రివ్యూ

నాని వన్‌‘మేన్’ షో! ( జెంటిల్‌మన్) ... ఫర్వాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
నాని, సురభి, నివేదితా థామస్, తనికెళ్ల భరణి, వెనె్నల కిషోర్, ఆనంద్, రోహిణి సంగీతం: మణి శర్మ
ఎడిటింగ్: మార్తండ్ కె వెంకటేష్
కెమెరా: పిజి విందా
నిర్మాతలు: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం:
ఇంద్రగంటి మోహన కృష్ణ

అష్టాచమ్మా తరువాత నాని, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మరో చిత్రం -జెంటిల్ మన్. నటనతో, కథా ఎంపికతో ఎప్పటికప్పుడు అభిమానులకు కొత్తదనం చూపించే నాని హీరోగా, సురభి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. హీరోనా? విలనా? అంటూ ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. నాని ఇమేజ్‌కు తగిన అంచనాలమధ్య రూపుదిద్దుకున్న చిత్రంలో హీరోగా ఆకట్టుకున్నాడో.. విలన్‌గా మెప్పించాడో చూద్దాం..
కథ:
ఫారిన్ ట్రిప్ నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న ఇద్దరు అమ్మాయిల చిట్‌చాట్‌తో సినిమా మొదలవుతుంది. ఐశ్వర్య (సురభి), క్యాథరిన్ (నివేదా థామస్)లు ఫ్లైట్‌లో పక్కపక్కనే కూర్చుని స్నేహితులవుతారు. టైమ్‌పాస్ కోసం తమ తమ లవ్ స్టోరీలను ఒకరికొకరు చెప్పుకోవాలనుకోవడంతో సినిమా కథ మొదలవుతుంది. ఇలా ఇద్దరి ప్రేమకథలు ఒకదాని తరువాత ఒకటి పూర్తవగానే ఫ్లైట్ దిగి హైదరాబాద్‌కు వచ్చిన క్యాథరిన్‌కు తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ (నాని) చనిపోయాడని తెలుస్తుంది. కానీ ఓ జర్నలిస్ట్ వచ్చి గౌతమ్ చనిపోలేదు చంపబడ్డాడని చెప్పడంతో అనుమానం వచ్చిన క్యాథరిన్ అచ్చు గౌతమ్‌లానే ఉన్న ఐశ్వర్యకు కాబోయే భర్త జై (నాని)పై నిఘా పెట్టి నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. జై కూడా క్యాథరిన్‌కు దొరక్కుండా తప్పించుకోవాలని చూస్తుంటాడు. ఆ టైమ్‌లోనే క్యాథరిన్‌కు దొరకబోయే ఒక్కొక్క సాక్ష్యం మాయమవుతూ ఉంటుంది. దీంతో క్యాథరిన్ గౌతమ్‌ను చంపింది జై అని నిర్థారించుకుని అతని అసలు రూపాన్ని ఐశ్వర్యకు చూపాలని అనుకుంటుండగా ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం ఏమిటి? మంచివాడిగా ఉన్న జై చెడ్డవాడిగా ఎందుకు కనిపిస్తాడు? అసలు గౌతమ్ మాయమవడానికి కారణమేమిటి? అనేదే ఈ సినిమా కథ.
సినిమా మొత్తం నాని వన్‌మ్యాన్ షో చేశాడని చెప్పాలి. ఇక కొద్దిసేపైనా గౌతంగా నాని సింప్లీ సూపర్బ్‌గా, జైగా హుందాగా నటించినా.. ఆడియన్స్ మాత్రం గౌతం క్యారక్టర్‌కు కనెక్టఅవుతారు. రెండు పాత్రల్లో మంచి వేరియేషన్స్ చూపించి నాచురల్ స్టార్‌గా మరో మెట్టు పైకెక్కాడు నాని. హీరోయిన్లు నివేదా థామస్, సురభిలు కేవలం గ్లామర్ కోసం అన్నట్టుకాకుండా కథలో పాత్రలమేరకు నటించారు. ముఖ్యంగా కేథరిన్‌గా నటించిన నివేదా, నాని తర్వాత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సురభి క్యూట్ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అవసరాల శ్రీనివాస్ నెగిటివ్ రోల్‌తో మెప్పించాడు. పైకి మంచిగా కనపడుతూనే కనిపించని విలనిజాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. మిగతా స్టార్‌కాస్ట్ వెనె్నల కిశోర్, తనికెళ్ల భరణి, ఆనంద్, రోహిణిలు పాత్రల పరిధిమేరకు నటించారు. సెకండ్ హాఫ్ మొదట్లో వచ్చే వెనె్నల కిషోర్ కామెడీ ఎపిసోడ్స్ నవ్వించాయి.
