రివ్యూ

సీస్’ఫన్ గమ్మత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది ***మత్తు వదలరా
***
తారాగణం: శ్రీసింహా, సత్య, వెనె్నల కిషోర్, అతుల్యచంద్ర, బ్రహ్మాజీ, అగస్త్య విద్యుల్లేఖ రామన్
సంగీతం: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
బ్యానర్లు: మైత్రి మూవీమేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: చిరంజీవి, హేమలత
దర్శకుడు: రితేశ్ రాణా
***
క్రియేటివ్ థాట్స్‌తో కొత్త జనరేషన్ దూసుకొస్తోంది. ఆ విషయాన్ని ఈ ఏడాదిలో కొన్ని సినిమాలు ప్రూవ్‌చేశాయి. ఆ ట్రెండ్‌ని మరింత ముందుకు తీసుకెళ్లే సినిమా -మత్తువదలరా. క్రియేటివిటీ ఫ్యాషన్‌తో వస్తోన్న కుర్ర బ్యాచ్ -తమ స్టామినాను ఇండస్ట్రీకి, ఆడియన్స్‌కి పరిచయం చేయడానికి చేసిన సీస్’్ఫన్ డెమో ఇది. కథలో ఎఫిషియన్సీ కరవైతే -కథనంలోని ఎఫెక్టివ్‌నెస్‌తో ఆడియన్స్‌ని సీట్‌ఎడ్జ్‌కి తేవొచ్చని నిరూపించారు. విస్మయపర్చే నేపథ్యం.. సహజత్వానికి దగ్గరైన పాత్రలు.. ఆద్యంతం వినోదం -వీటినే సక్సెస్ వెపన్స్ చేసుకుంది దర్శకుడు రితేష్ రాణా టీం.
డీమానిటైజేషన్‌కు ముందు-
‘నొక్కుడి’కి కక్తుర్తిపడిన ఓ డెలివరీ బోయ్ వైఫల్యం -కుటీర మత్తు పరిశ్రమను కూకటివేళ్లతో కదిలించే పర్యవసానానికి ఎలా దారితీసిందన్న క్రైమ్ కహానీని.. కితకితలతో చెప్పడమే ‘మత్తువదలరా’లో సాగిన మహా ప్రయోగం. సో, -ఇదొక ఇన్‌స్టంట్ ఎంటర్‌టైన్‌మెంట్ డ్రగ్ స్టోరీ. కొంతకాలం మైండ్‌లో క్యారీచేసే ‘్ఫల్ గుడ్ ప్రామాణికత’ను మాత్రం ఇందులో వెతుక్కోలేం.
**
సహజంగానే టైటిల్ డ్రగ్స్‌ని రిప్రజెంట్ చేసేది కనుక.. ఆ కంటెంట్ చుట్టూనే సినిమా తిప్పాడు దర్శకుడిగా పరిచయమైన రితేశ్ రాణా. సంగీత దర్శకుడు కీరవాణి పిల్లలు కాలభైరవ (మ్యూజిక్ డైరెక్టర్), శ్రీసింహా (కథానాయకుడు)ను ఇండస్ట్రీకి పరిచయం చేయడం -అవుటాఫ్ ద బాక్స్ సినిమా ప్రత్యేకత.
