రివ్యూ

సంక్లిష్ట ప్రతిబింబం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నినువీడని నీడను నేనే ** ఫర్వాలేదు

తారాగణం: సందీప్ కిషన్, ఆన్యసింగ్, వెనె్నల కిషోర్, మడొన్నా సెబాస్టియన్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి తదితరులు
సంగీతం: ఎస్‌ఎస్ తమన్
సినిమాటోగ్రఫీ: ప్రమోద్ వర్మ
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
ఆర్ట్: విదేష్
నిర్మాతలు: దయా పనె్నం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ రాజు
======================================================
నగరం, నక్షత్రం, నెక్స్ ఏంటి?.. ఇలా ‘ఎన్’ బేస్డ్ సినిమాలు చేస్తూ వస్తోన్న సందీప్ కిషన్ -సరైన హిట్టుకోసం కసితో చేసిన మరో ‘ఎన్’ ఫర్ మూవీ -నినువీడని నీడను నేనే. అద్దంలో మరొకరి ప్రతిబింబం కనిపించినపుడు.. దానిముందున్న వ్యక్తి పరిస్థితేంటి? అన్న స్పాన్ పాయింట్ చుట్టూ దర్శకుడు కార్తీక్‌రాజు అల్లుకున్న కథ ఇది. కీలక పాత్రల్లో వెనె్నల కిషోర్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి కనిపించారు. తన ‘సక్సెస్’ను తనే నిర్మించుకునే ఉద్దేశంతో -ఈ ప్రాజెక్టుతో సందీప్ నిర్మాతగానూ మారాడు. ‘న్యూ ఏజ్ థ్రిల్లర్’ కానె్సప్ట్ కాంపైన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారో చూద్దాం.
ఆకస్మిక మరణం సంభవించినపుడు అసంతృప్త ఆత్మ మరొకరిని ఆవహించి -సంతృప్తి కలిగిన తరువాత ఆశ్రయం పొందిన దేహంనుంచి అంతర్థానమవుతుంది. ఇదీ -నినువీడని నీడను నేనే చిత్రానికి అంతస్సూత్రం. ఈ పాయింట్‌పై ఎంతోమంది దర్శకులు గతంలోనే ఎన్నో కథలు అల్లేశారు. ఎవరి స్టైల్లో వాళ్లు నెరేట్ చేసేశారు. ’93లో హాలీవుడ్ డైరెక్టర్ రాన్ అండర్‌వుడ్ ఈ కథకు సరికొత్త ప్రాణం పోశాడు. తరువాత కొరియన్, హిందీ, చివరకు తెలుగులోనూ సైతం సినిమాలు వచ్చేశాయి. ‘హార్ట్స్ అండ్ సోల్స్’ పేరిట తెరకెక్కిన హాలీవుడ్ సినిమాలో హీరో రాబర్ట్ డోనీ జూనియర్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడమే అందుక్కారణం. బేస్ పాయింట్‌ని టచ్ చేస్తే ‘ఎన్‌విఎన్‌ఎన్’ సైతం -‘హార్ట్స్ అండ్ సోల్స్’కి ప్రతిబింబమే. కాకపోతే -రోడ్డు ప్రమాదం అన్న పాయింట్ నుంచి (అందులోనూ కథ అక్కడినుంచే మొదలవుతుంది) దర్శకుడు ఎమోషనల్ స్టోరీని డిజైన్ చేయడంతో -ఫ్లేవర్ మరోలా అనిపించింది.
కథేంటంటే:
మనిషి మేథస్సుకు అందని ఎన్నో విషయాలు సృష్టిలో ఉన్నాయి. మనిషి అనుభవంలోకి అలాంటివి వచ్చినపుడు నమ్మలేని నిజాలుగా మిగిలిపోతాయి అన్న పాయింట్ మీద థీసిస్ చేస్తున్న ఓ మెడికల్ బృందం -సీనియర్ మెడికల్ ప్రొఫెసర్ (మురళీశర్మ) నుంచి కొన్ని కేసుల అనుభవాలు తెలుసుకోడానికి వస్తారు. లైఫ్‌లో తనకెదురైన అటువంటి ఓ ఇన్సిడెంట్‌ను కథగా చెబుతాడాయన.
రిషి (సందీప్‌కిషన్), దియా (ఆన్యసింగ్) కాలేజ్ లవర్లు. పెద్దలు వద్దన్నా -వినకుండా పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ దగ్గరవుతారు కానీ, కుటుంబాలకు దూరమవుతారు. కొత్త లైఫ్ జాయ్‌ఫుల్‌గా ఉంటుంది. దియా బర్త్‌డేను రొమాంటిక్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో -ఓ స్మశానం దగ్గర వీళ్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవుతుంది. అప్పటి నుంచీ రిషి, దియాల ప్రతిబింబాలు మరొకరిలా కనిపిస్తుంటాయి. విషయం అర్థంగాక టెన్షన్‌కు గురవుతారు. ఈ విషయం రిషి మదర్ (ప్రగతి)కి తెలియడంతో -మెడికల్ ప్రొఫెసర్ (మురళీశర్మ)ని కలుస్తుంది. పరీక్షలు జరిపిన డాక్టర్ -ఇద్దరి దేహాల్లో మరొకరి