రివ్యూ

మనసు దోచే దొంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** దొంగ
**
తారాగణం: కార్తి, జ్యోతిక, సత్యరాజ్, అమ్ము, అభిరామి, నిఖిలా విమల్, అన్‌సోస్‌పౌల్, లవరస్, షావుకారు జానకి, సీత, బాల, సెమ్మెలార్ అన్నన్
నిర్మాణం: వయాకామ్18
సంగీతం: గోవింద్ మీనన్
కెమెరా: ఆర్‌డి రాజశేఖర్
దర్శకత్వం: జీతూ జోసెఫ్
**
ఎన్నో ఏళ్ల క్రితం ఇల్లొదిలి వెళ్లిపోయిన తమ్ముడు, అతనికోసం ఎదురుచూసే ఓ అక్క, తండ్రి, తల్లి. చివరికి అతను దొంగగా మారాడాని తెలిశాక ఆ కుటుంబంలో వ్యక్తుల ఆలోచన ఎలా వుంటుంది? అన్న కథనాన్ని తీసుకొని దృశ్యం చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ తాజాగా రూపొందించిన చిత్రం -దొంగ. తమిళంలో ‘తంబి’ (తమ్ముడు)గా విడుదలైన చిత్రం తెలుగులో దొంగగా అనువాదమైంది. గత చిత్రాల్లో తప్పిపోయిన తమ్ముడు తిరిగొస్తే, అతన్ని అనేక గుర్తులతో గుర్తుపడతారు. మొదట దొంగే ఇలా వచ్చాడని పరిచయం చేస్తారు. తరువాత కథనమంతా దొంగ కాదు, ఇతడే నిజమైన తమ్ముడని చెప్పే కథనాలతోవున్న సినిమాలు చాలా చూశాం. కానీ ఇక్కడ నిజమైన తమ్ముడు కాదు. ఆ విషయం హీరోకి తెలుసు. తమ్ముడిగా నటించాల్సిన వ్యక్తి ఇంటికొచ్చి ఎవరెవరిని ఎలా నమ్మించాడనే కథ, పైన కనిపించే షుగర్‌కోటెడ్ మాత్రమే.
విషయంలోకెళ్తే.. టీ తోటల ఎస్టేట్‌లున్న ఓ ప్రాంతానికి ఎమ్మెల్యే జ్ఞానమూర్తి (సత్యరాజ్). అతడి కూతురు పార్వతి (జ్యోతిక). జ్ఞానమూర్తి కుమారుడు సెల్వ చిన్న వయసులోనే డ్రగ్స్‌కు అలవాటుపడి అదేలోకంగా బతుకుతుంటాడు. ఒకరోజున ఎవరికీ కనపడకుండా మాయమవుతాడు. అలా పదిహేనేళ్లు గడిచిపోతాయి. సెల్వ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? అనేది తెలీదు. కానీ కొడుకు కోసం అనేకచోట్ల వెతుకుతూనే వుంటాడు జ్ఞానమూర్తి, రాజకీయ వారసుడిగా నిలబెట్టడానికి. తన ఆస్థినంతా కట్టబెట్టడానికి కొడుకుకోసం ఎదురు చూస్తుంటాడు. తమ్ముడు లేడన్న దిగులుతో పార్వతి వివాహమే చేసుకోదు. అతను వచ్చాకే వివాహమంటుంది.
