రివ్యూ

కామన్ కుర్రాడి పగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుణ 369 ** ఫర్వాలేదు
**
తారాగణం: కార్తికేయ, అనఘ, ఆదిత్యమీనన్, రంగస్థలం మహేశ్, సాయికుమార్, మంజుభార్గవి, నరేష్, హేమ తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రామ్
నిర్మాత: అనిల్ కడియాల, ప్రవీణ, తిరుమల్‌రెడ్డి
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
**
ఆర్‌ఎక్స్ 100తో ఫ్యూచర్ హీరో టాగ్‌లైన్ తగులుకుంది కార్తికేయకు. విఫల ప్రేమికుడి పెర్ఫార్మెన్స్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో -తొలి సినిమాయే ఇమేజ్ చట్రంలోకి లాగేసింది. తన ప్రమేయం లేకుండానే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉచ్చులో ఇరుక్కున్న టైంలో -రెండో సినిమా హిప్పీ చేశాడు. ఆ ప్రాజెక్టు కెరీర్ మైలేజ్ ఇవ్వలేదు సరికదా, రెండో ప్రాజెక్టు సంతృప్తినీ మిగల్చలేదు. ఆచి తూచి అడుగులేసే క్రమంలో చేసిన మూడో ప్రాజెక్టే -గుణ 369. దర్శకుడు అర్జున్ జంధ్యాల. బోయపాటి అసిస్టెంట్ అన్న టాగ్ లైన్‌తో చేసిన తొలి ప్రయత్నం. మంచి హీరోయిక్ మెటీరియల్ -కార్తికేయ. యాక్షన్ చిత్రాల దర్శక శిష్యుడు -అర్జున్ జంధ్యాల. వీళ్ల కాంబో -ఆడియన్స్‌కి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. ఇద్దరిలో ఎవరెక్కువ మైలేజ్ తీసుకున్నారు. దర్శకుడు -హీరోకి మూడు ఆరు తొమ్మిది నెంబరెందుకు తగిలించాడు?

