రివ్యూ

ఎన్‌కౌంటర్ కహానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాట్లా హౌస్ ** ఫర్వాలేదు
**
తారాగణం: జాన్ అబ్రహాం, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి, రవికిషన్, సోనమ్ అరోరా తదితరులు
నేపథ్య సంగీతం: జాన్ స్టీవర్ట్ ఏడూరి
ఎడిటింగ్: మాహిర్ జావేరీ
సినిమాటోగ్రఫీ: సౌమిక్ ముఖర్జీ
నిర్మాణ సంస్థ: టి సిరీస్, ఎమ్మా, జాన్ అబ్రహాం ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకుడు: నిఖిల్ అద్వానీ
**
ఇంచుమించు పదకొండేళ్ల క్రితం.. దేశ రాజధాని కొత్త్ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో దారుణ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇద్దరు ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనలో ఓ పోలీస్ కూడా మరణించాడు. ఈ ఆపరేషన్ -దేశవ్యాప్త ఆందోళనలకు దారితీసింది. ఉగ్రవాదుల సాకుతో అమాయక విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారన్నది ఆరోపణ. ఆందోళనలకు దిగిన కొందరు అరెస్టయ్యారు. బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ఢిల్లీ పోలీసులపై మానవ హక్కుల సంఘాలు గళంవిప్పాయి. ప్రశ్నల వర్షం కురిపించాయి. సంఘటన బూటకమైతే -డిపార్ట్‌మెంట్ వ్యక్తి ఎలా చనిపోతాడని పోలీస్ విభాగం కౌంటరిచ్చింది. కేసులో అధికారులూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌పై తలెత్తిన సవాలక్ష అనుమానాలతో కేసు దేశవ్యాప్తంగా చాలాకాలం ట్రెండింగ్‌లో నిలిచింది. 2008 సెప్టెంబర్ 18న చోటుచేసుకున్న ఆ సంఘటన, దాని పర్యావసానాలు, ఇనె్వస్టిగేషన్ ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రమే -బాట్లా హౌస్.
ఏసీపీ సంజయ్‌కుమార్ (జాన్ అబ్రహాం) పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తుంది. పోలీస్ బృందంతో బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొంటాడు ఏసీపీ సంజయ్. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదలు హతమవుతారు. ఒకడు ప్రాణాలతో పట్టుబడితే, మరో ఇద్దరు తప్పించుకుంటారు. ఉగ్రవాదులుగా భ్రమించి అమాయక విద్యార్థులను పొట్టున పెట్టుకున్నారంటూ -మీడియాలో కథనాలొస్తాయి. ఆ వాదనకు రాజకీయ నాయకులు బలం తోడవుతుంది. మానవ హక్కుల సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతాయి. ఎన్‌కౌంటర్ బూటకం కాదన్న విషయాన్ని ఏసీపీ సంజయ్‌కుమార్ ఎలా నిరూపించడాన్నది సినిమాటిక్ రియాల్టీ.
**
బాట్లాహౌస్ ఘటనకు వారం ముందు (2008 సెప్టెంబర్ 13) ఢిల్లీ మహానగరం వరుస బాంబుదాడులతో దద్దరిల్లింది. 26మంది సామాన్యులు బలైపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. సరిగ్గా వారం తరువాత రహస్య సమాచారం అందుకున్న పోలీసులు బాట్లా హౌస్‌పై ఆకస్మిక దాడి జరిపారు. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వివాదాస్పద కథలోని ముఖ్యభాగంతో తెరకెక్కిన చిత్రమే -బాట్లాహౌస్. పోలీస్ అధికారి సంజయ్ కుమార్‌గా జాన్ అబ్రహాం సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా జాన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. రియల్ ఇన్సిడెంట్‌ను ఎంతవరకూ చూపించాలన్న అంశంపై దర్శకుడికి క్లారిటీ ఉండటంతో -ఆ సన్నివేశాలను నిఖిల్ అద్వానీ అర్థవంతమైన రీతిలో చూపించాడు. ఏసీపీ సంజయ్ కుమార్‌ను క్రైసిస్‌లోకి నెట్టే క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేస్తాయి. హీరో క్రైసిస్‌లో పడటంతో, తరువాతి కథ ఎలా అన్న ఉత్కంఠను రేకెత్తించటంలో దర్శకుడు విజయం సాధించాడు.
ఇన్సిడెంట్‌ను ఎంత శక్తివంతంగా చూపించాడో, దాని కంటిన్యుటీ సెకెండాఫ్‌లో మాత్రం వేగాన్ని అందుకోలేకపోయాడు దర్శకుడు. కోర్ట్ ఆర్గ్యుమెంట్ ఆసక్తికరంగానే సాగినా, సన్నివేశాలు సాగదీత అనిపిస్తాయి. ఒకింత రిలీఫ్‌నిచ్చే నోరా ఫతేహీ గీతాన్ని పక్కనపెడితే, ఎన్‌కౌంటర్ స్టోరీ మొత్తం సీరియస్ ట్రాక్‌పైనే నడిపించటం బావుంది.
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా జాన్ పెర్ఫార్మెన్స్ మెచ్చుకోకుండా ఉండలేం. మీడియా రిపోర్టర్ అయిన భార్య నందిత (మృణాల్ ఠాకూర్) నుంచి అనుబంధం కరవైనా, బాధ్యతల నిర్వహణపై ఆ ప్రభావం లేకుండా చూసుకోగలిగే అధికారి పాత్రలో జాన్ అబ్రహాం నటన బావుంది. మీడియా రిపోర్టర్‌కు తనదైన శైలిలో పాత్ర పోషించింది మృణాల్ ఠాకూర్. సిఐగా రవికిషన్, న్యాయవాదిగా రాజేశ్ వర్మ పాత్రల పరిధి, ప్రాధాన్యత తక్కువే. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బాట్లాహౌస్ సినిమా -ఎన్‌కౌంటర్ ఘటనపై పూర్తి అవగాహన ఉన్న వాళ్లకు రుచించదు. సినిమా వరకూ చూస్తే ఓకే అనక తప్పదు.

-‘వి’