రివ్యూ

దుల్కర్.. దోచేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** కనులు కనులను..
***
తారాగణం: దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ, రక్షణ్, గౌతమ్ మీనన్, నిరంజని సంగీతం: మసాలా కాఫీ, హర్షవర్ధన్, సినిమాటోగ్రఫీ: కెఎమ్ భాస్కరన్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ
నిర్మాతలు: వయాకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ
దర్శకత్వం: దేసింగ్ పెరియస్వామి
***
కొత్త జనరేషన్ హీరోల్లో దుల్కర్ సల్మాన్ క్రేజ్ వేరు. అది -అతనెంచుకునే కథల ప్రత్యేకత నుంచి వచ్చిందే. ‘ఓకే బంగారం’లో దుల్కర్ పెర్ఫార్మెన్స్‌కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. తరువాత ‘మహానటి’లోనూ కనిపించింది కొద్దిసేపే అయినా -పాత్రపై తనదైన ముద్రవేశాడు దుల్కర్. ద్విభాషా చిత్రాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించే దుల్కర్ నుంచి తాజాగా వచ్చిన చిత్రం -కనులు కనులను దోచాయంటే. రీతూవర్మ హీరోయిన్. దేసింగ్ పెరియస్వామి తెరకెక్కించిన లవ్ అండ్ క్రైమ్ డ్రామా -తెలుగు ఆడియన్స్‌కి ఎంతవరకూ రీచవుతుందో చూద్దాం.
సిద్ధార్థ (దుల్కర్ సల్మాన్) ఓ టెకీ. అతని స్నేహితుడు కలీస్ (రక్షణ్). ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇద్దరూ.. సులువుగా డబ్బు సంపాదించడానికి ఎంచుకున్న మార్గం -ఆన్‌లైన్ ఫ్రాడ్. కోటాను కోట్లుగా సాగుతోన్న ఈ-కామర్స్ బిజినెస్‌లో.. చిలకొట్టుడు ఫ్రాడ్‌తో డబ్బు సంపాదించి హ్యాపీ లైఫ్‌ని రిచ్‌గా లీడ్ చేస్తుంటారు. ఆక్రమంలో -ట్రెడిషినల్ గాళ్ మీరా (రీతూ వర్మ) తారసపడుతుంది. తనదైన ఫ్రాంక్‌నెస్ చూపించి -లవ్‌లో పడేస్తాడు. మీరా స్నేహితురాలి (నిరంజని)ని లైన్‌లో పెట్టడానికి కలీస్ ట్రై చేస్తుంటాడు. ఈక్రమంలో -పోలీస్ కాప్ గౌతమ్ మీనన్ ఇంట్లో లాప్‌టాప్ బ్లాస్టై ఆన్‌లైన్ మోసాల కూపీ కదులుతుంది. పోలీసులకు విషయం తెలిసిందని గ్రహించిన స్నేహితులిద్దరూ -ఫ్రాడ్ స్ట్రాటజీ మారుస్తారు. భారీమొత్తం కూడగట్టి -గాళ్‌ఫ్రెండ్స్‌తో గోవా చెక్కేసే ప్లాన్ చేస్తారు. గోవాలో రెస్టారెంట్ ఓపెన్ చేసి అక్కడే సెటిలవ్వాలని నలుగురు ప్లాన్ చేసుకుంటారు. ఫ్రాడ్ చేసి సంపాదించిన మొత్తంతో గోవా చెక్కేసిన వీళ్లని పోలీసులు వెంటాడతారు. సిద్ధార్థ టీం బస చేసిన రిసార్ట్‌పై అటాక్ చేసిన పోలీసులు -సిద్ధార్థ, కలీస్‌ను పట్టుకుంటారు. గాళ్‌ఫ్రెండ్స్ ఇద్దరూ కనిపించరు. అక్కడ డీసీపీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో ఫ్రెండ్స్ ఇద్దరూ షాక్ తింటారు. డీసీపీ ఏం చెప్పాడు? అసలు మీరా, నిరంజని ఎవరు? రిసార్ట్ నుంచి ఏమయ్యారు? వాళ్ల కథేంటి? అన్న కోణంలో కొత్త కథ ఓపెనవుతుంది. మీరాని సిద్ధూ కలిసాడా? ఏం తెలుసుకున్నాడు? ప్రేమ విషయం ఏమైంది? ఇలాంటి ప్రశ్నలకు సినిమాలో సమాధానం దొరుకుతుంది.