గుణ (కార్తికేయ) ఓ కామన్ బోయ్. మధ్య తరగతి కుటుంబ నేపథ్యం. సహజంగానే -్ఫ్యమిలీకి ప్రాణం పెట్టేసే మనస్తత్వం. అనవసర ఆవేశం -కుటుంబానికి ఇబ్బందులు తేగలదన్న భయంతో దేనికైనా తల దించుకుపోయే రకం. అలాంటి స్మార్ట్ కుర్రాడి లైఫ్‌లోకి గీత (అనఘ) ఎంటరవుతుంది. హీరో హీరోయిన్ల పరస్పర ప్రేమ.. జోయ్‌ఫుల్ డేస్.. ఇదీ కథ మొదలు. తనంటే అమితంగా ఇష్టపడే ఫ్రెండ్ కోసం -అనవసర ఇష్యూలో తలదూర్చి రిస్క్‌లో పడతాడు గుణ. మంచికెళ్తే -చెడు ఈడ్చి ముఖంమీద కొడుతుంది. పైగా -కుటుంబాన్ని, ప్రేమికురాలిని టార్గెట్ చేస్తుంది. ఎవ్వరి వ్యవహారంలోనూ తలదూర్చని గుణ -స్నేహితుడి కోసం ఎందుకు దారిమార్చాడు? దాని పర్యావసానాల తీవ్రతెంత? ఆ పరిస్థితులను అధిగమించే క్రమంలో ‘గుణ’ షేప్ ఎలా మారిపోయింది? ఇదీ అసలు సినిమా.
**
తప్పుకునే దారిలేనపుడు ఎదురెళ్లడానికి సిద్ధపడాలి. గుణ 369లో అంతర్లీనంగా కనిపించే ధ్రెడ్ ఇదే. తనవాళ్లకు ఏమవుతుందోనన్న భయంతో గొడవలకు దూరంగా బతికేస్తుంటుంది మధ్యతరగతి. అలాంటి మనస్తత్వమున్న కుర్రాడు, కుటుంబాన్ని రక్షించుకోడానికి కర్ర పట్టడం మొదలెడితే -ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయన్నది సినిమాలో చూపించారు. ఆర్‌ఎక్స్ 100, హిప్పీ అనుభవాల నేపథ్యంలో -నేలమీద నడిచే కథనే ఎంపిక చేసుకున్నాడు కార్తికేయ. అనూహ్యంగా హిట్టు మోసుకొచ్చిన ఆర్‌ఎక్స్ 100లాగే -ఈ కథా వాస్తవిక ధోరణితో సాగుతుంది. కామన్‌గా కనిపించే విషయాలనే -సినిమాటిక్ మెలో డ్రామాగా మలచుకున్నాడు దర్శకుడు. కుటుంబంలో కామన్ కుర్రాడి నుంచి కథ మొదలుపెట్టి -ఎలాంటి సోషల్ ఇష్యూస్‌లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, తెగింపు చూపించే కుర్రాడి కసి ఎంత టెర్రిపిక్‌గా ఉంటుందో చూపించే ప్రయత్నంగా ఈ సినిమా సాగుతుంది. కథా నేపథ్యం.. హీరో హీరోయిన్ల ఇంట్రో, ఇద్దర్నీ కామన్ లవ్ ట్రాక్‌లోకి తెచ్చేందుకు టైమ్ పాస్ చేస్తూ -ప్రీ ఇంటర్‌మిషన్ సీన్‌తో ఓ టర్న్ ఇచ్చాడు. అనూహ్య మలుపుతో సెకెండాఫ్‌పై ఆసక్తి పెంచుతూనే -తన పాయింటాఫ్ మైండ్‌లోకి కథను దర్శకుడు తెచ్చుకోగలిగాడు. ఇక ద్వితీయార్థం మొత్తం పగతో రగిలే హీరోనే చూపించాడు. తన లైఫ్ క్రైసిస్‌లో పడటానికి కారణమైన వాళ్లతో పగ తీర్చుకోవడమే కథగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో మరో ట్విస్ట్‌తో దర్శకుడు ఆసక్తి పెంచినా, గుణకు బలాన్నివ్వలేకపోయింది. సామాజిక ఇతివృత్తం నీడలో పగ తీర్చుకోవడం అనే కమర్షియల్ ఎలిమెంట్‌ను మాస్ యాంగిల్‌లో చూపించే దర్శకుడు ప్రయత్నం పెద్దగా ఫలించలేదు.
ఆడియన్స్‌కు తనపై భరోసా రాకమునుపే -కార్తికేయ మరోసారి బలమైన పాత్రనెంచుకుని ప్రయోగానికి సాహసం చేశాడు. పెర్ఫార్మెన్స్‌పరంగా కార్తికేయ పరిణితి చూపించినా, బలహీనంగా సాగిన కథావిధానం అతని కష్టానికి కొత్త షేప్ ఇవ్వలేకపోయింది. ఫస్ట్ఫాలో అనవసర వ్యవహారాలకు దూరంగావుండే అల్లరి పిల్లాడిగా, ద్వితీయార్థంలో పగ తీర్చుకుని ఆవేశపరుడిగా -రెండు షేడ్స్‌లో కార్తికేయ ఓకే అనిపించాడు. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌లో కార్తికేయ ది బెస్ట్. తొలి సినిమాతోనే హీరోయిన్ అనఘ మెప్పించింది. నరేష్, హేమ పాత్రల పరిధిమేరకు చేస్తే, రంగస్థలం మహేశ్‌కు మంచి పాత్ర దొరికింది. ఊహించని మలుపులకు కారణమయ్యే పాత్ర ఇతనిది. ఆడియోగా ఆకట్టుకున్న బుజ్జి బంగారం పాట -సినిమాలోనూ జోష్‌గా సాగింది. మిగిలిన పాటల ప్రస్తావన అనవసరం. టెక్నికల్‌గా సంగీతం, కెమెరా నేత్రం బలంగా పనిచేశాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. బోయపాటి దగ్గర పని చేసిన వాళ్లంతా బోయపాటిలే కాలేరంటూ ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో చెప్పిన అర్జున్ జంధ్యాల, కథను మాత్రం గురువు బాటలోకే తీసుకెళ్లాడు. గుణ 369 -దర్శకుడు అర్జున్‌కు ‘ఓన్ ఐడెంటిటీ’ ఇస్తుందన్నది డౌటే.

-రాణీప్రసాద్