రివ్యూ

రోటీన్ ఆత్మల గోల ( బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఓ మైగాడ్

తారాగణం:
తనీష్, మేఘశ్రీ, పావని, అశిష్‌గాంధీ, విజయ్‌సాయి, సాయిప్రకాష్, జ్యోతి, జీవా తదితరులు.
సంగీతం: రాజ్‌కిరణ్
నిర్మాత:
వేణు ముక్కపాటి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వి శ్రీవాస్తవ్

‘కథ’అంటేనే కాళ్లూచేతులు లేనిదంటారు. మరి ఆ కథ అతీతశక్తుల జోడింపుతో తాళింపు వేసినదైతే దాని పోకడలకు అంతే ఉండదు. అలాంటి అంతులేని అర్ధరహిత మొగ్గవేసిన చిత్రమే ‘ఓమైగాడ్!’.
ఆదివారం.. అమావాస్య.. అర్ధరాత్రి జన్మించిన వ్యక్తిని -అంతకుముందు కోరికలు తీరకుండా చనిపోయిన వ్యక్తుల ఆత్మలు బాధిస్తాయి. అయితే ఇలాంటి సందర్భం నూటికోకోటికో ఒకరికి ప్రాప్తిస్తుంది. అలాంటి కోటిలో ఒక్కడు -ఆదిత్య (తనీష్). ఆ పరిస్థితిని ఆదిత్య ఎలా ఎదుర్కొన్నాడు. చివరకు ఆత్మల బారినుంచి విజయుడై, సాఫీగా జీవనం ఎలా సాగించాడన్నది మిగతా కథ. ఎక్స్‌ట్రా... అయితే ఇలాంటి అహేతుక సూత్రంలోనూ ఒక క్రమపద్ధతి పాటించలేదు. బోల్డన్ని దాటవేత సన్నివేశాలు. ఉదాహరణకు ఆదిత్య మిత్రబృందం కొన్ని సందర్భాల్లో ఆదిత్యకు మాత్రమే కన్పిస్తారు అన్నారు. ఆ ప్రకారం కథానాయిక మాలతి (మేఘశ్రీ) సోదరుడు వంశీకృష్ణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కనిపించడు. కానీ మిగతా వివిధ సందర్భాల్లో ఆదిత్యతోపాటు మిగతావారికీ కన్పిస్తారు. అలాగే ప్రథమార్థంలో రోహిత్, మాలతిల మధ్య ప్రేమ అంకురం, కొనసాగింపు, ఆత్మల కోరికల తీర్చడం ప్రక్రియలో రెడ్‌లైట్ ఏరియా సందర్శన తదితర సన్నివేశాలు విసుగుదలకు పరాకాష్టగా నిలిచాయి. పోనీ ఆ ఆత్మల ఆవహింపు, వేధింపులాంటివి కథలో చెప్పిన సూత్రం ప్రకారం ఆదిత్యకే పరిమితం కావాలి. కానీ ఎవరినిపడితే వారినావహించినట్టు చూపారు. ఇదంతా ఏదో సినిమా సీన్స్ నడపడానికే అన్పించాయి తప్ప వాటిలో పటిష్టత కన్పడలేదు. కానీ చిత్రదర్శకుడికి రచన, (దర్శకుడే రచయిత) మిగిలిన కొన్ని సందర్భాల్లో కనపరిచిన ప్రతిభనీ పక్కకు పెట్టలేం. అందుకు ఉదాహరణగా ‘దీనికి హేండిచ్చి దేన్నో హేండిల్ చేస్తున్నట్టున్నాడు’ లాంటి పంచ్ డైలాగులుని చెప్పుకోవచ్చు. హీరో పాత్రలో తనీష్ గత అతని చిత్రాల్లో కనపర్చని మెచ్యూరిటీ ఇందులో కనపర్చారు. కానీ ఆకారపరంగా ఆయన తగ్గాల్సి ఉంది. ముఖ్యంగా ‘అందమైన...’ పాటలో అతని స్థూలకాయం ఆకర్షణకు అవరోధంగా నిలిచింది. నాయిక పాత్రధారణ మేఘశ్రీ పరిధిమేరకు నటించింది. మిగిలిన పాత్రల్లో తాంత్రిక పాత్రధారి బాగా నటించారు. రోహిత్ వల్ల మోసపోయిన గీత (అప్పటికామె గర్భవతి) అతనివల్లే చనిపోతుంది. అలా అంతమైన గర్భస్థ శిశువే తిరిగి ఆదిత్య-మాలతి జంటకు పుట్టినట్టు చూపిన భావన బావుంది. పాటల్లో పతాక సన్నివేశంలో ‘కదిలిరా కదిలిరా కనకదుర్గమ్మ కదిలిరా...’ ఒక్కటే బాగుంది. కొన్నిచోట్ల రోషన్ సాలూరి అందించిన నేపథ్య సంగీతం ఓకే. ఇలాంటి తరహా చిత్రాల్లో కావల్సిన కెమేరా నైపుణ్యాన్ని ఛాయాగ్రాహకుడు రాజుతోట బాగా కనబర్చాడు. స్వతహాగా చక్కటి రచనాపాటవం ఉన్న ఈ చిత్ర దర్శకుడు శ్రీవాస్తవ్, వాస్తవ సమీప కథాంశాలను ఎంచుకుంటే విరుద్ధ ఫలితాలు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.

-అనే్వషి (anveshi)