ఈ నేపథ్యంలో గోవాలో అన్ని చోరకళల్లో ఆరితేరిన విక్కీ (కార్తి)నే జ్ఞానమూర్తి కొడుడని పోలీసులు నిర్థారిస్తారు. అయితే దొంగతనాలు చేస్తూ బ్రతికిన విక్కీపై ఓ కనే్నసి ఉంచమని కూడా తండ్రికి చెబుతారు. తన ఇంటికి వచ్చిన విక్కీ ఉరఫ్ సెల్వ తల్లిని, అక్కను, నానమ్మను, మామయ్యను తన చిన్ననాటి ప్రియురాలు సంజనను, తన స్నేహితులు మన్‌మోహన్, ఇన్స్‌పెక్టర్‌కు తానే నిజమైన సెల్వ అని ఎలా నమ్మించాడు అన్న కథనం ఒకటైతే, మరొకటి- నిజమైన సెల్వ ఏమయ్యాడు? అనేది మరో కథనం. ఈ రెండూ కథనాల నేపథ్యంలో దర్శకుడు కావలసినంత లేయర్స్ సృష్టించుకుంటూ వెళ్లాడు. ప్రతి సన్నివేశాన్నీ వైవిధ్యంగా తీర్చిదిద్ది ప్రేక్షకుణ్ణి కుర్చీలోనుంచి కదలకుండా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఒకవైపు సెల్వాగా నమ్మించడం, మరోవైపు నిజమైన సెల్వ ఏమయ్యాడు? అన్న పరిశోధన సమాంతరంగా సాగుతాయి. ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్ కొంచెం స్లోగా సాగినా సెకెండాఫ్‌లో ఎవరెవరు ఎలాంటి పాత్రలు అన్న విషయం తెలిశాక మాత్రం స్క్రీన్‌ప్లే పరుగెడుతుంది. ఒకదానికొకటి లేయర్స్‌ని విడగొట్టుకుంటూ ఒకర్ని మించినవారొకరు అన్న ఆలోచన వచ్చేలా ప్రేక్షకుడిణ్ణి నమ్మించడంలో దర్శకుడు విజయం సాధించాడు. నేనే నటుణ్ణి అనుకుంటే మీరందరూ నటులేనా? అని సెల్వ అన్న ఒక్కమాటే సినిమా మొత్తానికి అన్వయిస్తుంది. ఒక కారెక్టర్‌ను తీసుకుంటే ఆ కారెక్టర్‌లోనే ఉండాలి అని హీరో చెప్పినట్టుగా సినిమాలో ఎక్కడా జరగదు. కారెక్టర్లు ఎప్పటికప్పుడు వాటి నైజాన్ని మార్చుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కడా ప్రేక్షకుడికి ఎటువంటి ప్రశ్నలు రాకుండా సన్నివేశాలను తీర్చిదిద్దడం కత్తిమీద సాములాంటిదే. చివరలో మన్‌మోహన్‌పై పడిన ఇన్స్‌పెక్టర్ హత్యానేరం, మామయ్య చేసిన హత్యాప్రయత్నాలు గాలికొదిలేశారు. సినిమా చూస్తుంటే దృశ్యం చిత్రంలో ఉన్నట్టుగా జరిగిన హత్యను ప్రపంచానికి తెలియకుండా ఎలా మాయం చేయాలి అనేది ఈ చిత్రంలో కూడా రిపీట్ అయింది. ముగింపు రైల్వే స్టేషన్ సన్నివేశంలో అత్తారింటికి దారేదిలో మాదిరిగా పదిమంది నటీనటులతో కాక, ఇద్దరే నటీనటులతో ఎమోషన్ పండించారు. మరొక కోణంలో రామ్ నటించిన మస్కా చిత్రానికి సంబంధించిన ఫ్లేవర్ కూడా కన్పిస్తుంది.
విక్కీ ఉరఫ్ సెల్వగా కార్తి టైలర్‌మేడ్ పాత్రలా రఫ్‌గా, క్లాస్‌గా నటించేశాడు. జ్యోతిక కూడా సినిమా కథనం ప్రకారం ప్రత్యేకమైన పాత్ర కనుక బాగానే నటించింది. వీళ్లిద్దరికన్నా అద్భుతంగా నటించిన సత్యరాజ్ లుక్స్ సినిమా పూర్తయ్యాక కూడా ప్రేక్షకుణ్ణి వెంటాడుతాయి. ముఖ్యంగా ఇంటర్‌వెల్ బాంగ్‌లో సత్యరాజ్ చూసిన ఒక్క చూపే ప్రేక్షకుణ్ణి ఊపేస్తుంది. తరువాత ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగటంతో సత్యరాజ్, సీత, జ్యోతిక పాత్రల వ్యక్తిత్వాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ప్రేక్షకుణ్ణి ఒక్క గుద్దు గుద్దినట్టుగా డైలాగులు ఆయా పాత్రల నుండి వెలువడతాయి. అవే ప్రేక్షకుణ్ణి కుర్చీలోంచి లేవకుండా చేశాయి. ఇక హీరోయిన్‌గా నటించిన నిఖిలా విమల్‌కు నిడివి తక్కువే. అన్‌సౌన్‌పౌల్, బామ్మగా నటించిన షావుకారు జానకి, స్నేహితుడు మన్‌మోహన్ తనదైన నటనతో ఆకట్టుకుంటారు. కెమెరాతో ఆర్‌డి రాజశేఖర్ ఆడుకున్నారు. కొత్త కొత్త యాంగిల్స్ చూపాడు. నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం. గోవింద్ మీనన్ ప్రతి లేయర్‌కు అందించిన ఆర్‌ఆర్ ప్రాణం పోసింది. సోకాల్డ్ లైఫ్ అన్న ఒక్క పాట ఆకట్టుకుంటుంది. మాటల రచయిత మాటల ప్రకారం చద్దన్నం చేపల పులుసు కాంబినేషన్‌లా సినిమా సాగుతుంది.

-జిఆర్‌ఆర్