ఆత్మలున్నాయని తేలుస్తాడు. ఆ ఆత్మలు ఎవరివో తెలుసుకోడానికి మిత్రుడైన పోలీస్ కమిషనర్ (పోసాని కృష్ణమురళి)ను ఆశ్రయిస్తారు. రోడ్డు ప్రమాదంలో అర్జున్ (వెనె్నల కిషోర్), మాధవి (మడొన్నా సెబాస్టియన్) అనే యువజంట చనిపోయిందన్న సమాచారం అందుతుంది. -ఇక్కడే ఓ అద్భుతమైన ట్టిస్ట్ రివీలవుతుంది. ఆ ట్విస్ట్‌పైనే కథ మొత్తం సాగుతుంది. రోడ్డు ప్రమాదంలో మరణించింది రిషి- దియాలా? అర్జున్- మాధవిలా? దేహాలు ఎవరివి? ఆత్మలు ఎవరివి? ఈ ట్విస్ట్ -అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివీలవ్వడంతో కథలో ఆసక్తి పెరుగుతుంది. కారు ప్రమాదంలో మరణించింది ఎవరు? వాళ్లది ప్రమాద మరణమా? లేక హత్యకు గురయ్యారా? ఆకస్మిక మరణానికి గురైన వాళ్ల ఆత్మలు బతికున్న వారి దేహాల్లో ఎందుకు ఆశ్రయం పొందుతున్నాయి? చివరకు ఎవరి కథ ఎక్కడ ముగిసింది? అన్నది అనేక మలుపులతో సాగుతుంది.
పాయింట్ పాతదే అయినా కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు ఇందులో. హారర్, మిస్టరీ అంశాల మేళవింపు బావుంది. కానీ, దాన్ని అర్థం చేసుకునే క్రమంలో కామన్ ఆడియన్ కథకు దూరమైపోయాడు. ఆరంభమంతా రొటీన్ ‘ఆత్మ’ కథే అనిపించినా, ఆత్మలని మించిన అంశాలను స్పృశించే సన్నివేశాలు డిజైన్ చేసి క్రమంగా కథాగమనాన్ని మార్చుకుంటూ వెళ్లారు. కారు ప్రమాదం తరువాత -ప్రతిబింబాలు వేరుగా కనిపించే సన్నివేశంతో ఆసక్తిపెంచుతూ థ్రిల్లర్ లైన్‌కు తీసుకొచ్చాడు దర్శకుడు. ఇలా ఎందుకు జరిగిందన్న విషయాన్ని తెలుసుకోడానికి అర్జున్, మాధవిలే వైద్యుడిని సంప్రదించే విషయం కొత్తగా అనిపించినా, క్లారిటీ లేకపోవడంతో -కథను ఆడియన్ ఫాలో కాలేకపోయాడు. విరామ సమయానికి -్ఫస్ట్ఫా స్టోరీయే ఓ ప్రతిబింబమన్న విషయం రివీల్ చేయడంలోనూ స్పష్టత లేదు. దీంతో -తరువాతి సన్నివేశాలు గందరగోళమైపోయాయి. ఎవరి ఆత్మలు ఎవరిలో ఉన్నాయన్న సందిగ్ధతను ఆలోచించే దగ్గరే ప్రేక్షకుడు ఉండిపోతాడు. వాటిని నివృత్తి చేయడానికి నడిపించే సన్నివేశాల్లోనూ స్పష్టత లేకపోవడం సినిమాకు మైనస్. ద్వితీయార్థంలో సన్నివేశాలు సాగదీత. పతాక సన్నివేశాలన్నీ థ్రిల్లర్‌ను వదిలేసి సెంటిమెంట్‌పై సాగిపోయాయి. మొత్తంగా దర్శకుడు ‘స్ట్రెయిట్‌గా ఏ పాయింట్ చెప్పాలనుకున్నాడు?’ అన్న విషయంలో ప్రేక్షకుడికి క్లారిటీ రాలేదు. సినిమాకు సందీప్ కిషన్, ఆన్యసింగ్‌లే కీలకం. వాళ్లిద్దరే సినిమాను భుజాలపై మోయాల్సి వచ్చింది. సందీప్ పడిన కష్టానికి దర్శకుడు న్యాయం చేయలేకపోయాడు. ఆన్యసింగ్ పాత్రకు తగిన సహజత్వాన్ని చూపించింది. ప్రథమార్థంలో ప్రతిబింబానికే పరిమితమైన వెనె్నల కిషోర్, సెకెండాఫ్‌లో తనదైన హాస్యం పండించి సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దెయ్యాలంటే భయపడే పోలీస్‌గా పోసాని నవ్విస్తే, మురళీశర్మ, ప్రగతి, పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు పాత్రల పరిధిమేరకు నటించారు. దర్శకుడు విఐ ఆనంద్, కార్తీక్ నరేన్, నటి మాళవికా నాయర్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. తమన్ నేపథ్య సంగీతం, ప్రమోద్ వర్మ సినిమాటోగ్రఫీ.. వెరసి సంగీత, సాంకేతికంగా సినిమాలో రిచ్‌నెస్ కనిపించింది. స్రెయిట్ పాయింట్‌ను నేరేట్ చేయగల సత్తావున్నా, ‘సమపాళ్లలో నవరసాలు’ అన్న కోణానికి దర్శకుడు ప్రాథాన్యతనివ్వడమే కొంపముంచింది. సినిమా స్థాయికిమించి నిర్మాణ విలువలున్నాయి. హీరోగా సరే, నిర్మాతగా సందీప్‌కు ఈ సినిమా ఎంతవరకూ సక్సెస్‌నిస్తుందో -మారుతోన్న ఆడియన్స్ టేస్ట్ మీదే ఆధారపడి ఉంది.

-రాణీప్రసాద్