రివ్యూ

సింబా.. గర్జించాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద లయన్ కింగ్ *** బాగుంది

సంగీతం: హన్స్ జిమ్మెర్
సినిమాటోగ్రఫీ: జోసెల్ కాలెట్
స్క్రీన్ ప్లే: జెఫ్ నాథ్సన్
ఎడిటర్స్: మార్క్ లివోల్సి, ఆడమ్ గెర్స్టెల్
దర్శకత్వం: జోన్ ఫ్రావియు
===============================================================
మనిషి -మృగ ప్రవర్తనకు దగ్గరవుతున్నాడు. మృగం -మనిషిలా ప్రవర్తిస్తే? ఈ ఆలోచనకు -పాతికేళ్ల క్రితమే డిస్నీ పురుడుపోసింది. అలా -1994లో పుట్టిందే ‘ద లయన్ కింగ్’ సినిమా. అదే యానిమేటెడ్ చిత్రాన్ని అదే టైటిల్‌తో -్ఫటో రియలిస్టిక్ కంప్యూటర్ యానిమేటెడ్ టెక్నాలజీని యాడ్ చేసి మళ్లీ ఆడియన్స్ ముందుకు తెచ్చింది డిస్నీ. అర్థవంతమైన ఆలోచనకు బాగా పరిచయమున్న గొంతుల్ని మేళవించి థియేటర్లకు వదిలింది. భాషతో సంబంధం లేకుండా భావాన్ని ఎంజాయ్ చేయడంలో మన ఆడియన్స్‌కు మించినవాళ్లు లేరు. ఆ విషయాన్ని ఇటీవలే వచ్చిన ‘అవెంజర్స్ -ది ఎండ్ గేమ్’ లాంటి అనేక హాలీవుడ్ చిత్రాలు భారీ వసూళ్లను రుచి చూపించి మరీ రుజువు చేశాయి. ఆ దారిలోనే ఇప్పుడు ‘ద లయన్ కింగ్’ సైతం థియేటర్లలో గర్జిస్తోంది.
డిస్నీ సృష్టించిన ఓ అద్భుతమైన అడవికి రారాజు -ముఫాసా (సింహం). అతని భార్య సారాభి (సివంగి). ముఫాసా -సమర్థనీయ పాలనలో మిగతా ప్రాణులన్నీ హాయిగా జీవిస్తుంటాయి. మంచికి మరోవైపు చెడుంటుంది. ఆ చెడే -సార్క్. ముఫాసా సోదరుడు. రాజ్యకాంక్షతో రగిలిపోతుంటాడు. ఎప్పటికైనా అడవికి రాజై, సారాబిని సొంతం చేసుకోవాలన్న ఆశలతో ఉంటాడు. అతని ఆశలపై నీళ్లుపోస్తూ -ముఫాసా కడుపున యువరాజు పుడతాడు. వాడు -సింబా. రాజు కొడుకే రాజు -అన్న నీతిననుసరించి అడవి జంతువలన్నీ సింబా పుట్టిన రోజును వేడుక చేసుకుంటాయి. ముఫాసాను అడ్డుతప్పిస్తే చాలన్న వ్యూహంతోవున్న సార్క్‌కు ఇది మరింత మంట పుట్టిస్తుంది. ముఫాసాతోపాటు సింబా సైతం అంతమొందించాలనుకుంటాడు. ఆ క్రమంలో -రాజ్యానికి కాస్త దూరంగా చీకటి గుహల్లో బతికే రాక్షస హైనాల సాయం తీసుకుంటాడు. ఎప్పుడూ ఆకలితో నకనకలాడే హైనాలకు -సింబాను ఎరవేస్తాడు. చీకటి గుహలను పరికించటం వీరుడి లక్షణమన్న -చిన్నాన్న మాటతో గుహల వద్దకెళ్తాడు సింబా. బాల్య స్నేహితురాలు నీలా సైతం సింబాను అనుసరిస్తుంది. రాజ్యానికి కీలక సమాచారం మొసుకొచ్చే వ్యక్తిగత గూఢచారి నుంచి సమాచారం అందుకున్న ముఫాస -హైనాల వలయంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలోవున్న సింబా, నీలాను రక్షించుకుంటాడు. ఆ సమయంలోనే రాజు ఎలా ఉండాలన్న నియమాలు సింబాకు వివరిస్తాడు. ‘సూర్య కిరణాలు ప్రసరించే ప్రతి చోటునూ రక్షించే బాధ్యత రాజుపై ఉంటుంది’ అని చెబుతాడు. ప్రమాద సమయాల్లో -ఆకాశంలో నక్షత్రాలుగా కనిపించే పూర్వీకులు మనకు దారి చూపిస్తారంటూ చెబుతాడు.
