రివ్యూ

వీర.. దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోడి * బాగోలేదు
*
తారాగణం: ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, సిజ్జు, వెనె్నల కిషోర్, ప్రదీప్, సత్య, గొల్లపూడి మారుతీరావు, సితార తదితరులు
సంగీతం: ఫణి కల్యాణ్
బ్యానర్: భావనా క్రియేషన్స్
నిర్మాతలు: పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం
దర్శకత్వం: విశ్వనాథ్ అరిగెల
*
ప్రతి మనిషికి ఓ బలహీనత వుంటుంది. దానినుండి తప్పించుకొన్నవాడు గొప్పవాడవుతాడు. దానికి దాసుడైతే తానే కాక తన చుట్టూ వున్న వారినందరినీ కష్టాలలోకి నెట్టేస్తాడన్న ఓ ఆలోచనకు రూపంగా రూపొందించిన చిత్రం ‘జోడి’. ఇటువంటి డ్రై సబ్జెక్ట్ తీసుకుని దానికి లవ్ ఫ్లేవర్ గుదిగుచ్చడానికి కొత్త ఐడియాలు తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ పాతలోకే జారిపోవడంతో మరో సాదా సీదా జోడిగా మిగిలిపోయింది.
కథ: కపిల్‌దేవ్ (ఆది సాయికుమార్)కు చిన్నప్పటినుండి తండ్రి కమలాకర్ (నరేష్) అంటే అమితమైన కోపం, దాని వెనుక చచ్చేంత ఇష్టం కూడా వుంటుంది. ఓవైపు ప్రేమ, మరోవైపు కోపం చిన్నప్పటినుంచీ కపిల్‌దేవ్‌కు పెరుగుతూనే వున్నాయి. తాను ప్రేమించిన కాంచనమాల (శ్రద్ధా శ్రీనాధ్) కూడా తండ్రి బలహీనత క్రికెట్ బెట్టింగ్‌ల వల్లనే దూరమవ్వడం అతనికి జీర్ణించుకోలేని విషయం. చిన్నప్పుడు దూరమైన గర్ల్‌ఫ్రెండ్ పెద్దయ్యాక ఎదురైంది అనుకుంటాడు కపిల్. ఆమె అభిరుచులు తెలుసుకుంటాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. అంతకన్నా ముందు అనుకోకుండా కాంచనమాల తాత (గొల్లపూడి మారుతిరావు) ద్వారా ఆ కుటుంబానికి దగ్గరవుతాడు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాంచనమాల విషయాలు తెలుసుకుంటూ ఆమెను వెంబడిస్తూ ప్రేమించే పనిలోనే ఉంటాడు. అందుకు తగినవిధంగా ఆమెకూడా అతనికి ఫ్లాట్ అవుతుంది. ఇద్దరూ కలిసి కాంచనమాల ఇల్లు అమ్మడానికి మైసూర్ వెళ్లివస్తారు. (ఈ మైసూర్ ఇల్లు సంగతి ఏంటో క్లియర్‌గా చెప్పలేదు దర్శకుడు. తెలుగువాళ్లు అయివుండి మైసూర్‌లో ఇల్లు ఎలా వచ్చింది అన్న విషయం ఇక్కడ అడగకూడదు. ఎందుకంటే ప్రేమికులిద్దరూ మైసూర్ ట్రిప్ వేయడానికి అక్కడొక ఇల్లును సృష్టించినట్లు కనిపిస్తుంది). మైసూర్ ట్రిప్‌లోనే ప్రేమికులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కాంచనమాల బాబాయి రాజు (సిజ్జు)కు విషయం చెప్పడంతో పెళ్లి ముచ్చట్లు జరిగే సమయానికి కమలాకర్ చేసిన ఓ తప్పువల్ల కథ కంచికి వెళుతుంది. ప్రేమికులిద్దరూ విడిపోతారు. కపిల్‌దేవ్‌లో తన అన్న మృతికి కారణమైన కమలాకర్ కనబడడంతో రాజు ఈ సంబంధానికి ససేమిరా అంటాడు. కమలాకర్ గుర్తురాకుండా, తాను మాత్రమే కనిపించేలా రాజును మెప్పించడానికి కపిల్ ఏంచేసి మెప్పించాడు, కాంచనమాలను ఎలా చేపట్టాడు అనేదే మిగతా కథ.
