రివ్యూ

జాతకం కలిసి రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు*రాహు
*
తారాగణం:అభిరాం వర్మ, కృతిగార్గ్, సుబ్బు వేదుల, కాలకేయ ప్రభాకర్, చలాకి చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక తదితరులు
సంగీతం:ప్రవీణ్ లక్కరాజు
కెమెరా:ఈశ్వర్ యల్లు మహంతి
నిర్మాతలు:ఎ.వి.ఆర్.స్వామి, బాబ్జి
దర్శకత్వం:సుబ్బు వేదుల
*
జీవితం పూల పాన్పు కాదు. నిరంతరం ఎదురయ్యే సవాళ్లను అధిమిస్తూ వెళితేనే విజయం సాధిస్తాం. విజయానికి అడుగు దూరంలో కూడా అవాంతరాలు ఎదురవుతాయి. ముందుగా వచ్చే ఆపదలను గుర్తించి వాటికి సరైన సమాధానాలు ఇచ్చినప్పుడే విజయం వరిస్తుంది. అటువంటి ఓ అబల కథనాన్ని తీసుకొని ‘రాహు’ చిత్రంగా ముందుకు వచ్చాడు సుబ్బు వేదుల. తీసుకున్న పాయింట్ నేటి యువతరానికి ఓ దిక్సూచిలా వున్నా, దాన్ని తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు.
భార్యను పోగొట్టుకుని ఏకైక కుమార్తెను పెంచుకుంటుంటాడు పోలీస్ కమిషనర్ (సుబ్బు వేదుల). పదేళ్ల వయసులోనే అతని కూతురు భాను (కృతి గార్గ్)కు కన్వర్షన్ డిజార్డర్ అనే వ్యాధి వుందని తెలుస్తుంది. రక్తాన్ని చూస్తే ఓ ఐదు నిమిషాలపాటు కళ్ళు కనిపించని వ్యాధి భాను బాధపడుతోంది. గ్యాంగ్‌స్టర్ నాగరాజు (కాలకేయ ప్రభాకర్)ను రెక్కీ చేసి పట్టుకుంటాడు భాను తండ్రి. ఉన్న ఒక్క కూతుర్ని చంపేసి నీకు దూరం చేస్తా అని సవాలు చేస్తాడు నాగరాజు. కట్ చేస్తే, యుక్తవయస్సులోకి వచ్చిన భాను జీవితంలోకి శేష్ (అభిరాం వర్మ) ప్రవేశిస్తాడు. అనాధనని చెప్పుకున్న అతనికి తన తండ్రితో చెప్పి ఎస్‌ఐగా ఉద్యోగం ఇప్పిస్తుంది భాను. ఈ క్రమంలో శేష్‌ను పెళ్లిచేసుకోవడానికి సిద్ధమవుతుంది భాను. జాతకాలు కలవకపోవడంతో పెళ్లి ఆగిపోతుంది. ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలు ఉంటాయా అనుకుంటూ ప్రేమికులిద్దరూ రహస్య వివాహం చేసుకుంటారు. జాతకం ప్రకారం తమకున్న అపాయం దాటిపోయాక పెద్దవాళ్లకు చెప్పాలనుకుంటారు. ఇదే సమయంలో చందమామకు రాహు అడ్డుపడినట్లుగా ఆమె జీవితంలో ఓ పెద్ద మలుపు తీసుకుంటుంది. వెనె్నలను కురిపించాల్సిన జీవితంలో చీకట్లు ఎలా అలుముకున్నాయి, కన్వర్షన్ డిజార్డర్‌తో బాధపడుతున్న భాను ఒంటరి పోరాటాన్ని ఎలా చేసింది అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుంది.
సినిమా మొదటినుంచీ ఏదో వైవిధ్యం వున్నది అన్నట్లుగా సాగుతుండగానే ఎక్కడా సరైన గ్రిప్ కథనంలో కనపడదు. పాత్రలన్నీ మొదటినుంచి ఎలా ప్రవర్తించాయో అలాగే వున్నా, రాహు పాత్ర మాత్రం కొత్త కోణాన్ని తీసుకోవడంలో వున్న లాజిక్‌ను మరికొంత విపులంగా చర్చిస్తే బావుండేది. కాకపోతే సస్పెన్స్ థ్రిల్లర్‌గా చెప్పాలనుకున్న కథ కనుక జస్ట్ టూకీగా చెప్పి వదిలేశారు. పోలీస్ కమిషనర్ పాత్రలో హుందాతనం కనిపించదు. కాకపోతే భార్యను పోగొట్టుకుని కూతురి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అలా ఆ పాత్ర అలా వున్నదా అని ప్రేక్షకుడు ఓ నిర్ణయానికి రావాలి. ఎక్కువగా రాత్రి షూటింగ్ కనుక చాలావరకు లైటింగ్స్ తక్కువ వాడటంవల్ల విజన్‌లో ఓ కొత్త ప్రయోగం చేయాలనుకున్నాడు దర్శకుడు. కానీ దానికి సరైన కథనం జతకాకపోవడంతో ఆ ఫీలింగ్ కన్పడదు.
నటుల్లో కృతి గార్గ్ తన పాత్రలో ఇమిడిపోయింది. అన్ని రకాల ఎమోషన్స్ పండించింది. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ జోనర్‌లో హీరోతోపాటుగా పోటీపడి నటించింది. అభిరాం వర్మ కూడా తన పాత్రలో రెండు షేడ్స్‌ను ఆవిష్కరించడంలో ఓకె అన్పించారు. కాలకేయ ప్రభాకర్ వున్నంతలో ఓకె. చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్‌ల పాత్రలు వైవిధ్యంగా అన్పిస్తాయి. ముగ్గురూ కామెడీ పండించే నటులైనా ఈ చిత్రంలో యమా సీరియస్‌గా నటించేశారు. స్వప్నిక పాత్రకు తగినట్లుగా కన్పించింది. సిద్ శ్రీరాం ఆలపించిన ‘ఏమో ఏమో’ క్యాచిబుల్‌గా సాగింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు తగినట్లుగా సాగింది. కెమెరా పనితనం కంటికి ఇబ్బందిగా సాగింది. మరికొంత ఎడిట్ చేయవచ్చు. దర్శకత్వ పరంగా ఓ మంచి కథనాన్ని తెరపై ఆవిష్కరించాలనుకున్నా స్క్రిప్ట్‌పరంగా ఇంకా ఎఫర్ట్స్ పెట్టాల్సింది.