రివ్యూ

చేదైన.. చెంపదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు**థప్పడ్
**
తారాగణం: తాప్సీ పన్ను, పావెల్ గులాటీ, రత్నప్రతీక్ షా, తాన్వీ అజ్మి, దియా మీర్జా, రామ్‌కుమార్ తదితరులు
సంగీతం: అనుంగ్ సైకియా, మంగేష్ థాక్డే
సినిమాటోగ్రఫీ: సౌమిక్ ముఖర్జీ
నిర్మాతలు: భూషణ్‌కుమార్,
క్రిషన్‌కుమార్, అనుభవ్
దర్శకత్వం: అనుభవ్ సిన్హా
**
జీవితాలు నిలబడాలంటే -సర్దుబాటు తప్పనిసరి. అది -రెండువైపులా సాధ్యమైతే లైఫ్ హ్యాపీ. లేదంటే నరకం ఖాయం. తెలీకుండా జరిగేది పొరపాటు. పశ్చాత్తాపంతో సమసిపోతుంది. తెలిసి చేయడం -తప్పు. దిద్దుకోకుంటే నేరమై శిక్షవరకూ దారితీస్తుంది. భార్యపట్ల భర్త చూపిన కర్కశత్వం పొరపాటా? ఉద్దేశపూర్వకమా? దేనివల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తాయి అన్నది చర్చించిన సినిమా -్థప్పడ్. బనారస్ మీడియా సమర్పణలో దర్శక నిర్మాత అనుభవ్ సిన్హా పర్యవేక్షణలో తెరకెక్కిన సినిమా థప్పడ్ (చెంపదెబ్బ). ఇంత చిన్న విషయానికేనా? అన్నది టాగ్‌లైన్.
విక్రమ్ (పావెల్ గులాటి) కోట్లకు అధిపతి. కాని తండ్రి, అన్నకు దూరంగా తల్లితో కలిసి ఉంటుంటాడు. తన ఆలోచనలు, తెలివితో ఓ కంపెనీని అగ్రస్థాయిలో నిలబెట్టి, దాని లండన్ ఆఫీసుకి ముఖ్య మేనేజర్ కావాలని, లండన్‌లో స్థిరపడాలని కలలుకంటూ.. సాకారం కోసం శ్రమిస్తుంటాడు. తండ్రి మద్దతు లేకుండా తన కాళ్లమీద తాను నిలబడాలనే తపన. విక్రమ్ భార్య అమృతృ (తాప్సి పొన్ను). భర్తే తన లోకం. తను ఓ గొప్ప నర్తకి కావాలని కలలుగంటుంది. కాని మంచి సంబంధం అని పెళ్లి చేసేస్తారు. అత్తకు సేవలు చేసుకుంటూ, భర్తే తన ప్రపంచమని భావిస్తూ కన్నకలను వదిలేస్తుంది. పక్కింటి పాపకు నృత్యం నేర్పుతూ ఆనందంగా గడిపేస్తుంటుంది.
విక్రమ్ కలలు సాకారమై అతను లండన్ కంపెనీకి ముఖ్య మేనేజర్‌గా నియమితుడవుతాడు. ఆ ఆనందంలో ఇంట్లో పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. పార్టీ మధ్యలో విక్రమ్‌కి ఫోన్ వస్తుంది. దాని సారాంశం- ముఖ్య అధికారివి నువ్వే కానీ, నీ పైన ఓ లండన్ లేడీ ఆఫీసరుంటారు. ఆమె కింద పర్యవేక్షణ చేయాలని ఆర్డరు. విక్రమ్ కోపంతో రగిలిపోతాడు. వికృతంగా ప్రవర్తిస్తుంటాడు. భార్య ఇంటిలోపలికి లాక్కెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంతే, ఆ కోపంలో ఆమె చెంప ఛెళ్లుమనిపిస్తాడు. ఆ ఘటనతో -బృందావనంలాంటి ఇల్లు నరకమవుతుంది. వాళ్ల జీవితాలను ఏ తీరాలకు ఈడ్చుకుపోయిందనేది తెరపైనే చూడాలి.
