రివ్యూ

ఆకట్టుకోని ఆత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు.. నాయకి
**
తారాగణం:
‘సత్యం’ రాజేష్, త్రిష, గణేష్ వెంకట్రామన్, సుష్మా రాజ్, జయప్రకాష్, పూనమ్‌కౌర్, జీవా
సంగీతం:
రఘు కుంచె
నిర్మాతలు:
సాయకార్తీక్
సినిమాటోగ్రఫీ:
జగదీష్
నిర్మాతలు:
గిరిధర్, పద్మజ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
గోవి
**
‘నాయకి’ పోస్టర్ చూసిన ఎవరికైనా.. ‘వావ్’ ఈ సినిమా ఏదో వెరైటీగా ఉండేట్టుందే అనిపిస్తుంది. ఆ అనిపించటం వెనుక -సత్సంప్రదాయంగా నిండైన చీర కట్టు.. తలలో తట్టెడు మల్లెలు.. చూపుల్లో ప్రశాంతత -ఓ చేత్తో పూలసజ్జ.. మరోచేత్తో పదునైన కత్తితో దర్శనమిచ్చే త్రిష హొయలు. మరో పోస్టర్‌లో వొళ్లంతా రంగులతో.. వాడి ఐన చూపుల్తో కనిపించే నాయకి. ఇలాంటి వెరైటీ పోస్టర్లతో ప్రేక్షకుల్ని థియేటర్ వైపు మళ్లించే యత్నం వరకూ ఓకే. కానీ లోపలికెళ్లాక -ఓ ప్రేమకథా చిత్రమ్.. ఓ చిత్రం భళాలే విచిత్రం.. లాంటి కథల్తోపాటు మరిన్ని దెయ్యాలు ముసురుతాయి. ఇండస్ట్రీలో ‘ఆత్మ’లకి మినిమమ్ గ్యారంటీ ఉంటుంది ఏ రోజుల్లోనైనా. ఈ జోనర్‌లో లాజిక్‌లు పట్టవు. ఒకవేళ ఉన్నా ఎవరికీ అర్థంకావు. అంతగా లొకేషన్ల అవసరం లేదు. భయం తాలూకు నీలినీడలు తెరపై చూపెట్టగలిగితే -కథ ప్రస్తావన ఉండనక్కర్లేదు. మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో -కథని ఆ భుజస్కంధాలపై పెడితే.. చాలావరకూ నెట్టుకురావచ్చు. ఇదీ కథ తాలూకు లాజిక్. ‘లవ్ యు బంగారం’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ‘గోవి’ (గోవర్ధన్ రెడ్డి) ఈ చిత్రానికి సంబంధించినంత వరకూ ‘ఆత్మ’ కానె్సప్ట్‌ని బోలెడన్ని దెయ్యం చిత్రాల నుంచీ బహు జాగ్రత్తగా బట్వాడా చేసుకొన్నాడు. ఇదొక ‘ఆత్మ’ కథ
టీవీ ఛానెల్‌లో న్యూస్ రీడర్ వార్తలు చదువుతూంటుంది. అది 1980 ప్రాంతం. ప్రస్తుతానికి వస్తే.. టీవీ ఛానెల్‌లో అదే వార్త ప్రత్యక్ష ప్రసారం అవుతూంటుంది. దుండిగల్ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా అంతుతెలీని మిస్టరీ జనాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఆ ప్రాంతానికి వెళ్లిన వారు ఉన్నట్టుండి అదృశ్యమై పోతుంటారు. దీంతో ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించి.. అక్కడికి ఎవరూ వెళ్లకూడదని గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. దుండిగల్‌లోని పురాతన బంగ్లా దరిదాపులకి వెళ్లిన వారంతా ఓ ఆడ దెయ్యం పాలనపడి మరణిస్తున్నారన్నది సంచలన వార్త.
మరోవైపు డైరెక్టర్ సంజయ్ (సత్యం రాజేష్).. తనను ప్రేమించిన సంధ్య (సుష్మ రాజ్)ని మోసం చేసే ఉద్దేశంతో గెస్ట్‌హౌస్‌కి ఆమెని తీసుకెళ్తూండగా.. అనుకోని పరిస్థితుల్లో దుండిగల్ బంగ్లాకి చేరతారు. ఆ అంతఃపుర రహస్యం ఏమిటి? డైరెక్టర్ సంజయ్.. సంధ్య ఎదుర్కొన్న చేదు అనుభవాలేమిటి? చివరాఖరికి ‘ఆడ దెయ్యం’ ఆట కట్టించారా? లేక ఆ ఆత్మతోపాటే వీళ్లూ ఆత్మలయ్యారా? అన్నది క్లైమాక్స్.
