రివ్యూ

ఆత్మలేని ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవిరి * బాగోలేదు
*
తారాగణం: రవిబాబు, నేహాచౌహాన్, బేబీ శ్రీముక్త, ముక్తార్ ఖాన్, ప్రయ వడ్లమాని
సంగీతం: వైదీ
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ: ఎన్ సుధాకర్ రెడ్డి
బ్యానర్: ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్
కథనం: సత్యానంద్
నిర్మాత, దర్శకత్వం: రవిబాబు
*
కొన్ని ఊహలు -ఊహలకే బావుంటాయి. చెయ్యి తిరిగిన రైటరెవరైనా చేయ చేసుకుంటే -అచ్చేసిన ఆలోచనలూ చదవడానికి బావుంటాయి. అక్కడితో ఆగకుండా.. ఆ ఊహల్ని సినిమా చేస్తేనే సారం జావగారుతుంది. అలాంటిదే -ఆవిరి. టెరిబుల్ క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు ఆలోచనల్లోని సారం ఆవిరైందని చెప్పడానికొచ్చిన ఫ్యామిలీ థ్రిల్లర్.
**
ఎవరు కాదన్నా.. రొటీన్ సినిమాకు రవిబాబు భిన్నం. కారణం -యాడ్ మేకింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చాడు కనుక. -స్క్రీన్ ప్రాపర్టీస్, స్క్రీన్ ప్లే థాట్స్ నోవెల్ డిజైన్స్‌తో ఉంటాయి. ఆ నమ్మకం ఆడియన్స్‌లో ఉన్నంతవరకూ అతన్నుంచి అలాంటి సినిమాలే వచ్చాయి. అదే నిజమని తనూ నమ్మడం మొదలైనప్పటి నుంచే.. -అవును 2, అదుగో.. ఆవిరిలాంటి చిత్రాలొస్తున్నాయి. అల్లరి, అనసూయ, అవునులాంటి సెనే్సషన్స్ తననుంచిక ఆశించొద్దని నిజాయితీగా చెప్పడానికే -‘ఆవిరి’ తీసినట్టుంది.
‘అవును’.. సోల్ థ్రిల్లర్‌ని ఇలానూ చూపించొచ్చు అనిపించాడు రవిబాబు. ఒకప్పుడు శిథిల భవంతుల్లో తిరుగాడే ఆత్మల్ని -‘అత్యాధునిక లైటింగ్ హౌస్’లోకి లాక్కొచ్చాడు కూడా. ‘కొత్త’గా నచ్చేసింది ఆడియన్స్‌కి. మరోసారి టచ్ చేస్తున్న ‘స్పిరిట్’ని.. అంతే కొత్తగా చూపించలేకపోవడంతో ఉన్నదంతా ‘ఆవిరై’పోయింది.
**
రవిబాబు, నేహాచౌహాన్ డబ్బున్న మోడ్రన్ పెయిర్. వాళ్లకిద్దరు ఆడపిల్లలు. స్విమ్మింగ్ ఫూల్‌లో యాక్సిడెంటల్‌గా ఒకమ్మాయి చనిపోతుంది. ఆమె జ్ఞాపకాలు వెంటాడటంతో -నేహాచౌహాన్ బలవంతంమీద పాత బంగ్లాలోకి షిఫ్టవుతుంది ఫ్యామిలీ. అక్కడ -అనుమానాస్పద సంఘటనలు చోటుచేసుకుంటాయి. వాటన్నింటికీ కారణం అక్కేనని రెండో కూతురు చెబుతున్నా -పేరెంట్స్ పట్టించుకోరు. ఆ ఆత్మ ఎవరిది? ఎందుకు కనిపిస్తుంది? ఏం ఆశిస్తోంది? అన్నది మిగతా హారర్ డ్రామా? ఈ రొటీన్ సెటప్‌లో రవిబాబు ఇంటెలెక్యువాలిటీ ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం లేని సినిమా చూసేసి థియేటర్‌నుంచి బయటకు రావాలి.