ఇదిలావుంటే, పగతో రగిలిపోతున్న స్కార్ -రాక్షస హైనాల సాయంతో ముఫాస, సింబాలను అంతమొందించే మరో కుట్రను అమలు చేస్తాడు. ఈసారి సింబాను రక్షించే ప్రయత్నంలో -ముఫాసా కన్నుమూస్తాడు. తండ్రి మృతదేహం వద్ద ఏడుస్తున్న సింబాను -తన మాటలతో భయపెట్టి రాజ్యం వదిలిపోయేలా చేస్తాడు స్కార్. అలా రాజ్యం దాటాలనుకున్న సింబాను -రాక్షస హైనాలు వెంటాడుతాయి. సింబా ఎలా తప్పించుకున్నాడు? రాజ్యం దాటేసిన సింబా -పొరుగు ప్రాంతంలోని పుంబా (అడవిపంది), టిమో (అడవి ఉడత)లను ఎలా కలిశాడు? సింబాకు వాళ్లు చేసిన సాయమేంటి? పెరిగి పెద్దవాడైన సింబా -‘సింహగర్జన’తో తన రాజ్యాన్ని ఎలా కైవసం చేసుకున్నాడు. అందుకు ప్రియురాలు నీల చేసిన సాయమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలే -మిగతా సినిమా.
స్ర్తికాంక్ష, రాజ్యకాంక్ష -ప్రధాన వస్తువులుగా కనిపించే రామాయణ, మహాభారతాల సారాన్ని ఎన్నో భాషల్లో కథలుగా చేసుకుని ఎన్నో సినిమాలొచ్చాయి. ‘ద లయన్ కింగ్’ సైతం అదే బాపతు. కాకపోతే -మానవ భావజాలంతో జంతువుల మధ్య సాగే విలక్షణ కథ ఇది. కథపరంగా ఇదీ ఓ చందమామ, బాలమిత్రలాంటి అడవి కథే. కాకపోతే -్ఫటో రియలిస్టిక్ టెక్నాలజీ మనల్ని మరో ప్రపంచంలోకి లాక్కుపోతుంది. ఓ అద్భుతమైన అడవిలో ఎతె్తైన ప్రదేశం నుంచి జంతు ప్రపంచాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. జంతువుల సృష్టి, వాటి ఆలోచనా విధానం, ప్రవిర్తించే తీరు, మంచి చెడుల విశే్లషణ, ప్రేమాప్యాయతలు అనుభూతించే సమయంలో.. ఇవన్నీ కంప్యూటర్ ఎఫెక్ట్స్ అని పెట్టుకోలేం. ఏ క్రాఫ్ట్స్‌ను చూసినా ‘అద్భుతం’ అనాలనిపిస్తుంది. వీఎఫ్‌ఎక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాత్రల ఆవిష్కరణ.. ఇలా ఓ సాంకేతిక సంభ్రమాశ్చర్యాన్ని ఆవిష్కరించింది డిస్నీ టీం.
సింబా, ప్రియురాలు నాలా మధ్య వచ్చే ‘రొమాంటిక్ ఫైట్’లో వాటి హావభావాలు మచ్చటగొలుపుతాయి. ముఫాసా, తన భార్యపై చూపించే ప్రేమ, కొడుకుపై చూపించే ఆప్యాయత -అవి జంతువులన్న విషయాన్ని మనకు గుర్తుకు రాకుండా చేస్తాయి. నిజానికి సింహానికి విరుద్ధమైన ప్రవర్తనను ‘స్కార్’కి అప్లై చేసినా -సినిమాటిక్ విలనీ లిబర్టీ అని సరిపెట్టేసుకోవచ్చు. స్క్రీన్ మొత్తం జంతువులే కనిపించినా -పాత్రలను ఫాలో అవుతాం తప్ప జంతువులన్న ఆలోచన మస్తిష్కంలోకి రానీకుండా చిత్రబృందం కృషి చేసింది.
చిత్రంలో -ముఫాస (మృగరాజు)కు రవిశంకర్, అతని కొడుకు సింబా (యువరాజు)కు నాని అద్భుతమైన గొంతునిచ్చి పాత్రలకు ప్రాణం పోశారు. పుంబా (అడవి పంది)కి బ్రహ్మానందం, టిమో (అడవి ఉడుత)కు అలీ డబ్బింగ్, ప్రతి నాయకుడు స్కార్ (సింహం)కు జగపతిబాబు, సింబా ప్రియురాలు నాలా (యువరాణి)కి లిప్సిక డబ్బింగ్ బావుంది. పదునుదేరిన సాంకేతిక ప్రపంచం నుంచి పుట్టిన ‘్థర్డ్ డైమన్షన్’ ఫొటోగ్రఫీని పిల్లలే కాదు పెద్దలూ పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ప్రత్యేకంగా పిల్లల కోసం అనదగ్గ చిత్రం కనుక -పనిగట్టుకుని లోపాలు వెతకాల్సిన పని లేదు. సో, డిస్నీ ప్రయత్నాన్ని అభినందించాలి. ఇట్స్ ఏన్ ఎమోషనల్ విజువల్ ట్రీట్.

-విజయ్‌ప్రసాద్