రివ్యూ

వీరత్వానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** తానాజీ
***
తారాగణం: అజయ్ దేవ్‌గణ్, కాజోల్, జగపతిబాబు, సైఫ్ అలీఖాన్, శరద్ కేల్కర్, శశాంక్ పాండే, నేహా శర్మ, ల్యూక్ కెన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కియోకో నకాహర
సంగీతం:అజయ్ అతుల్, సచిత్ పరంపర
నిర్మాతలు: అజయ్‌దేవ్‌గణ్, భూషణ్‌కుమార్
దర్శకత్వం: ఓం రౌత్
***
అఖండ భారతావనిని మాతృదేవతగా భావించి సేవచేసిన యోధానయోధులు పుట్టిన గడ్డ ఇది. మట్టిరుణం తీర్చుకోవడానికి ప్రతివీరుడూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించినవాడే. మట్టిని విభూదిగా మార్చుకొని శత్రువుల గుండెల్లో నిద్రపోడానికి కంకణం కట్టుకున్నోడే మహావీరుడు. అటువంటి మహావీరుల్లో ఒకానొక వీరుడు -తానాజీ మలుసరే. మరాఠా యోధుల్లో అత్యంత కీర్తిగౌరవాలు పొందిన శివాజీ కుడిభుజం. చరిత్ర సృష్టించిన యోధుల్లో స్మరింపదగిన తానాజీ జీవితాన్ని సినిమా కథగా చెప్పడానికి హీరో అజయ్ దేవ్‌గణ్ సంకల్పించాడు. పైగా -అజయ్ వందో సినిమా ఇది. అదీ బలమైన మరాఠా యోధుని కథని డెబ్యూ డైరెక్టర్ ఓం రౌత్‌కు అప్పగించటం మరో విశేషం. ఎక్కడా కొత్త దర్శకుడు అన్న పోకడలు కనిపించని విధంగా ఓంరౌత్ తన కార్యాన్ని నిర్వర్తించి -ప్రేక్షకులను 17వ శతాబ్దంలోకి తీసుకెళ్లడం ఇంకా ఇంకా విశేషం. ముఖ్యంగా అజయ్ దేవ్‌గణ్ చేసిన తానాజీ పాత్రను వైవిధ్యంగా తీర్చిదిద్ది భారతదేశ యోధుల వీరత్వం ఎలాంటిదో మరోసారి పరిచయం చేసే ప్రయత్నంలో విజయం సాధించాడు.
భారతదేశ వైభవాన్ని చూసి కన్నుకుట్టిన విదేశీ మూకలు ఎన్నోమార్లు దండయాత్రలు చేశాయి. వీరభూమిలో పుట్టిన వీరులు ఆ ప్రయత్నాలకు గండికొట్టి తామంతా భరతమాత బిడ్డలమని నిరూపించి -పుట్టిన ఒడిలోనే మట్టిలోకి ఒదిగిపోయారు. ఛత్రపతి శివాజీ మహారాజా మిత్రునిగా, సేనాపతిగా... రాజ్యాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తుంటాడు తానాజీ (అజయ్ దేవ్‌గన్). మహారాజా ఛత్రపతి శివాజీ (శరత్ కేల్కర్) రాజ్య వైభవాన్ని చూసి కన్నుకుట్టిన ఔరంగజేబు (ల్యూక్ కెనే్న) అతని కోటలపై కనే్నస్తాడు. 1760లో ఢిల్లీ చక్రవర్తి మొఘల్ వారసుడు ఔరంగజేబు తనకు కొరకరాని కొయ్యలా మారిన శివాజీని అంతమొందించాలని ప్రణాళికలు రచిస్తుంటాడు. అందులో భాగంగా శివాజీ సామ్రాజ్యంలోని 23 కోట్లను స్వాధీనం చేసుకుంటాడు మాయోపాయంతో. గొండ్వానా కోటలోని రాజమాత జిజియాబాయిని అవమానిస్తాడు. తన కోటను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు తాను చెప్పులు ధరించనని జిజియా భాయి ప్రతిజ్ఞ చేస్తుంది. కోటలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఛత్రపతి శివాజీ తన కుడిభుజమైన తానాజీని నియమిస్తాడు. తన కొడుకు పెళ్లిని వాయిదా వేసి మరీ ప్రభుసేవాపరాయణుడైన తానాజీ యుద్ధానికి సన్నద్ధుడవుతాడు. శివాజీ రాజ్యాన్ని కూల్చే కుట్రలో తనకు సహాయపడిన ఉదయ్ బన్ రాథోడ్ (సైఫ్ అలీఖాన్)నే యుద్ధానికి పంపిస్తాడు ఔరంగజేబు. దాదాపు 2వేలమంది సేనలు, అభేద్యమైన ఫిరంగులతో -సింహగఢ్‌గా పేరుమారిన కొందన్‌కోటను తానాజీ కేవలం తన 350మంది అనుచరులతో స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం చేస్తాడు. తన పెంపుడు ఉడుము సాయంతో కోటలోకి ప్రవేశించలేని దిక్కువైపునుండి దాడిచేస్తాడు. ఈ దాడిలో శత్రువులపై తానాజీ విజయం సాధించాడా? లేదా అనేది ముగింపు సన్నివేశాలు. సినిమాలో ఒకవైపు యుద్ధతంత్రాలు, మరోవైపు కుటుంబాల మధ్య సంఘర్షణను సమన్వయం చేసుకుంటూ కథను అల్లడంతో.. ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. కొత్త దర్శకుడు ఓంరౌత్ ఎక్కడా ఎంతో అనుభవంతో ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల చిత్రీకరణను రంజన్ బలూత్‌తో కలిసి అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. తానాజీ ధర్మపత్ని సాయిత్రిబాయిగా కాజోల్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చరిత్రలో ఒకభాగం కనుక ప్రతి సన్నివేశానికి తగిన విధంగా రీ రికార్డింగ్ జత చేయడంతో సినిమా కళ్లముందు కదలాడే చరిత్రలా కనిపించింది. మరాఠా యోధుల వీరత్వానికి సాక్షిగా రూపొందించిన చిత్రంలో ‘శివ శివ’ పాట చిత్రానికి హైలెట్. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీపకుండా అలనాటి వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ -యధార్థ గాథను కళ్లముందు ఆవిష్కరించారు. నిర్మాత, కథానాయకుడిగా అజయ్ దేవ్‌గణ్ విజయం సాధించినట్లే.

-పగడాల పాండు యాదవ్