**
బాబూ మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య), అభి (అగస్త్య) ఫ్రెండ్లీ రూమ్మేట్స్. ఇరుకు రూంలో గుతుకుల బతుకు లాగిస్తుంటారు. బాబు, యేసులది ఓ ఆన్‌లైన్ సంస్థలో డెలివరీ బోయ్స్ పని. అభి మాత్రం ‘షెర్లాక్ హోమ్స్’ సినిమాలు చూస్తూ రూంలో కాలక్షేపం చేసే తెలివైన కుర్రాడు. ఒకరోజు మందు ఖర్చుకురాని నెల జీతం లైఫ్‌పై బాబూమోహన్‌కి ఫ్రస్ట్రేషన్. ఆర్థిక అవాంతరాలను ఎలా అధిగమించాలో ‘నొక్కుడు ట్రిక్’ తెలిసిన యేసు మాత్రం హ్యాపీగా లైఫ్ లాగించేస్తుంటాడు. బుద్ధిని అవసరాలు డామినేట్ చేయటంతో -యేసు బోధమేరకు ‘నొక్కుడు ట్రిక్’ను ఫాలో అవ్వాలనుకుంటాడు బాబు. అనుభవంలేని ప్లాన్‌ను ప్రయోగించే క్రమంలో -ఓ ఫ్లాట్‌కు వెళ్లినపుడు.. అక్కడ బాబు చేతుల్లో ముసల్ది (పావలా శ్యామల) చస్తుంది. మర్డర్ రిస్క్‌నుంచి ఎస్కేపయ్యేందుకు -రూమ్మేట్స్‌తో కలిసి చేసిన మరో ప్రయత్నం పూర్తిగా చిక్కుల్లో పడేస్తుంది. తమచుట్టూ ఏం జరుగుతుందో తెలీని మిస్టరీ, ఆ మిస్టరీని అధిగమించాలన్న ఆరాటం మధ్య -కితకితలతో కథ నడుస్తుంది.
సినిమాకు ఇద్దరు డైరెక్టర్లు ప్రాణం. మొదట -రితేశ్‌రాణా. రెండోవాడు -సంగీత దర్శకుడు కాలభైరవ. ముందే చెప్పుకున్నట్టు -తన స్టామినాను చూపించుకునే దర్శకుడు ప్రయోగం కనుక.. రితేశ్‌రాణా క్రైమ్ థ్రిల్లర్‌ను ఎత్తుకుని టైటిల్‌కి తగిన కంటెంట్‌తో కథ చెప్పాడు. చేతివాటాన్ని ప్రదర్శించాలనుకున్న కుర్రాడు డ్రగ్ దందాను బయటికెలా లాగాడన్న రొటీన్ థ్రెడ్‌ను -సహజత్వానికి దగ్గరగావుండే పాత్రలతో చిక్కుముడులతో నడిపిస్తూ -చిక్కని స్క్రీన్‌ప్లేను ప్రదర్శించాడు. లాజిక్‌ను ఆలోచించే చాన్స్ ఇవ్వకుండా డ్రామాను నడిపించటంలో డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్. నీరసంగా మొదలైన కథకు కామెడీ కోటింగ్ ఇవ్వడం ఫస్ట్ఫా టెక్నిక్ అయితే, -కథను పరిగెత్తిస్తూ కామెడీని సస్టెయిన్ చేయడం సెకెండాఫ్ టెక్నిక్‌గా కనిపించింది. సస్పెన్స్‌కి.. మిస్టరీకి మధ్య దొరికిన ఏ అవకాశాన్నీ దర్శకుడు వదలకుండా -కామెడీ కోటింగ్‌తో కథ చెప్పేశాడు. పైగా ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచటంలోని ప్రయోగించిన టెక్నిక్ -సినిమాను నిలబెట్టేసింది. తెలుగు టీవీ సీరియల్స్‌పై రాసుకున్న సెటైర్ దర్శకుడి సునిశిత గ్రహణశక్తికి అద్దం పట్టేదే. గ్రాఫ్ డౌనవుతున్న ప్రతిసారీ టైంలీ సీరియల్‌ను ప్రజెంట్ చేసి గ్రాఫ్‌ను నిలబెట్టడం బావుంది. సినిమాలో సహజంగా ఉండాల్సిన రొమాన్స్ రేషియోనీ కామెడీతో కప్పేసి -అద్భుతంగా ఎస్కేపయ్యాడు.
నిజాయితీగా సినిమాను నిలబెట్టిన రెండో దర్శకుడు -కాలభైరవ. పాటల్లేని సినిమాను బిజీఎంతో నడిపించటంలో అతని పనితనం మెచ్చదగిందే. రొటీన్‌కు భిన్నమైన సౌండింగ్‌తో -థ్రిల్లర్, మిస్టరీ మూడ్‌నుంచి ఆడియన్స్ బయటకురాకుండా కూర్చోబెట్టడంలో హండ్రెడ్ పర్సెస్ సక్సెస్ అయ్యాడు. హాంట్ చేసే థీమ్ బీజీఎంను డిజైన్ చేయకున్నా -సన్నివేశాలకు తగిన ఫీల్‌ని సౌండ్‌తో ఇవ్వడంలో కాలభైరవ నేర్పు కనిపించింది.
కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా సినిమాలో హీరో. కథలోకెళ్లేకొద్దీ క్రైమ్‌లోకి కూరుకుపోతున్న ఎక్స్‌ప్రెషన్స్ కావాల్సినంత ఇచ్చాడు. కన్ఫ్యూజన్ నుంచి సొల్యూషన్‌కు సాగే జర్నీలో -శ్రీసింహా ఆప్ట్ ఆర్టిస్టు అనిపిస్తుంది. అయితే, ముందు బూచాడిలా చూపించి తరువాత హ్యాండ్సమ్‌కు మేకోవర్ చేయడంలోని ‘పెట్టుడు డ్రామా’ కథకు అతకలేదు. ఇంట్రోలో పడిన నెగెటివ్ ఇంప్రెషన్‌ను -ఆడియన్స్ క్లైమాక్స్ వరకూ క్యారీ చేయాల్సి రావడం ఓ మైనస్. గుడ్ ఫ్రెండ్ యేసుగా ఆర్టిస్ట్ సత్య బ్యాలెన్స్ తప్పని పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కామెడీ బాధ్యతను భుజాన మోస్తూనే -ఎంటర్‌టైన్‌మెంట్ టైమింగ్‌తో కథను ఎంగేజ్ చేయగలిగాడు. మరో ఫ్రెండ్ -అగస్య్తది డీసెంట్ పెర్ఫార్మెన్స్. అత్యంత సహజమైన నటన చూపిస్తూ, దర్శకుడు రాసుకున్న క్యారెక్టరైజేషన్‌తో కథకు హైలెట్ అయ్యాడు. అలవాటైన పెర్ఫార్మెనే్స చూపించినా -పావలా శ్యామల క్యారెక్టర్ కథకు ఆప్ట్. వెనె్నల కిషోర్, విద్యుల్లేఖ రామన్, బ్రహ్మాజీ, గుండు సుదర్శన్, అతిథి పాత్రలో కనిపించిన అజయ్.. వీళ్లంతా సినిమా విలువపెంచారు. తక్కువ రన్‌టైంలోనూ ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన ఆర్టిస్టు -అతుల్య చంద్ర. ఆమె పెర్ఫార్మెన్స్ -డ్రగ్స్ మూడ్‌ని పూర్తిగా ఎలివేట్ చేసింది.
సాంకేతికంగా -సారంగం సినిమాటోగ్రఫీ బావుంది. థ్రిల్లర్ మూడ్‌కి తగిన కెమెరా పనితనం చూపించారు. చిన్ని పాయింట్‌ను సాగదీసి చుట్టినా -సినిమా గ్రిప్ తప్పకుండా ఎడిట్ చేసిన కార్తీక శ్రీనివాస్‌నూ అభినందించాలి. చిన్న కథను బిగువుగా చెప్పి సక్సెస్ అందుకునే ప్రయత్నంలో -మత్తువదలరా టీం మొత్తం సక్సెస్. నిర్మాణ విలువలు చిన్న సినిమా పరిథిలోనే ఉన్నాయి. పరిమిత పాత్రలు, చిన్ని బడ్జెట్‌తో -బలమైన ఫ్లాట్‌ఫాం నిర్మించుకునే ప్రయత్నాలు ఇంతకుముందూ చాలామంది చేశారు.. ఓకే అనిపించుకున్నారు. ఓ షార్ట్ఫిల్మ్ కంటెంట్‌ను ఫీచర్ ఫిల్మ్‌గా వౌల్డ్‌చేసి -ప్రయత్నాన్ని పరిపూర్ణం చేసిన అలాంటి క్రియేటివ్ టీమ్స్‌లో మత్తువదలరా టీంకీ ప్లేసివ్వాలి.

-విజయప్రసాద్