‘దెయ్యం’ కథలకి ఎప్పుడూ మంచి రోజులే అన్న ఆలోచనతో కొనే్నళ్లుగా సంవత్సరానికి ఓ రెండు మూడు ‘దెయ్యాలు’ థియేటర్లలో ప్రత్యక్షమవుతూన్నాయి. కాకపోతే ‘ఆత్మ ఆత్మ’కి వెరైటీ లేకపోతే.. అది ఎంత భయపెట్టే దెయ్యమైనా.. ప్రేక్షకులు ఏమాత్రం భయపడరు. లాజిక్‌తో కొట్టేస్తారు. ఇంచుమించు ఇలాంటి కథలు వస్తూపోతూనే ఉన్నాయి. ఐనా.. ‘ఆత్మ’ మోజు తగ్గకపోవటం వరకూ ఓకె. కానీ- ఏళ్ల నాటి కథలే మళ్లీ తెరపైకి రావటంతో ‘వణుకు’ పుట్టదు సరికదా.. ‘నవ్వు’ పుడుతుంది. మరీ అంత ఫన్నీగా కథల్ని చుట్టేస్తారు. ఈ ‘నాయకి’ కూడా అలాంటిదే. కాకపోతే.. ఈ దయ్యానికి సినిమాల పిచ్చి. మొబైల్ కెమెరాలో చూస్తే మాత్రమే కనిపిస్తుంది. ఈ కానె్సప్ట్‌తో ‘ఆత్మ’ని బతికించటం కష్టం. ఇక్కడ అదే జరిగింది. కొన్నికొన్ని సన్నివేశాలు ఏవేవో చిత్రాల్ని జ్ఞప్తికి తేవటంతో.. ప్రేక్షకుడు ఉక్కిరిబిక్కిరవుతాడు. బంగ్లాలోకి ప్రవేశించేంతవరకూ బానే నడిచిన కథ అక్కడ్నుంచీ చతికిలపడి.. రొటీన్ బాదుడు మొదలైంది. హారర్ కామెడీ అనిపించుకోవాలని తెగ తాపత్రయ పడిన ‘గోవి’ చిత్రాతి చిత్రమైన సన్నివేశాలతో ముచ్చెమటలు పట్టించాడు. నాయకి.. డైరెక్టర్‌ల పరిచయంతో కొత్త పంథాకి శ్రీకారం చుట్టినప్పటికీ.. రాన్రాను ‘నాయకి’ పాతబడిపోయింది.
హారర్ కామెడీలో.. కామెడీ కడుపుబ్బ ఏడిపిస్తుంది. ఆపైన ‘ఆత్మ’ చేసే వికృత చేష్ఠలతో ‘దెయ్యాల’ పట్ల మనకి ఏమాత్రం అభిమానం ఉన్నా.. అది కాస్తా తుడిచిపెట్టుకు పోతుంది. ఫ్లాష్ బ్యాక్ వరకూ ఎలాగో ఓపిక పట్టినా.. ఆ తర్వాత మరో పావుగంట ఏడిపించటం చూస్తే ‘నాయకి’ ప్రేక్షకులపై ఎందుకింత ‘పగ’ పట్టిందో అర్థమవుతుంది.
‘నాయకి’ పాత్రలో త్రిష నటన బాగుంది. సత్యం రాజేష్‌కి ఈ సినిమా మరో ప్లస్ పాయింట్. సుష్మ రాజ్ జస్ట్ ఓకే. పూనమ్‌కౌర్, జయప్రకాష్, గణేష్ వెంకట్రామన్.. బ్రహ్మానందం ఏదో టైం బీయింగ్‌గా వచ్చి వెళ్తున్నట్టు ఉంటుంది తప్ప ఆయా పాత్రలకి అంత ప్రాధాన్యత ఉండదు.
రఘు కుంచె సంగీతం ఫర్వాలేదు. సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. ఈ సినిమా మరో ప్లస్ పాయింట్ -కెమెరా. జగదీష్ చీకటి హారర్ తాలూకు ఎఫెక్ట్స్‌ని అద్భుతంగా చిత్రీకరించాడు. ప్రతీ ఫ్రేమ్ చూడబుల్‌గా ఉంది. ఒకే బంగ్లాలో సన్నివేశాలన్నింటినీ కూర్చినప్పటికీ.. ప్రతి సన్నివేశంలోనూ కొత్తదనాన్ని చూపేందుకు ప్రయత్నించాడు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని మోసిన ‘గోవి’ తనవంతు కృషి చేశాడు. ఐతే- రొటీన్ స్క్రీన్‌ప్లే, రొటీన్ కథతో ఎంతకని లాక్కొస్తాడు.

-బిఎనే్క