రివ్యూ

ప్రేతాత్మల పిచ్చి గోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు.. దొర
**
తారాగణం:
సత్యరాజ్, శిబిరాజ్, బిందుమాధవి సంగీతం: సిద్ధార్ద్ విపిన్
సినిమాటోగ్రఫీ: యువ
నిర్మాత: జవహర్‌బాబు
దర్శకత్వం: ధరణి ధరన్
**
విలన్‌గా కెరీర్ ప్రారంభించిన సత్యరాజ్, తరువాత హీరోగా చాలా సినిమాలే చేశాడు. అవి తెలుగులోకీ రీమేక్ అయ్యాయి. ప్రస్తుతం సత్యరాజ్ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిలయ్యాడు. బాహుబలి కట్టప్పగా ఇమేజ్ తెచ్చుకున్న సత్యరాజ్ ప్రధాన పాత్రలో, ఆయన తనయుడు శిబిరాజ్ హీరోగా నటించిన చిత్రం దొర. తెలుగులో సత్యరాజ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని -జాక్సన్ దొరై తమిళ హారర్ చిత్రాన్ని తెలుగులో దొర పేరిట తీసుకొచ్చారు. దొర ఏం చేశాడు? ఎంతవరకూ భయపెట్టాడో చూద్దాం.
కథ:
ఇండియా బ్రిటీష్ పాలనలో ఉన్న సమయంలో -దొరపురం అనే గ్రామంలో జాక్సన్ దొర ఆగడాలతో సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడేవారు. అలాంటి సమయంలో అడవి దొర (సత్యరాజ్) జాక్సన్‌ని మట్టుపెట్టాలని అనుచరులతో కలసి బయల్దేరతాడు. ఎంత స్పీడుగా బయల్దేరతారో అంతే స్పీడుగా అడవి దొర, అతని అనుచరులు జాక్సన్ చేతుల్లో హతమవుతారు. ప్రేతాత్మలుగా మారిన అడవిదొర, అతని అనుచరులు అప్పటినుంచి అదే బంగాళాలో తిరుగుతుంటారు. ఇదంతా వందేళ్ల క్రితంనాటి మాట. తర్వాత జాక్సన్ దొర, అతని సైన్యం చనిపోయినా వాళ్ళు కూడా అదే బంగాళాలో సంచరిస్తూంటారు. ప్రతిరోజు రాత్రి 12 గంటలు కొట్టగానే ప్రేతాత్మల మధ్య యుద్ధం మొదలవుతుంది. జాక్సన్ చేతుల్లో అడవిదొర, అతని ఆత్మలు హతమవుతూ ఉంటాయి. రోజూ ఇదే తంతు జరుగుతూంటుంది. అందుకే రాత్రి 9 దాటిందంటే ఆ ఊరి జనం ఇంటినుంచి బయటకురారు. దీనికి సంబంధించిన కంప్లయింట్ రావడంతో ఎస్‌ఐ సత్య (శిబిరాజ్)ని దర్యాప్తు చేసి రిపోర్టు రెడీ చేయమని దొరపురం పంపిస్తుంది పోలీస్ డిపార్ట్‌మెంట్.
దొరపురం వచ్చిన సత్య ఆ ప్రేతాత్మల మిస్టరీని ఎలా ఛేదించాడనేది మిగతా కథ. ఇక దెయ్యాల విచిత్ర చేష్టలవల్ల భయపడుతూ మధ్యలో కామెడీ కూడా చేస్తూ ఆ మిస్టరీని ఛేదించే ఎస్‌ఐగా శిబిరాజ్ ఓకే అనిపించాడు. అతనికి జోడీగా బిందుమాధవి పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలో కనిపించింది. సెకండాఫ్‌లో ఎంటర్‌అయ్యే సత్యరాజ్ క్యారెక్టర్‌కి ఎలాంటి ప్రత్యేకత లేదు. సెకండాఫ్‌లో కూడా అతను కనిపించే సీన్స్ తక్కువ. బాహుబలిలో కట్టప్పలాంటి శక్తివంతమైన క్యారెక్టర్‌కు పూర్తి భిన్నమైన, బలహీనమైన పాత్ర ఇది. క్యారెక్టర్‌పరంగాగానీ, పెర్ఫార్మెన్స్ పరంగాగానీ సత్యరాజ్ ఆడియన్స్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాడు.
టెక్నికల్ టీంలో సినిమాటోగ్రాఫర్ యువ, సంగీత దర్శకుడు సిద్ధార్ద్ విపిన్ సత్తా చూపలేకపోయారు. హార్రర్ సబ్జెక్టులో చూపించాల్సిన ఎక్స్‌ట్రార్డినరీ వర్క్ వీళ్లనుంచి రాలేదు. డైరెక్టర్ ధరణీధరన్ రెగ్యులర్‌గా వచ్చే హార్రర్ సినిమాలకు భిన్నంగా ఒక కొత్త కానె్సప్ట్, కొత్త బ్యాక్‌డ్రాప్ తీసుకొని వెరైటీగా చెయ్యాలనుకున్నా, అతని ప్రయత్నం ఫలించలేదు. పైగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఒక సాదాసీదా క్లైమాక్స్‌తో సినిమా ముగింపునకు రావడం నిరాశపర్చింది. ధరణి ఎంచుకున్న కథలోగానీ, కథనంలోగానీ కొత్తదనం లేదు సరికదా, భయపెట్టేందుకు చూపించిన సన్నివేశాలే పదే పదే చూపించడంతో భయం స్థానంలో ఆడియన్స్‌కు చిరాకు పుట్టింది. శశాంక్ వెనె్నలకంటి రాసిన సంభాషణల్లోనూ బలం లేదు. బాహుబలితో పాపులర్ అయిన కట్టప్ప ఈజ్ బ్యాక్ అంటూ పబ్లిసిటీలో సత్యరాజ్‌ని ఎక్కువగా వాడడం, పోస్టర్లను కూడా హాలీవుడ్ మూవీ రేంజ్‌లో డిజైన్ చేయించడంతో ఈ సినిమాపై కాస్తోకూస్తో ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కానీ, సినిమాలో అంత సీన్‌లేదనే విషయం తేలిపోయింది. ఎంచుకున్న కథ, దానికోసం తీసుకున్న బ్యాక్‌డ్రాప్ సినిమాకి ప్లస్ అవుతుందని డైరెక్టర్ అనుకున్నా -ట్రీట్‌మెంట్ లోపంతో అదే మైనస్ పాయింట్‌గా మిగిలింది. సత్యరాజ్ ప్రేతాత్మగా మారడానికి కారణమైన ఫ్లాష్‌బ్యాక్ కూడా పేలవంగా ఉంది. సినిమాను కాపాడాల్సిన దొర -తనను తనే రక్షించుకోలేకపోయాడు.

-త్రివేది