కనులు కనులను దోచాయంటే.. టైటిల్ విన్నపుడు ‘దొంగ దొంగ’ సినిమా గుర్తుకొస్తుంది. నిజానికి టైటిల్ విన్నపుడు ఇదేదో రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకుంటాం. కాకపోతే -కథగా తాను చెప్పదలచుకున్న విషయాన్ని టైటిల్‌తో నర్మగర్భంగా చెప్పడంలోనే దర్శకుడు పెరియస్వామి సక్సెస్ అయ్యాడు. కాంటెంపర్ కామర్స్ క్రైమ్‌కు -లవ్ ట్రాక్‌ను జోడించి కథను నడిపిన విధానం వినోదాత్మకంగానే ఉంది. బుర్రలో కాస్త గుజ్జువుంటే -ఆన్‌లైన్ ఫ్రాండ్ ఎంత సులువో కథానాయకుడి పాత్రతో చెబుతూనే.. కథ నడిపించటం ఆసక్తికరంగా ఉంది. చూస్తున్న ఫ్రాడ్ లాజికల్‌గా సాధ్యం కాదని మనసు చెబుతున్నా -డ్రామా బిగింపుగా నడిపించి లాజిక్‌ని వెతికే అవకాశం ఇవ్వకుండా దర్శకుడు మ్యాజిక్కే చేశాడు. క్రైమ్ కంటెంట్‌కు అందమైన లవ్ ట్రాక్ జోడించటంతో.. కథ ఫ్లో ఈజీగా సాగిపోయింది. సిద్ధార్థ, కలీస్‌లు ఫ్రాడ్ స్కెచ్ కన్విన్సింగ్ కాదనిపించినా, కథ ఆసక్తికరంగా ఉండటంతో ఆలోచించకుండా ముందుకెళ్లిపోతాం. ఫ్రాడ్‌ని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసే ఇంటెలిజెంట్ టెక్కీగా దుల్కర్ పెర్ఫార్మెన్స్ బావుంది. ఫ్రెండ్ రోల్ చేసిన రక్షణ్‌కూ ఎక్కువ నిడివి దొరకడంతో, తన పెర్ఫార్మెన్స్‌తో సపోర్ట్‌గా నిలిచాడు. కాకపోతే, అతని సిట్యుయేషనల్ కామెడీ, టైమింగ్ పంచ్‌ల్లో మెరుపు లేదు. సంప్రదాయ యువతిగా, ఆరితేరిన మోసగత్తెగా, మోడ్రన్ లేడీగా మీరా పాత్రలోని డిఫరెంట్ షేడ్స్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది రీతూవర్మ. ఫ్రెండ్ రోల్ చేసిన నిరంజని సెటిల్డ్‌గా కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ ఇవ్వగలిగింది. సీరియస్ పోలీస్ అధికారిగా ఇంటెన్స్ లుక్‌లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ ప్రజెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ఫాలో హీరో టీం ఫ్రాండ్‌కు కేటాయించిన డైరెక్టర్, సెకెండాఫ్‌లో ఇంటర్వెల్ ట్విస్ట్‌నే మరో స్టోరీ చేసి చూపించి -టైటిల్‌కు జస్ట్ఫికేషన్ ఇవ్వడం బావుంది. ఓ గేమ్‌లా సాగిపోయే సెకెండాఫ్‌లో ఏ సీన్‌ను మాట్లాడుకున్నా.. ఆడియన్స్‌కి థ్రిల్ మిస్సయ్యే ప్రమాదం ఉంది కనుక -దాని గురించి తక్కువ డిస్కస్ చేయడం బెటర్. ఫస్ట్ఫాలో గౌతమ్ మీనన్ పాత్రను చూసి ఒక అంచనాతో ఉన్న ఆడియన్స్‌కి దర్శకుడు పెరియస్వామి సెకెండాఫ్‌తో చిన్న జోల్ట్ ఇచ్చినా -క్లైమాక్స్ షాట్స్‌తో కన్విన్స్ కాగలుగుతాం.
టెక్నికల్‌గానూ సినిమాను తక్కువ చేసి చెప్పలేం. ‘గుండెగిల్లి’ ‘కదిలే కలగా’ పాటల బాణీలు బావున్నాయి. ‘మసాలా కాఫీ’ టీం బీజీఎం స్కోర్‌తో సినిమా ప్లస్ అయితే, క్రియేటివ్ విజువల్స్‌తో డీవోపీ భాస్కరన్ సినిమాకు ప్రాణం పోశాడు. సీన్స్ కంటిన్యుటీలో కనిపించే లాగింగ్ -ఎడిటింగ్ పనితనానికి మచ్చగా అనిపించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. లాజిక్ మిస్సయినా.. దాని గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా దర్శకుడు పెరియస్వామి రాసుకున్న ట్రీట్‌మెంట్ బావుంది. కనులు కనులను దోచాయంటే .. ఆడియన్స్‌ని ఏమాత్రం నిరాశపర్చని మంచి ఎంటర్‌టైనర్.

-ప్రవవి