప్పే అని ఆమెను వారించటానికి ప్రతిసారీ ప్రయత్నిస్తాడు. అందుకు ఆమె ‘తప్పని పరిస్థితుల్లో తప్పని తెలిసినా తప్పుచేయడం తప్పుకాదని’ వాదిస్తుంది. అయినా శ్రీరామ్ తనలోని మానవత్వం ఉన్న మనిషి చెప్పే మాటలు కాదనలేకపోతాడు. తాను దగ్గర లేకున్నా తన భర్త అమెరికాలో ఆయన సెక్రటరీతో ఆనందంగా వున్నాడని, తాను ఎందుకు ఉండకూడదని భువన ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యం ఇలా సాగుతుండగా చివర్లో సంజు ఇంటికి రాగానే విషయాన్ని గ్రహిస్తాడు. అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరికి వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి అనేదే మిగతా కథనం.
ఎలా వుంది?
నైతిక విలువలకు సంబంధించిన కథనంతో, దానికి వయసు కోరికలు, శారీరక సంబంధాలు, అక్రమ పరిచయాల నేపథ్యంలో సాగిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని శృంగార పరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు. అందుకు తగ్గట్టు రాజీవ్ కనకాల, రిషి, రీచాసిన్హాల పాత్రలు మలిచారు. భార్యభర్తలు ఒకప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండే పరిస్థితి లేదు కనుక అక్రమ సంబంధాల ఊసు చాలా తక్కువ వినిపించేది. మారుతున్న నాగరికతతో భార్య ఒకచోట భర్త ఒకచోట ఉన్నప్పుడు ఇలాంటి కథనాలు తప్పనిసరి అని ఈ చిత్రంలో చూపించారు. కోరిక పుట్టినప్పుడు తీర్చుకోవాలి కానీ దానికి అనవసరమైన సెంటిమెంట్ యాడ్ చేయకూడదు అన్నది ఈ సినిమాలో నీతి. అయితే కోరికలు మనిషిని ఏ విధంగా పతనావస్థకు చేరుస్తాయో ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం జరిగింది. నటీనటుల్లో ఉన్నంతలో ముగ్గురు ఫరవాలేదనిపించేలా నటించారు. సాంకేతికంగా కెమెరా పనితనం బాగుంది. పున్నమి రాత్రి, రారా మగధీరా పాటలు విసుగుపుట్టించాయి. అర్ధాంగి అందాల అపరంజి బొమ్మ అన్న పాట పరవాలేదనిపించింది. మాటలు కూడా కథకు తగ్గట్లే సాగాయి. దర్శకత్వ పరంగా ఇలాంటి కథలు ఎన్ని వచ్చినా కొత్తగా ఎలా తీయవచ్చో మళ్లీ చూడొచ్చు. ఒక విధంగా శృంగారానికి పెద్ద పీట వేసినట్టుగా కనిపించింది. దాని మాటున మరో మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నమే జరిగింది. మొత్తానికి బంగారానికి మెరిసేంతగా మెరుగుపెట్టలేదు.

-తిలక్