రివ్యూ

పాయింట్ ఓకే.. కానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ..మేము

తారాగణం:
సూర్య, అమలాపాల్, బిందుమాధవి, రామ్‌దాస్, కార్తీక్‌కుమార్, విద్యాప్రదీప్
సంగీతం:
అర్రోల్ కారెల్లి
సినిమాటోగ్రఫీ:
బాలసుబ్రమణియన్
నిర్మాత:
జూలకంటి మధుసూదన్‌రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
పాండిరాజ్
**
సూర్య ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరో. ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలను వదిలిపెట్టడం లేదు. విభిన్నమైన సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సూర్య తనకు నచ్చిన సినిమాలకు నిర్మాతగానూ మారుతున్నాడు. లేటెస్ట్‌గా తమిళంలో హీరో సూర్య నిర్మించి, నటించిన తమిళ సినిమా పనంగ-2. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మేము’ పేరుతో విడుదలచేశారు. అమలాపాల్ హీరోయిన్‌గా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆకట్టుకుందో లేదో చూద్దాం.
కథ:
నవీన్, నైనా ..ఇద్దరు అతి చురుకైన అల్లరి పిల్లలు. వాళ్ళ అల్లరి చేష్టలతో అమ్మానాన్నలకు పెద్ద సమస్యగా మారుతారు. దీంతో వాళ్ళని దారిలో పెట్టాలన్న ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు ఆ పిల్లలిద్దరినీ బోర్డింగ్ స్కూలులో జాయిన్ చేస్తారు. అక్కడ కూడా వాళ్ళు అలాగే అల్లరి చేస్తూ ఒకరోజు అక్కడినుండి పారిపోతారు. దీంతో ఇక చేసేది లేక పిల్లల తల్లిదండ్రులు వాళ్ళను పిల్లల సైకియాట్రిస్ట్ అయిన సూర్యకు చూపిస్తారు. సూర్య కూడా ఆ పిల్లల్లో మార్పు తేవాలని నిర్ణయించుకుంటాడు. అలా సూర్య, అతని భార్య (అమలాపాల్) ఆ పిల్లల్ని ఎలా మార్చారు? వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చారు? అన్నదే అసలు కథ.
ఈ సినిమా విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు ఎంచుకున్న పాయింట్. నిజానికి ప్రస్తుతం సమాజంలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అన్న విషయాన్ని ప్రస్తావించడం, చర్చించడమే కానె్సప్ట్. అలాగే సమస్యలకు దర్శకుడు చూపిన పరిష్కారం కూడా బాగుంది. విభిన్నమైన సైకియాట్రిస్ట్ పాత్రను ఒప్పుకుని దాన్ని పోషించిన సూర్య ఈ సినిమాకి మరో పెద్ద అసెట్. ఆ పాత్రలో ఆయన నటన, పిల్లల సమస్యలను హ్యాండిల్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. అలాగే ముఖ్యమైన అల్లరి పిల్లల పాత్రలు పోషించిన ఇద్దరు పిల్లల నటన కూడా ఆకర్షణీయంగా ఉంది. ఇకపోతే పిల్లలవల్ల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా చాలా బాగా చూపించారు. పిల్లలవల్ల గందరగోళానికి గురయ్యే తల్లి పాత్రలో బిందుమాధవి నటన ఓకే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, చూపిన పరిష్కారం బాగానే ఉన్నా కథను నడిపిన విధానం మాత్రం చాలా నెమ్మదిగా ఉంది. సినిమా మొదటి భాగం మొత్తం రోజువారీ జీవితంలో తల్లిదండ్రులకు పిల్లలు తెచ్చిపెట్టే సమస్యలనే ప్రతిసారి చూపించడం బోరింగ్ అనిపిస్తుంది. సమస్యలను చూపడానికి ఎక్కువ టైమ్ తీసుకుని, చివరి 15 నిముషాల్లో హడావుడిగా పరిష్కారం చూపడం కరెక్ట్‌గా అనిపించదు. ఆడియన్‌కు ఇంట్రెస్టింగ్‌గా కనెక్ట్‌కాదు. సినిమా ఆద్యంతం నెమ్మదిగా సాగుతూ రెండవ భాగం మరీ బోర్‌కొట్టేలా ఉండటం పెద్ద మైనస్. ఇక కథనం నెమ్మదించి కీలక సన్నివేశాల్లో కొత్తదనం లోపించింది. సినిమా చాలావరకూ అమీర్‌ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్’ను పోలి ఉన్నట్టనిపించడం, పాటలూ అవీ లేకుండా చాలా తక్కువ సమయంలో అందంగా చెప్పాల్సిన కథను దర్శకుడు సాగదీసి ఎక్కువ సమయంలో చెప్పాడు.
ఇక సాంకేతికంగా చూస్తే.. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్రస్తుత విద్యావిధానం, వాటిలోని సమస్యలను చర్చించిన తీరు ఆసక్తికరం అనిపిస్తుంది. సంగీతం మాత్రం అంతగా మెప్పించలేదు. సినిమాలో కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతున్నట్టు అనిపించడంతో కథనం కొంచెం బోరింగ్. ఈరోజుల్లో పిల్లలు, తల్లిదండ్రులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే కీలక అంశాన్ని తీసుకుని దర్శకుడు పాండిరాజ్ చేసిన ప్రయత్నం ఒకే. కథను ఇంకాస్త క్రిస్పీగా చెప్పి ఉంటే ఆ ప్రయత్నం మరింతగా ఫలించేది.
చివరగా.. ఈరోజుల్లో తల్లిదండ్రులకు పిల్లలవల్ల ఎదురయ్యే సమస్యలను ఆధారంగాచేసుకుని వచ్చిన సినిమానే ‘మేము’. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. నెమ్మదించిన, ఊహాజనితమైన కథనాలను పక్కనబెడితే వాస్తవ జీవితంలో అలాంటి సమస్యలను ఎదుర్కొనే ప్రతి తల్లిదండ్రులకు ఈ కథ ఎమోషనల్‌గా కనెక్టవుతుంది, సందేహం లేదు.

-త్రివేది