రివ్యూ

కామెడీకి ముడేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** సరిలేరు నీకెవ్వరు

తారాగణం: మహేష్‌బాబు, రష్మిక మండన, విజయశాంతి, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, రావురమేష్, పోసాని కృష్ణమురళి, అజయ్, రవిబాబు, సంగీత, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కెమెరా: కె రత్నవేలు
నిర్మాతలు: అనిల్ సుంకర, దిల్‌రాజు
దర్శకత్వం: అనిల్ రావిపూడి
**
కథానాయకుడు -ప్రతినాయకుడిని చంపేస్తే ఆడియన్స్‌కి ఆనందం. చంపకుండా వదిలేస్తే మాత్రం -చిన్న అసంతృప్తి. ఇక్కడ కథానాయకుడు బాధ్యత కలిగిన వీర సైనికుడు. అతను విదేశీ శత్రువులను చంపగలడు. కానీ -స్వదేశంలో అంతా అతనికి సమానమే. దేశ ప్రజలను కాపాడతానన్న మాటమీదే ఉంటాడు. అదేవిధంగా -ప్రతినాయకుడైనా భారతీయుడే కనుక చంపడానికి మనస్కరించడు. సంస్కరించడానికే ప్రయత్నిస్తాడు. తెలుగు చిత్రాల్లో హీరో.. విలన్‌కు ఎటువంటి హాని చేయకుండా, మైండ్‌సెట్‌ను మార్చే ప్రయత్నం చేయడం ఈ చిత్రంలో కొత్తగా కన్పించే అంశం. ఆ అంశాన్ని తీసుకొని దర్శకుడు అనిల్ రావిపూడి ఏవిధంగా డీల్ చేశాడు? సరిలేరు నీకెవ్వరు అని ఎలా అనిపించాడు అనేదే కథనం.
దేశ సరిహద్దుల్లో శత్రువుల నుంచి ముప్పురాకుండా చూసే సైనికుడు అజయ్ కృష్ణ (మహేష్‌బాబు). ఉగ్రవాదులు కొందరు బాలలను అపహరించి డిమాండ్ నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా మిషన్ ఆపరేషన్ నిర్వహించి, ఉగ్రవాదుల స్థావరాల్ని చుట్టుముట్టి కాల్పులు జరుపుతాడు అజయ్ కృష్ణ. అతనికి తోడుగా వచ్చిన సైనిక బృందంలో అజయ్ కృష్ణ (సత్యదేవ్) అనే మరో సైనికుడు తీవ్రంగా గాయపడతాడు. అతనికి తల్లి, ముగ్గురు చెల్లెళ్లు. చెల్లెలి పెళ్లి త్వరలో జరగనుంది. ఇందుకోసం మిలట్రీ రూల్స్‌ను పక్కనపెట్టి, అజయ్‌కృష్ణ నిర్వర్తించాల్సిన బాధ్యతల నిర్వహణకు మేజర్ అజయ్ కృష్ణను కర్నూలుకు పంపుతాడు సైనిక ఉన్నతాధికారి (మురళీ శర్మ). అక్కడ అజయ్‌కృష్ణ తల్లి భారతి మెడికల్ ప్రొఫెసర్. భారతి భర్త, పెద్ద కుమారుడు కూడా భారత సైన్యంలోనే అమరులయ్యారు. ఇపుడు రెండో కొడుకూ అదేస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పరిస్థితి ఇలావుంటే -పేదలు, వృద్ధులకిచ్చే పెన్షన్ పంపిణీల్లో జరిగిన కుంభకోణంలో మంత్రి నాగేంద్ర ప్రసాద్ (ప్రకాష్‌రాజ్) ప్రధాన సూత్రధారి. ఈ విషయం తెలిసిన ముగ్గురు వ్యక్తులను హతమారుస్తాడు నాగేంద్ర. ఇక్కడ ఈ కేసులో భారతి న్యాయం కోసం పోరాడుతుంది. అది నచ్చని నాగేంద్ర ఆమెకు ఎటువంటి మగ దిక్కూ లేదని, భారతి కుటుంబాన్ని అంతం చేసే ప్రయత్నంలో ఉంటాడు. ఆ పరిస్థితుల్లో కర్నూలులో అడుగుపెట్టిన అజయ్ కృష్ణ -ఎలా మంత్రి నాగేంద్రలో మార్పును తెచ్చాడు. భారతి కుటుంబాన్ని ఏవిధంగా ఆదుకున్నాడు అన్నదే మిగతా కథ.
