రివ్యూ

భారమైన భావు‘కత’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు-- ఒక మనసు

తారాగణం:
నాగశౌర్య, నిహారిక, రావు రమేష్, ప్రగతి, శ్రీనివాస్ అవసరాల, హేమంత్, నాగినీడు, వెనె్నల కిషోర్, కృష్ణ్భగవాన్ సంగీతం: సునీల్ కాశ్యప్
ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి
నిర్మాత: మధుర శ్రీ్ధర్‌రెడ్డి
రచన, దర్శకత్వం: రామరాజు

భావుకత్వం సెల్యులాయిడ్‌కి అంతగా పనికొచ్చే సబ్జెక్ట్ కాదు. ఏ కథనైనా స్ట్రెయిట్‌గా చూసేందుకు ఇష్టపడే ప్రేక్షకుడు అన్ని వేళలా ‘్భవుకత’తో మమేకం కాలేడు. భావోద్వేగాల సంఘర్షణల దోబూచులాటనీ నీలినీడల్నీ తెర కెక్కించటానికి.. బలమైన కథ తోడవ్వాలి. ఎంతసేపూ- కథానాయక నాయికలే కనిపిస్తే.. బోర్ కొట్టేస్తుంది. వాళ్లిద్దరి మధ్య ‘సంధి’ కుదర్చటానికో.. వాళ్ల కబుర్లు వినటానికో ఎవరో ఒకరువచ్చి వెళ్తుండాలి. దానికి భావుకత జోడిస్తే కథ మరింత రక్తికడుతుంది. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ కథని చక్కగా నడిపించటానికీ వాళ్లవాళ్ల మనోభావాలకూ వేదికగా అప్పుడప్పుడు వచ్చి వెళ్లే పాత్రలు కనిపిస్తాయి. ఒకసారి ‘మల్లెల తీరం..’ తీసింత్తర్వాత మళ్లీ అటువంటి భావుకత జోలికి వెళ్లాల్సి వస్తే.. ప్రేక్షకుణ్ని ‘తీరం’ వైపు నడిపించాలంటే.. బోలెడన్ని అంశాల్ని అస్త్రాలుగా ప్రయోగించాలి. మనకి మనమే ఇది మరో ‘గీతాంజలి’ ‘మరో చరిత్ర’ అనేసుకొంటే.. పబ్లిసిటీ రీత్యా ప్రయోజనం కలిగినా.. ప్రేక్షకుణ్ణి థియేటర్ వైపు నడిపించవు.
అర్థంపర్థంలేని సన్నివేశాలన్నీ ఒక్కసారి మనల్ని ముప్పిరిగొంటాయి. కథాపరంగా ఆలోచిస్తే.. హీరో హీరోయిన్లు ఏ సముద్ర తీరానో కలుసుకోవటం.. లేదా మోడువారిన చెట్టు కింద కబుర్లు చెప్పుకోవటం.. పొద్దునే్న కలవటం.. మాట్లాడుకోవటం.. మళ్లీ కలుసుకోవటం మాట్లాడుకోవటం..
అంతే! ఏం మాట్లాడుకొంటారంటే- విషయమేమీ ఉండదు. అంతా భావుకత్వమే. రోజూ పొద్దుట్నుంచీ సాయంత్రం వరకూ ఊసులాడుకొంటూనే- ఈ రోజు నా కలలోకి వస్తావా? అంటుంది అమ్మాయి- అబ్బాయితో. అన్ని గంటలు మాట్లాడుకొన్న తర్వాత.. కలలోక్కూడా రావాలా? అని ప్రేక్షకుడు జుట్టు పీక్కుంటాడు. ఇంతలో ‘నువ్వు రాజకీయ నాయకుడివై పోయావ్’ అంటుంది అమ్మాయి. అబ్బబ్బ.. ఇలాంటి సన్నివేశాల్తోనే సినిమా అంతా నడిచేస్తుంది.
కథ -సూర్య (నాగశౌర్య) రాజకీయాల్లో పాఠాలు నేర్చుకొని ఎమ్మెల్యే కావాలన్నదే లక్ష్యం. రాజకీయంగా ఎదగాలంటే సెటిల్‌మెంట్లు తప్పనిసరి అని ఎవరు బోధించారో తెలీదుగానీ.. సెటిల్‌మెంట్లు చేసేస్తూ ఎదిగిపోతూంటాడు. ఇంతలో-ఆ ఊళ్లోని డాక్టర్ సంధ్య (నిహారిక)తో పరిచయం ఏర్పడి ప్రేమ మొలకెత్తుతుంది. మరోవైపు ఓ సెటిల్‌మెంట్‌లో సూర్య ఇరుక్కొంటాడు. మూడేళ్లు జైలుశిక్ష పడుతుంది. రాజకీయంగా ఎదగడానికి