విక్రమ్ (పావల్) నటన బాగుంది. తన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకోవాలనుకునే పాత్రలో ఇమిడిపోయాడు. చెంపదెబ్బకు ముందు, తర్వాత చూపించాల్సిన వేరియేషన్స్‌లో జీవించాడు. చివరలో విడాకులు తీసుకుని.. తమకు పుట్టబోయే బిడ్డపై ఇద్దరికీ హక్కులుంటాయనే పత్రంపై సంతకం పెట్టాక, సంతకం పెట్టకముందు పెర్ఫార్మెన్స్ కట్టిపడేస్తుంది. తాను చేసిన తప్పుకు కుమిలి కుమిలి ఏడ్వటం, భార్యకు కన్నీటి క్షమాపణలు చెప్పే సన్నివేశం హృదయాన్ని కదిలిస్తుంది. అమృత (తాప్సి) నటన శిఖరాగ్రానికి చేరింది. ప్రతి చిన్న విషయాన్ని సున్నితంగా, భావాన్ని మోములో అద్భుతంగా ప్రతిబింబించింది. చివరిలో తన జీవితం ఇలా మార్పు చెందింది, తను ఏంకోరుకుంది? ఏం జరుగుతుంది? ప్రపంచంలో గొప్ప గృహిణి కావాలనే తన కల ఇలా కూలిపోవటంలాంటి భావాలను అద్భుతంగా ఆవిష్కరించింది. నటించినవారంతా బాగా చేశారు.
సంగీతం బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నిజంగానే మ్యాజిక్. పాటలు బాగున్నాయి. ‘టూట్‌జానా’ (విరిగిపోవటం) అనే అర్థంలో వచ్చే పాట అర్థవంతంగా, సందర్భాకి తగినట్టుంది. ఇక దర్శకుడు అనుభవ్ సిన్హా గురించి చెప్పాలి. పంచభక్ష్య పరుమాన్నం వడ్డించి చివరికి రుచిలేని వటంకాన్ని బలవంతాన తినిపించి పాత అమృతం లాంటి వంటకాల్ని మరిచిపోయేలా చేసుకున్నాడు. భర్త పొరపాటుగానైనా కొట్టిన చెంపదెబ్బ కొందరికి హిమాలయం అంత పెద్ద తప్పు అనిపించొచ్చు. మరికొందరికి సూదిమొనంత చిన్నదిగాను కనిపించవచ్చు. ఎవరి మానసిక పరిణతిని బట్టి వాళ్లు ఆలోచిస్తారు. ఏదేమైనా భార్యని భర్త చెంపదెబ్బ కొట్టటం తప్పు. కాని భర్త చెంపదెబ్బ కొడితే విడాకులు తీసుకోవాలని చెప్పడానికి రెండున్నర గంటల సినిమా, కోట్ల డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదనిపిస్తుంది. భర్త తను చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి, తిరిగి తన భార్య ప్రేమను పొంది నరకప్రాయంగా మారిన జీవితాన్ని నందనవనంలా మార్చుకోవడానికి పైవన్నీ అవసరం! మనిషైనా సినిమా అయినా సంఘటన క్లైమాక్సులో తన తప్పు గ్రహించి మారటానికి ప్రయత్నించాలి కాని దర్శకుడు దాన్ని వదిలేశాడు. భర్త తన తప్పుని తెలుసుకొని క్షమాపణ కోరినా ఆ స్ర్తి క్షమించకపోతే?.. భార్య తన జీవితం ఇలా అని ఏడుస్తూ ఎవరిదారిలో వాళ్లు వెళ్ళటం కథ సుఖాంతాన్ని సూచిస్తుందా? భగీరథ ప్రయత్నం చేసినా, భార్య హృదయాన్ని గెలుచుకోవటం అనే విషయం చెబితే అద్భుతంగా పండేది. క్షమ మనిషి సహజ లక్షణం. ఆ లక్షణాన్ని దర్శకుకడు పట్టించుకోలేదు. హిమాద్రిలాంటి బలమైన కథని ఎత్తుకొని, తానువేసిన ముళ్ళను విప్పలేక తానే అందులో చిక్కుకున్నట్టుంది. భార్యాభర్తల మానసిక, శారీరక, ఆత్మిక కలయికే విశ్వధర్మం. సుఖ సంతోష జీవనమని దర్శకుడు క్లైమాక్సులో చెప్పటం మరిచిపోయి చెంపదెబ్బకి విడాకులే పరిష్కారమని కథ చెప్పడం ఆడియన్స్‌కి నచ్చకపోవచ్చు.

-మధుర మురళి