రివ్యూ

మనసు కొల్లగొట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది.. సుల్తాన్

తారాగణం:
సల్మాన్‌ఖాన్, అనుష్క శర్మ, అమిత్ సాద్, కుముద్ మిశ్రా, రణ్‌దీప్ హూడా,
అనంత్ శర్మ తదితరులు
సంగీతం:
విశాల్-శంకర్
సినిమాటోగ్రఫీ:
అర్తుర్ జురావ్‌స్కీ
నిర్మాత:
యశ్‌రాజ్ ఫిల్మ్స్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
అలీ అబ్బాస్ జఫర్
**
రైల్వే ట్రాక్. గేటు పడింది. పట్టాలపై రైలు దూసుకెళ్తోంది. దానే్న చూస్తూ.. సుల్తాన్. ఆవల వైపు వెళ్లాలంటే- లేదా గమ్యం చేరాలంటే అదొక అడ్డంకి అనుకుంటే.. వేచి ఉండక తప్పదు. ఒక చిన్న సన్నివేశంలో -ఎంతో అర్థాన్ని చెబుతూ.. ఓ వస్తాదు జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో.. సల్మాన్‌ఖాన్ హర్డిల్‌ని దాటాడు అని చెప్పటం చిన్న మాట. హద్దుల్ని చెరిపేశాడు అనటం సబబు. అది అతడి నిజ జీవితంతో పోల్చి చూసినా. ఎన్నో వివాదాస్పద అంశాల్తో సతమతమవుతున్నప్పటికీ.. ‘్భజరంగీ భాయిజాన్’తోనూ.. ఆనక ‘సుల్తాన్’తోనూ అభిమానులకు మరింత చేరువయ్యాడు. ‘రేప్’ అన్న మాటతో వొకింత రిమార్క్‌ని మూట కట్టుకొన్నప్పటికీ.
కథ- హర్యానాలోని ఓ పల్లెటూరు. డిష్ టీవీ యాంటెన్నాలు బిగించటంలో నిమగ్నమై తన చుట్టూ పరిధి గీసుకుని అమాయకంగా బతికేస్తూన్న సుల్తాన్. ఓ అమ్మాయి ప్రేమని సాధించటం కోసం.. అందునా- మల్లయోధురాలైన ఆ అమ్మాయికి చేరువ కావటానికి.. కుస్తీ పట్లు నేర్చుకొంటూ ‘ప్రేమ’కై పరితపిస్తూంటాడు. అయతే- అతడి ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? కొన్నాళ్లుగా ఆ పల్లెటూరులో ఎందుకు ఉంటున్నాడు? అతడొక ఒలింపిక్ స్వర్ణపతక విజేత. కుస్తీ పోటీల్లో అతణ్ణి కొట్టేవాడే లేడు. అదీ అతడి గర్వం. విజయం అతడి తలకెక్కటంతో పతనం మొదలవుతుంది. ఆఖరికి అధఃపాతాళానికి వెళ్లిపోతాడు. ఈ సమయంలో అతడి జీవితంలోకి ప్రవేశించిన అమ్మాయి కోసం మళ్లీ గోదాలోకి దిగేందుకు సిద్ధమవుతాడు. ‘మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్’గా భావించే మల్లయుద్ధంతో పూర్వ ప్రాభవాన్ని తెచ్చుకోవాలన్న గ్రామస్థుల కోరిక మేరకు ‘బరి’లోకి దిగుతాడు. ఆ తర్వాత ఏమైందన్నది క్లైమాక్స్.
చూట్టానికి ఓ మేరుపర్వతంలా కనిపించిన సల్మాన్‌ఖాన్ -సినిమాని తన భుజస్కంధాలపై మోశాడు. అతగాడికి తగ్గట్టు మల్లయోధురాలిగా.. ప్రేమికురాలిగా డిఫరెంట్ షేడ్స్‌లో అనుష్క శర్మ కనిపించి మురిపించింది. కానె్సప్ట్ వినగానే.. ఇలాంటి కథలు ఎన్ని రాలేదూ అనిపిస్తుంది. కానీ- ఆ ఆలోచనే అస్సలు కనిపించదు. కొన్ని కథల్లో.. కథానాయకుడు మొక్కవోని దృఢచిత్తంతో విజయాన్ని సాధించటం.. ఆ ప్రక్రియలో అతడు ఎదుర్కొన్న సవాళ్లనూ చూశాం. ఇక- క్రీడల్లో ఏదో రూపేణా ‘అపవాదు’ని మూటగట్టుకొని జనం చేత ఛీత్కారాలూ.. విమర్శలు ఎదుర్కొని.. ఆ హర్డిల్స్‌ని దాటి విజేతగా గెలుపొందిన కథలూ ఉన్నాయి. ఇంచుమించుగా ఈ కథ కూడా అదే పంథాలో నడుస్తుంది. అయతే ముందువన్నీ క్రికెట్, హాకీ కానె్సప్ట్స్. అయతే- ఇది మల్లయుద్ధం. తెరకి అంతగా పరిచయం లేని సబ్జెక్ట్. దీంతో సహజంగానే ఉత్సుకత బయల్దేరుతుంది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి.. ఆ విజయగర్వంతో పతనస్థాయికి చేరుకొన్న ఓ వ్యక్తి.. తిరిగి ఎలా విజయం సాధించాడన్నది తెరపై చూడాల్సిందే. ‘ఊపర్ అల్లా.. నీచే ధర్తీ...’ అన్న మాటల్తో ప్రేక్షకుల్ని ‘గోదా’లోకి దింపేశాడు సల్మాన్.
కథ చాలా క్లియర్‌కట్‌గా ఉంటుంది. ఎక్కడా మలుపులుండవు. కథలో టెంపో తగ్గదు. ‘బరి’లోకి వెళ్తున్న ప్రతిసారీ తర్వాత ఏం జరగబోతోందన్న ‘ఎంగ్జయిటీ’ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ మాటకొస్తే.. ప్రత్యర్థిని పడగొట్టడానికి చప్పట్లు చరిచి ప్రోత్సహించే అనుభూతిని పొందుతాం. సల్మాన్ ఖాన్ మరోసారి తన పూర్తి సత్తాని చాటాడు. అనుష్క శర్మ విషయానికి వస్తే- మల్లయోధురాలిగా ఏం న్యాయం చేస్తుందన్న చిన్న అనుమానం వెంటాడుతూంటుంది. కానీ- ఆ పాత్రకి న్యాయం చేసి.. నటనాపరంగా మరిన్ని మార్కుల్ని కొట్టేసింది. పల్లెటూరి అందాలతో.. ప్రేక్షకులు తడిసి ముద్దవుతారు. అర్తుర్ ఫొటోగ్రఫీతో అలరించాడు. దీనికి నేపథ్య సంగీతం మరింత బలాన్నిచ్చి ఊపిరి బిగపట్టేలా చేసింది. సినిమాలో కొన్నికొన్ని సామాజిక అంశాల్ని జోడించినప్పటికీ.. కథ ఎక్కడా పక్కదారి పట్టలేదు. నటనాపరంగా- ప్రతి ఒక్కరికీ తమతమ పాత్రల పరిధిలో జీవించారు.

-బిఎనే్క