సంధ్య అవరోధమని తలచిన సూర్య ఆమెకి దూరం వెళ్లాలనుకొంటాడు. జైలునుంచి వచ్చేంతవరకు తన కోసం కాచుక్కూర్చుంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తుంది సంధ్య. తర్వాత ఏమైందన్నది క్లైమాక్స్. ఈ కథలో చెప్పుకోదగ్గ సంగతులేం లేవు. అసలు రాజకీయానికీ.. భావుకత్వానికీ.. ప్రేమకీ -పొసగదన్న విషయం దర్శకుడు ఎందుకు విస్మరించాడో తెలీదు. రాజకీయ నాయకుడిగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్న సూర్య.. తండ్రి ఆశయాల మేరకే నడుచుకొంటున్నప్పుడు.. సంధ్య పట్ల ప్రేమని కనబరచడం, పీకల్లోతు మునిగిపోయినట్లు ఆర్భాటం.. ఇవన్నీ చూస్తే ఆఖరికి ఎలాగూ సంధ్యని వదిలించుకోవాలని చూస్తున్నాడన్న అంశం తేలిపోతూనే ఉంటుంది. ఆ మాటకొస్తే -హీరో హీరోయిన్లు మాట్లాడుకోవటం ఒక్కటే ఈ సినిమాలో కనిపిస్తుంది. అదీ సక్రమంగా జరిగిందా అంటే అదీ లేదు. దర్శకుడు ఈ సినిమాపై బోలెడంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్టున్నాడు. కానీ- కథకి మొదలు చివరా ఉంటాయన్న సంగతి వదిలేసి.. వీళ్లిద్దరూ మాట్లాడుకొంటూనే ఉంటారు చూడండి. అంటే -చూడక ఛస్తామా? ఐతే- ఒక్కో సందర్భంలో కథని మాటల రూపేణా కూడా నడిపించొచ్చు. దానితో ప్రేక్షకుడు ‘కనెక్ట్’ అయితే ఒనగూడే ప్రయోజనం వేరు. ఇక్కడ అటువంటి అద్భుతాలేవీ జరగలేదు.
అంతా కృత్రిమత్వం చోటు చేసుకుంది. హీరో హీరోయిన్లు బిగదీసుకొని స్క్రీన్‌పై అటు ఇటు ఏమాత్రం తొణక్కుండా నడిచేస్తూంటారు. సముద్ర తీరం.. ఇసుక తినె్నలు.. బీటలు వారిన గోడలే భావుకత్వం అన్నట్టు తెగ మురిసిపోతూంటారు. చిత్రాన్ని దృశ్యకావ్యంగా చెప్పటానికి ప్రయత్నించిన దర్శకుడు.. దాని తాలూకు ఫ్లేవర్‌ని అందించటానికి అన్ని సన్నివేశాల్లోనూ ఏదో ‘మిస్’ అవుతూనే ఉన్నాడు. ఇంతాచేస్తే-‘ఒక మనసు’తో ఏం చెప్పాడు అంటే ప్రశ్నార్థకమే. పాతకాలం హీరోయిన్‌మల్లే వొద్దికగా ఉన్న నిహారిక తన వంతుగా చీరల్తో.. చక్కటి నవ్వుతో మురిపించినప్పటికీ.. ఆ పాత్రతో ‘కనెక్ట్’ అయ్యేట్టు చేయలేకపోయింది. అన్నీ తెచ్చిపెట్టుకొన్న భావావేశాల్లా అనిపిస్తాయి. మానసిక సంఘర్షణ తాలూకు నీలినీడలు సైతం మొహాల్లో నిస్తేజంగా నిర్వీర్యంగా కనిపిస్తూంటాయి. నిన్నటి తరం అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తూ.. టార్చర్ పెట్టింది. భావుకత మాటున ఇంతటి భయానకత ఉంటుందా? అనిపించి ఒక్కోసారి మనల్ని మనమే తిట్టేసుకోవాలనిపిస్తుంది. నాగశౌర్య ఉన్నంతలో ఫర్వాలేదనిపిస్తాడు. రావురమేష్ పాత్ర పరిధి మేరకు నటించాడు. కృష్ణ్భగవాన్, వెనె్నల కిశోర్, రేడియో హేమంత్, రాజా రవీంద్ర తదితరులు ఉన్నామంటే ఉన్నామనిపించారు. ఇంతటి భావుకత చిత్రానికి చక్కటి సంగీతం తోడయితే ఏవిధంగా ఉండేదోగానీ.. రొటీన్ సరిగమలతో నెట్టుకొచ్చారు.

-బిఎనే్క