ఆరంభం నుండీ సినిమా ప్రేక్షకుణ్ణి ఎంటర్‌టైన్ చేయడానికే ప్రయత్నించింది. ముఖ్యంగా మహేష్‌బాబు ఇంట్రో పాటకన్నా ముందుగా వచ్చిన జాతీయ పతాక సన్నివేశాలు, పాట తరువాత వచ్చిన ఉగ్రవాదుల ఏరివేత చిత్రీకరణ వైవిధ్యంగా తెరపై చూపే ప్రయత్నం చేశారు. కర్నూలు వచ్చిన అజయ్‌కృష్ణ కొండారెడ్డి బురుజు వద్ద చేసే ఫైట్స్, భారతి -నాగేంద్రలమధ్య వచ్చే సన్నివేశాలను వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ఫస్ట్ఫాలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి సరికొత్త అనుభూతినిచ్చింది. ప్రతి పాత్రనుండి ఆ సన్నివేశాల్లో పిండిన కామెడీ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. మహేష్‌బాబును ప్రతి సీన్‌లో ఫ్రెష్‌లుక్‌లో చూపే ప్రయత్నం చేశారు. భారతి లెక్చరర్ అయి వుండి ఇంటలెక్చువల్‌గా ఆలోచించకుండా -కేవలం ఓ బేలగా మారి నాగేంద్ర నుండి తప్పించుకొనే ప్రయత్నం చేయడం లాజిక్‌కు అందదు. తన కుమారుడు సైన్యంలో ఉన్నాడన్న భావన ఆమెలో ఎక్కడా కనిపించకపోవడం కథకు మైనస్ అనిపిస్తుంది. ఎవరూలేని దిక్కూ మొక్కూ లేని అనాధగా ఇబ్బందులు పడటం ప్రేక్షకుడికి మింగుడుపడని విషయం. కధానాయిక సంస్కృతి (రష్మిక మండన) పెళ్లి చేసుకోవడం కోసం కథానాయకుడి వెంటపడే సన్నివేశాలూ కొంచెం ఓవరయ్యాయి. అయితే ఇద్దరు కూతుళ్లకు దద్దమ్మల్లాంటి అల్లుళ్లను తెచ్చుకొని సంతృప్తిగావున్న రావు రమేష్ లాంటి పాత్ర, 16 ఏళ్లకే పెళ్లి చేసుకుని మొగుడితో నానా ఇబ్బందులు పడే సంగీత పాత్ర అక్కడక్కడా కనిపించేవే. భారతి పాత్రలో వైవిధ్యమైన వ్యక్తిత్వమున్నా మరికొంత ట్రీట్‌మెంట్ ఇస్తే ఆ పాత్ర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేది. మహేష్‌బాబు- విజయశాంతిలమధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రాణం. కానీ అన్ని సన్నివేశాలూ పడికట్టుగానే సాగుతాయి. చివరలో క్లైమాక్స్ పెట్టి నానా యాగీ చేయకుండా విలన్‌ను బోర్డర్‌కు తీసుకెళ్లి మిలట్రీలో ఆరు నెలలపాటు శిక్షణ ఇప్పించడం, తప్పులు చేసే ప్రతి రాజకీయ నాయకుడికీ ఇలా సరిహద్దుల్లో మిలట్రీ శిక్షణ ఇప్పించాలని చెప్పిన మాటలు చిత్రానికి హైలెట్. దేశభక్తితో చెప్పిన డైలాగులు, ఫ్యాక్షనిజంతో చేసిన ఫైట్లు, ట్రైన్ ఎపిసోడ్‌లో వచ్చిన బ్లేడ్ బ్యాచ్ బండ్ల గణేష్ హాస్యం చిత్రానికి వనె్నలద్దింది. మహేష్‌బాబు తనదైన స్టైల్‌లో, సరికొత్త మ్యానరిజంతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం వందశాతం చేశాడు. రష్మిక మండన మహేష్‌బాబు ముందు తేలిపోయింది. ఎక్కడా అతనికి పోటీకి నిలవలేకపోయింది. విజయశాంతి ఆ పాత్రకు యాప్ట్. ఉన్నవాళ్ళల్లో ప్రకాష్‌రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు. టైలర్‌మేడ్ పాత్రే. ఫొటోగ్రఫిలో ప్రతి సన్నివేశాన్నీ చక్కగా తీర్చిదిద్దారు. పాటలు క్యాచ్‌బుల్‌గా లేవు. ఆర్‌ఆర్ సినిమాకు ప్రాణం. దర్శకత్వపరంగా ఓ మంచి పాయింట్‌ను తీసుకున్నా.. చివరిదాకా చక్కగా తీర్చిదిద్దినా.. చిన్న అసంతృప్తి మాత్రం ఆడియన్స్‌ని వెంటాడింది. ఆ కాస్త జీవం కూడా పోసి వుంటే -పండగ రోజున ఫలహార విందే అయి వుండేది.

-విజయ్ శేఖర్