రివ్యూ

పసలేని ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు..దండు
**
తారాగణం:
నీరజ్ శ్యామ్, దిశాపటానీ, నేహాసక్సేనా, తులసి, రఘుబాబు, సాయికుమార్, ఢిల్లీ రాజేశ్వరి, గౌతంరాజు, థ్రిల్లర్ మంజు.
సినిమాటోగ్రఫీ:
హరీష్ ఎస్ ఎన్
బ్యానర్:
యశస్వినీ ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం, దర్శకత్వం:
సంజీవ్ మేగోటి
**
దండు కట్టి పనిచేస్తే కొండలనైనా పిండి చేయొచ్చన్న మాట వినడానికి బానేవుంది. ఆ మాటని ఆచరణలో పెడితే ఇంకా బాగుంటుంది. కానీ దాన్ని సినిమాగా తీయాలనుకుంటే మాత్రం మంచి దండును ఏర్పాటు చేసుకుని, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం తదితర అంశాలపై పనిచేస్తే సార్థకత లభిస్తుంది. అలాకాకుండా అంతా ఒకటే చేతిమీద చేయాలంటే దండు మాటకి అర్ధం లేకుండాపోతుంది. పగ, ప్రతీకారాలకి సంబంధించిన కథలు అనేకం ఇప్పటికే చూసేశాం. అయితే దగాపడిన వాళ్లంతా దండుగట్టి అన్యాయంపై పోరాడటం అనేది మంచి మాటే. అదే దండు సినిమా.
కథేంటి:
రేవంత్ (నీరజ్‌శ్యామ్) ఆవేశపరుడు. కళ్లముందు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు. అతని తల్లి (తులసి) ఆస్పత్రిలో నర్సు. కొడుకు తెచ్చే గొడవలన్నీ గమనించిన ఆమె, కొడుకుకు లక్ష్యాన్ని ఏర్పరిచింది. తన జీవితంతో ఆడుకున్న భైరవుడు అనే ప్రతి నాయకుణ్ణి హతమార్చమంటుంది. అప్పటికే భైరవుడు ఊరిలో భయోత్పాతం సృష్టిస్తుంటాడు. అతని అకృత్యాలకు బలైన కుటుంబాలెన్నో ఆ ఊరిలో ఉన్నాయి. ఎవరూ అతనికి ఎదురుచెప్పలేని స్థితి. ఆ సమయంలో బాధితులను సమీకరించి, దండుకట్టి పోరాటం చేస్తాడు రేవంత్. విజయం సాధించాడా? లేదా? అనేది ముగింపు.
సినిమా ప్రారంభమైన అరగంట వరకూ ఏవేవో సన్నివేశాలు వచ్చిపోతుంటాయి. తొలి సన్నివేశం మాత్రం సినిమాలో ఏదో విషయం ఉందన్నట్టుగా చిత్రీకరించారు. తర్వాత హీరో వెనకపడే హీరోయిన్ చేష్టలు, దానికి హీరో తల్లి ఓదార్పులు, హీరోయిన్ తండ్రి పెడబొబ్బలతో అరగంట దాటిపోతుంది. తర్వాత లక్ష్యం ఏర్పర్చుకున్న హీరో ఏం చేస్తున్నాడో అర్థంకాని స్థితిలో శత్రువులతో పోరాడుతుంటాడు పరోక్షంగా. ఎవరో తనతో యుద్ధం చేస్తున్నారని అర్థం చేసుకున్న విలన్, వెతికే ప్రయత్నం చేస్తాడు. సెకండాఫ్‌లో విలన్ ముందుకొస్తాడు హీరో. హీరోకి తోడుగా పోలీస్ అధికారి సాయికుమార్. భైరవుణ్ణి కోర్టు మెట్లెక్కిస్తానని, శిక్షపడేలా చేస్తానని చెబుతూంటాడు. కానీ మూడు సన్నివేశాలకే ముగించేశారు. సినిమాలో మొదటి నుండి ఆర్‌ఆర్ ఇబ్బంది పెడుతుంది. పాత్రలు ఏం మాట్లాడుతున్నాయో అర్థంకాదు. ఆ సన్నివేశాలు, నటీనటుల హావభావాలనుబట్టి మాటలు అర్థం చేసుకోవాలి. నేపథ్య సంగీతం కొన్ని డైలాగులు అర్థంకాకుండా మింగేసింది. ఉండడానికి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. కానీ ఎవరికీ సరైన పాత్ర లేదు. వారికి నటించే స్కోప్ రాలేదు. కెమెరా పనితనం కూడా ఆకట్టుకునేలా లేదు. అన్ని సన్నివేశాలు డల్‌గా లైటింగ్ లేకుండా ఉంటాయి. పాటల్లో సాహిత్యం, సంగీతం హీనంగా ఉన్నా చిత్రీకరణ మాత్రం ఆకట్టుకుంటుంది. ఇలాంటి పగ, ప్రతీకారాల సినిమాలు తీసేప్పుడు కథనంలో మెరుపులుంటేనే ప్రేక్షకులు సీట్లల్లో కూర్చుంటారు. ఏమీ లేకుండా మొనాటనీగా సాగిపోతూ ఏం జరగబోతుందో ప్రేక్షకుడికి తెలిసిపోతే ఆ సినిమా చూసి వృధా. ఎద రగిలిన సైన్యం.. అన్న మాట ఆకట్టుకుంటుంది. వేశ్య నిజాయితీ, డ్రగ్స్ అమ్మకం లాంటి విషయాలను ఏదో ఉండాలి కాబట్టి, కొన్ని సన్నివేశాలు నడవాలి కనుక పెట్టినట్టుగా ఉంటుంది కానీ వాటిల్లో పట్టు ఏమీవుండదు. ఉన్నంతలో సాయికుమార్ కనిపించిన మూడు సన్నివేశాలే ఫరవాలేదనిపిస్తాయి. దండుకట్టిన నటీనటుల్లో ఒక్కరూ సరైన నటన ప్రదర్శించలేకపోయారు. ఇక కథ, రచన, సంగీతం అన్నీ తానై రూపొందించిన దర్శకుడు, సన్నివేశాల చిత్రీకరణలో ఎటువంటి నేర్పును చూపలేకపోయారు. నీరజ్‌శ్యామ్ చూడటానికి బాగానే ఉన్నా నటనలో తేలిపోయాడు. ఒక్క తులసి పాత్రే ఫరవాలేదనిపిస్తుంది. మిగతా సినిమా అంతా బోర్‌గా సాగింది.

-తిలక్