రివ్యూ

ఇంజన్ ప్రాబ్లెమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌దూత్ * బాగోలేదు

తారాగణం: మేఘాంశ్, సుదర్శన్, నక్షత్ర, ఆదిత్య తదితరులు
ఎడిటర్: విజయ్‌వర్థన్ కావూరి
సినిమాటోగ్రాఫర్: విద్యాసాగర్ చింత
సంగీతం: వరుణ్ సునీల్
నిర్మాత: ఎంఎల్‌వి సత్యనారాయణ
దర్శకత్వం: కార్తీక్-అర్జున్
============================================================
రియల్‌స్టార్‌గా టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం రాజ్‌దూత్. అర్జున్-కార్తీక్‌ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మించారు. రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో మేఘాంశ్ హీరోగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
కథ:
సంజయ్ (మేఘాంశ్) తన తండ్రి స్నేహితుడి కూతురు అయిన ప్రియా (నక్షత్ర) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మా ఇద్దరికీ పెళ్లిచేయమని ప్రియా తండ్రి వెంట పడుతూ బ్రతిమాలుకుంటూ ఉంటాడు. అయితే ఎలాంటి గోల్స్ అంటూ లేని జులాయిగా తిరిగే సంజయ్‌ని మార్చాలన్న ఆలోచనతో ప్రియా తండ్రి రాజ్‌దూత్ బైక్‌ని తీసుకొస్తే నీ గురించి ఆలోచిస్తానని చెబుతాడు. దాంతో తన ప్రేమని గెలుచుకునేందుకు సంజయ్ ఆ బైక్ తెచ్చేందుకు బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో సంజయ్‌కి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అప్పటికే చాలామంది చేతులు మారిన ఆ బైక్ ఎవరి దగ్గర వుంది అన్నది మిగతా కథ.
శ్రీహరి తనయుడు అనగానే ప్రేక్షకులకు ఒకింత ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ దాన్ని అందుకునే రేంజ్‌లో ఈ సినిమా విషయంలో అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. హీరోగా పరిచయం అయిన మేఘాంశ్ తన పాత్రలో పెద్దగా ఆకట్టుకోలేదు. నటన విషయంలో ఇంకా రాణించాలి. డాన్స్ విషయంలో ఫర్వాలేదు అనిపించాడు. ఇక హీరోయిన్ నక్షత్ర తన పాత్ర పరిధివరకు బాగానే చేసింది. గ్లామర్‌గా అందంగా కనిపించేందుకు ట్రై చేసింది. ఇక హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన నటుడు బాగా చేశాడు. కమెడియన్ సుదర్శన్, మనోబాల తన కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన నటులు జస్ట్ ఓకె.
ఈ సినిమా విషయంలో అసలు సమస్య కథ దగ్గరే వుంది. ఎలాంటి పట్టులేని కథను ఎంచుకున్న దర్శకులు, ఆ కథను నడిపించే విషయంలో తడబడ్డారు. కథకు అవసరం లేని కామెడీ, లాజిక్ లేని సన్నివేశాలు చిరాకు పుట్టిస్తాయి. బైక్ కోసం హీరో వెళ్లడం, బైక్ తెస్తే తన కూతురిని ఇచ్చి పెళ్లిచేస్తాననడం లాంటి అంశాలు ఏ మాత్రం ఆకట్టుకోవు. కథలో ఎక్కడా భావోద్వేగాలను పండించే సన్నివేశాలు లేవు. హీరో ప్రేమలో నిజాయితీ ఎక్కడా కనిపించదు. దానికితోడు సన్నివేశాల్లో రియాలిటీ పక్కనపెడితే నాటకీయత ఎక్కువైంది. కావాలని సన్నివేశాలు చేసినట్టుగా ఉంటాయి తప్ప.. కథలో లీనమయ్యే అంశాలు అస్సలు కన్పించవు.
ఇక టెక్నికల్ విషయాలని పరిశీలిస్తే, దర్శకులు ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమామాలో బైక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు తప్ప ఎక్కడా తమ మార్క్‌ను క్రియేట్ చేయలేదు. కథనం విషయంలో తడబడ్డారు. అసలు కథలోనే పెద్ద మైనస్ ఉండడంతో కథనాన్ని ఎలా డ్రైవ్ చేస్తారు. మొదటిభాగం అలా సాగిన సినిమా రెండో భాగం విషయంలో ఎలాంటి ఆసక్తి లేకుండా సాగింది. వరుణ్-సునీల్ అందించిన మ్యూజిక్ యావరేజ్. ఆర్‌ఆర్ విషయంలో ఫర్వాలేదని చెప్పాలి. విద్యాసాగర్ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని కొన్ని సన్నివేశాలను అందంగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడితే బాగుండేది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.
చివరగా.. శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా వచ్చిన రాజ్‌దూత్ ఏ కోణంలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని బైక్ జర్నీ సన్నివేశాలు, అక్కడక్కడా రేర్‌గా వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ఫర్వాలేదనిపించినా.. కథ కథనాలు ఏ మాత్రం ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమాలో సరైన ఫ్లో మిస్ అవ్వడం, ఓవరాల్‌గా సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని బాగా దెబ్బతీశాయి. రాజ్‌దూత్ అంటూ బైక్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏవిషయంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడం పెద్ద మైనస్‌గా మారాయి.

-త్రివేది