నిజానికి డేవిడ్ నాథన్ అందించిన కథ, దాన్ని దర్శకుడు నడిపిన విధానం... ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏయే అంశాలు కావాలో అన్నింటినీ దర్శకుడు తన కథనంలో పొందుపరిచి ఊహించని మలుపులతో మంచి కిక్కే ఇచ్చాడు. అలాగే సినిమాలోని నాని రెండు పాత్రలను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రేక్షకుడికి చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్‌హాఫ్ ముగిసే సమయంలో జై పాత్రలోని నెగెటివ్ షేడ్‌ను రివీల్ చేస్తూ ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సెకండ్ హాఫ్‌లో ఏం జరగబోతోందోఅన్న ఆసక్తిని పెంచుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువ ఫాలోఅయ్యే ప్రేక్షకుడికి కొన్ని సినిమాల్లోని ట్విస్ట్ ముందే ఊహకు అందేస్తుంటుంది. కానీ ఈ సినిమా విషయంలో దర్శకుడు ప్రేక్షకుడికి ఆ చాన్స్ ఇవ్వలేదు. పైగా సినిమా పూర్తయ్యే సమయానికి అసలు కథ ఏ సంఘటనతో మొదలైందో చెబుతూ దర్శకుడు ట్విస్ట్‌ను రివీల్ చేసిన విధానం బాగుంది. కథనాన్ని రాసుకోవడంలో రచయితగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి సక్సెస్ అయ్యారు. అలాగే మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఎంతలా ఉపయోగపడాలో అంతగా ఉపయోగపడింది. మార్తాండ్ కె.వెంకటేష్ తన ఎడిటింగ్ నైపుణ్యం, పిజి వింద సినిమాటోగ్రఫీ బావుంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ రూపంలో ఓ మంచి చిత్రాన్ని అందించడానికి మోహన్‌కృష్ణ ఇంద్రగంటి చేసిన ప్రయత్నమే ‘జెంటిల్ మన్’. ఒక మామూలు మనిషి ఏ సందర్భంలో జెంటిల్‌మన్‌గా మారతాడు అనే విషయాన్ని సినిమా ద్వారా చెప్పడం మంచి ప్రయత్నం. సినిమా ఇంటర్వెల్ సస్పెన్స్, క్లైమాక్స్‌లో రివీల్ అయిన ట్విస్ట్ సినిమాకే హైలెట్. అక్కడక్కడా కథనాన్ని సాగదీయడం, కొన్ని బలవంతపు సన్నివేశాలు కొంచెం బోర్ కొట్టిస్తాయి. దర్శకుడు ఎంచుకున్న కథ బాగానే ఉన్నప్పటికీ, దాన్ని ప్రేక్షకుడికి చెప్పడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. సినిమా నిడివి పెంచాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు మొదట్లో ప్రేమజంటల మధ్య పెట్టిన అనవసరమైన కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టినట్టు అనిపించాయి. అలాగే సినిమా ముగింపులో అసలు నిజం ఎవరికి తెలియాలో వాళ్ళకి ఆ నిజం ఓ చిన్న సాదాసీదా సన్నివేశంతో తెలిసిపోవడం అప్పటివరకూ సినిమాపై కలిగిన పాజిటివ్ ఇంప్రెషన్‌ను తగ్గించింది.

-త్రివేది