రివ్యూ

ట్రోఫీలే దక్కలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి విజేతలు

తారాగణం:
దినేష్‌లాల్ యాదవ్, పాఖీహెగ్డే, పర్వేష్‌లాల్‌యాదవ్ తదితరులు.
దర్శకత్వం:
హేరి ఫెర్నాండజ్

అందమైన 9 పాటలతో, అద్భుతమైన 9 ఫైట్స్‌తో మీ ముందుకొస్తున్న ‘నేటి విజేతలు’ అన్నది చిత్ర ప్రచారంలో ప్రముఖంగా కన్పించిన నినాదం. సరిగ్గా అలాంటి మూసకట్టు నమూనాలోనే తయారైన చిత్రమిది. భోజ్‌పురిలో ‘ఆజ్‌కీ కరణ్ అర్జున్’ పేరిట 2010లో విడుదలైన సినిమాను ‘నేటి...’ పేరుతో ఆరేళ్ల తరువాత తెలుగులో తర్జుమా చేశారు. రైతుబాంధవుడిలా పేరుతెచ్చుకున్న బావ, సోదరి పంధాకి విరుద్ధంగా కాశీనాథ్ అక్రమంగా అందరి భూముల్నీ లాగేసుకుంటాడు. తన పంథాకు అడ్డు తగులుతున్నాడని బావనీ, అతని పెద్దకొడుకునీ హతం చేసేస్తుంది కాశీనాథ్ బృందం. అలాంటి కాశీనాథ్‌ని అతని సోదరి, రెండో కొడుకు అర్జున్, అతని స్నేహితుడు కృష్ణ ఎలా ఎదుర్కొని తుదముట్టించారో మిగిలిన కథా కమామీషు. ఇలాంటి నలిగి నలిగిన కథా కేంద్రంకోసం భోజ్‌పురి భాష నాశ్రయించడంలో తత్వం ఏమీ బోధపడలేదు. సినిమాలో అహేతుక అంశాలు పుంఖానుపుంఖాలుగా దర్శనమిచ్చాయి. మున్నాభాయ్ బంగ్లాలోకి కృష్ణార్జునులు వచ్చి తమ పని సాఫీగా సాగడంకోసం మెయిన్ ఆఫ్ చేసి కరెంటు సరఫరాను నిలిపివేస్తారు. మధ్యతరగతి వారింట్లోనే కరెంట్‌పోతే విద్యుత్ వచ్చేలా ఇన్‌వర్టర్ సౌకర్యం ఉంటోంది. అలాంటిది డాన్ మున్నాభాయ్ ఇంట్లో కరెంటు నిలిచిపోతే ‘కొవ్వొత్తులు వెలిగించండి’ అంటూ హుకుం జారీచేయడం హాస్యాస్పదం. ఇక -ఈ జన్మలో విజయే గత జన్మలో కృష్ణ అంటూ చెప్పడంలో క్లారిటీ కోసం అసలు దర్శకుడు ప్రయత్నించలేదు.
హాస్యంకోసం డాక్టరుకు చెవుడు రావడంలాంటి సన్నివేశాలు ఏకాలపు ‘హాస్యం’ అన్న అనుమానంతో జుట్టుపీక్కోవడం ప్రేక్షకులవంతైంది. కాస్త వెగటు/ మోటు మాటలు పాటల్లోనూ విస్తరించాయి. ‘చీకటైతే చీకు చెంతా పక్కపైనే తీర్చనా?’ ‘ఎరుపెక్కే నీరైక పరుపెక్కేదెప్పుడు..?’ లాంటివి కోకొల్లలుగా పాటల్లో విశ్వరూపం చూపాయి. ఇవన్నీ ఒక ఎతె్తైతే, కాశీనాథ్ బృందానికి వినోదం సమకూర్చడం కోసం ఏర్పరిచిన ఐటెమ్ సాంగ్‌లోని పదాలు అన్ని పరిమితులనూ దాటేసింది. ‘జనమెంత పేదరికంలో ఉంటే అంతగా మనమాట వింటారు’ అన్న ఈ చిత్రంలోని వాక్యానికి సామీప్యత మనకు చాలాచోట్ల కనిపిస్తూనే ఉంది. నటీనటుల్లో అందరూ తమకిచ్చిన పాత్రల్ని యాంత్రికంగా పోషించేసి తమతమ పోర్షన్స్ అయిపోయాయి అనిపించారు. ఉన్నంతలో అర్జున్ తల్లి పాత్రధారిణి బాగా నటించారు. ఉన్న తొమ్మిది పాటలూ ‘బీట్’ ప్రధానంగా సాగి ఆడియన్స్ హార్ట్ ‘బీట్’ పెరిగేలా చేశాయి. విసిగిపోయిన కథాసూత్రంతో నేటి ‘విజేతలు’ ఎలా అవుదామనుకున్నారో మాత్రం ఎంతగా ఆలోచించినా అర్థంకాని బ్రహ్మపదార్ధమైపోయింది.

-అనే్వషి