**
ఆవిరిలో స్పెషల్ అట్రాక్షన్ నేహాచౌహాన్‌దే. మేకప్‌లెస్ డెవిల్ ఇలాగే ఉంటుందని నమ్మించేందుకు నోరు బార్లా చాపింది. ఆటవికంగా వెర్రికేకలేసింది. వెకిలి బాడీలాంగ్వేజ్ చూపిస్తూ.. ఆడియన్స్‌ని నమ్మించేందుకు నానా తిప్పలు పడింది. భయం-చీకటి అన్న రొటీన్ ఈక్వెషన్‌ని ‘ఆవిరి’కి వదిలేసి.. పట్టపగలు మిట్టమధ్యాహ్నం డెవిల్ సీన్ సెట్‌చేసిన దర్శకుడి సాహసాన్ని తన భుజాలపై మోసే ప్రయత్నం చేసింది. మరో జోక్ ఏంటంటే -ఏ ఫర్ అక్క అన్నది తప్ప మరేం తెలీని పాపగా శ్రీముక్తను చూపిస్తూ.. ఇంట్లోంటి పారిపోడానికి పాట్లుపడుతోన్న ముదరగా చూపించటం. పాప పాత్ర వయసుకి, ఆహార్యానికి పొంతన లేక -నీరసాన్ని నరాల అంచుల్లో బలంగా బిగించి బలవంతంగా సన్నివేశాల్ని చూస్తూ ఆడియన్స్ స్వ’జాలి చూపించుకోక తప్పలేదు. డ్రైవర్‌లేని బైక్‌పై పాప పీలియన్ రైడింగ్ చూసీ -తల్లికి అనుమానం రాదు. పింగాణి పాత్రలు బుల్లెట్లలా తనపైకి దూసుకొచ్చినా -కూతురివైపు చూడాలన్న స్పృహ తండ్రికి కలగదు. ఇంటి కాంపౌండ్‌లోకొచ్చిన స్విగ్గీ డెలివరీ బోయ్ చేతుల్లోంచి పిజ్జా గాల్లోకి ఎగిరినా -్ఫట్లు చేస్తాడు తప్ప భయపడడు. డెవిల్స్ సైతం భయపడే గెటప్‌లో వచ్చిన బేబీ సిట్టర్ (హిమజ మల్లిడి..) -పది నిమిషాల్లోనే పలాయనం చిత్తగించినా.. సెక్యూర్డ్ హౌస్ సీసీ టీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించాలన్న ఆలోచన పేరెంట్స్‌కి రాదు. ‘గంతల బొంత’లా సన్నివేశాలన్నీ చిరాకు పెడుతున్నా -ఆశచావక ఆవగింజంత హారర్ కోసం బిక్కుబిక్కుమంటూ కూర్చోక ఆడియన్స్‌కి తప్పదు.
**
సూటేసుకున్న తాంత్రికుడి ఇంట్రో నుంచే -ఆవిరికి జస్ట్ఫికేషన్ మొదలైంది. నిప్పంటే ఆత్మలకు భయం కనుక చుట్టకాల్చేవాడి దగ్గరకు అవి రావన్న పైశాచిక నిజం ఆ సీన్‌లోనే తెలుస్తుంది. గాల్లో కలిసే ఆవిరికి బలముండదని, బంధిస్తే బాంబుకంటే బలమైందన్న ‘స్టీమ్ ఇంజన్ మెకానిజాన్ని’ ఇక్కడే కనుక్కుంటాం. ఆవిరిలా గాల్లో కలిసిపోయిన ఆత్మలు -మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే మహా శక్తివంతమవుతాయన్న కట్టు కథలనుంచి అసలు కథ మొదలైనపుడు -చచ్చిన పిల్లే దెయ్యమై ఉంటుందని అనుకుంటాం. దమ్ము లేకపోయినా దారి తప్పించే సన్నివేశాలను చూపిస్తూ కథను క్లైమాక్స్‌కు తెచ్చినపుడు -దర్శకుడికి ట్విస్ట్‌కి నిజంగానే భయపడతాం. చివర్లో సిల్లీ లస్ట్ స్టోరీ ఓపెన్ చేసి.. ఆడియన్స్ ఎనర్జీ ఆవిరయ్యే వరకూ సినిమా నడిపించి.. సినిమా అయపోయాక వెనక్కి తిరిగి చూసిన రవిబాబు ‘ఇంకోసారి నాతో పెట్టుకోవద్దు’ అన్నట్టే కనిపిస్తాడు ఆడియన్స్‌కి.
పాత్రల పెర్ఫార్మెన్స్ చూస్తే-
డెవిల్స్ మూమెంట్స్‌ని పేరడీ చేసినట్టుంది -రవిబాబు పెర్ఫార్మెన్స్. వేషమిచ్చారు కనుక.. మేకప్ లేకున్నా డెవిల్‌ని గుర్తు చేయడానికి ప్రయత్నించింది నేహాచౌహాన్. ఆత్మలే బెదిరిపోయే రేంజ్‌లో ఆటవికంగా అరుస్తూ.. నోరు బార్లా తెరిచి నడిచిన విధానం -చాలా ప్రాక్టీస్ చేస్తే తప్ప సాధ్యం కాదేమో. ఆల్ఫాబెట్స్ నేర్చుకునే పనె్నండేళ్ల పాపగా బేబీ శ్రీముక్తా కనెక్టవ్వదు. సాంకేతికంగా -జిగేల్‌మనే వెలుగుల మధ్య హారర్ ఎఫెక్ట్ తేవడానికి సినిమాటోగ్రఫీ నానా తిప్పలు పడింది. సౌండ్ ఎఫెక్ట్స్‌తో దడపుట్టించే ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఎన్నో చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన అనుభవముండీ -సత్యానంద్ హెచ్ ప్యాక్టర్‌ని ఇలా పేర్చాడా? అనిపిస్తుంది. ‘అవును 2’నుంచి ‘అదుగో’ అనేంత దూరమైపోయిన రవిబాబు క్రియేటివిటీ.. ఈ సినిమాతో -ఆవిరైందనే అనిపించింది.
ముక్తాయంపు:
‘హారర్’ థ్రిల్ కావాలనుకుంటే -బుర్రనిండా దెయ్యం ఆలోచనలు నింపుకుని... చిమ్మచీకట్లో... నిర్మానుష్యమైన రోడ్డుమీద.. ఒంటరిగా నడిచివెళ్తే.. అదే చాలు.

-మహాదేవ