సినిమా ప్రథమార్థం అంతా పాత చిత్రాల పోకడలతో, ప్రేమ సన్నివేశాల పరంపరతో అసహనంగానే సాగుతుంది. ముఖ్యంగా విలన్‌గా పరిచయం చేసిన అవినాష్ (ప్రదీప్)పై చిత్రీకరించిన సన్నివేశాలన్నీ కృతకంగానే కన్పిస్తాయి. అంత పెద్ద మిలియనీర్ ఓ చిన్న యాక్సిడెంట్ విషయంలో సరెండర్ అయిపోయి తన 100 కోట్ల డీల్‌ను వదులుకోవడానికి ఇష్టంలేక అసహనం వ్యక్తం చేయడం, తన ప్రియురాలు బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంటే కారుతో యాక్సిడెంట్ చేయడం, అక్కడ కూడా కథానాయకుడికి సరెండర్ అయిపోవడం లాంటి సన్నివేశాలు మరింత ట్రిమ్ చేయాల్సింది. హీరో హీరోయిన్ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలలో కూడా ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో తేలిపోతాయి. వెనె్నల కిషోర్, సత్యలపై చేసిన కామెడీ సోసోగా సాగింది. ఫ్లాట్లు అమ్మడానికి కథానాయకుడు పడే పాట్లు ఎందుకో అర్థంకాదు. తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఫ్లాట్ల వెంబడి పడితేనే రాజు అతన్ని గౌరవిస్తాడా? ఇంక అంతకన్నా సన్నివేశాలను చక్కగా రాసుకోవడం కుదరదా? తనకు రజనీకాంత్ మోడల్ అనే భావంతో చిన్నప్పటినుంచి పెరిగిన కపిల్, పెద్దయ్యాక ఆ ఛాయలే చూపడు. దానికన్నా హీరోయిన్ ట్రెడిషనల్ పద్ధతులకు, నువ్వుండగా గూగుల్ ఎందుకెహె అని చెప్పేంత సాఫ్ట్‌వేర్ పద్ధతులకు సైమల్‌టేనియస్‌గా కథ రాసుకుంటే సరికొత్త కథగా ప్రేక్షకులకు నచ్చేదేమో. అలా కాకుండా కాంక్రీట్ బేస్ వేసి పూరిగుడిసె కట్టినట్లుగా సినిమా తేలిపోవడం బాధాకరం. ఆదిసాయికుమార్ తనకు కొట్టినపిండిలాంటి పాత్రలో మరోసారి ఒదిగిపోయాడు. కొత్తగా చేసింది ఏమీ లేదు. శ్రద్ధా శ్రీనాధ్ కూడా కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిపోయింది. నటించే స్కోప్ తక్కువ. ఉన్నంతలో సిజ్జు, గొల్లపూడి మారుతిరావులకే మార్కులు పడతాయి. సాంకేతికంగా ఇది నిజమేనా అంటారా, సఖియా సఖియా, కలయా నిజమా అన్న పాటలకన్నా చెలియా మాటే చందనం పాట ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కొబ్బరాకుల రాకెట్లు అబ్బురపరుస్తాయి. కెమెరా పనితనం ఆకట్టుకునేలా సాగింది. దర్శకత్వ పరంగా విశ్వనాధ్ మరికొన్ని కొత్త కథలను ఔపోసనపట్టి అరిగించుకోవాల్సిందే!

-ఎస్.ఎస్.