రివ్యూ

స్పూఫ్‌లో చిక్కుకున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు..సెల్ఫీ రాజా
**
తారాగణం:
అల్లరి నరేష్, సాక్షిచౌదరి, కామ్నరనౌత్, పృథ్వి, షకలక శంకర్, రమేష్ తదితరులు.
సంగీతం:
సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ:
ఎస్ లోకనాథన్
నిర్మాత:
చలసాని రామబ్రహ్మం చౌదరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
జి ఈశ్వర్‌రెడ్డి
**
‘సుడిగాడు’ సినిమా తరువాత పాపం అల్లరి నరేష్‌కి ఒక్కటీ సరైన సినిమా పడటం లేదు. ఆ సినిమా తరువాత ఇప్పటికే ఏడెనిమిది సినిమాలు చేసినా ఏమాత్రం లాభం లేకపోయింది. కమర్షియల్ విజయం మాత్రం అతనితో దోబూచులాడుతోంది. మళ్ళీ విజయం కోసం సెల్ఫీరాజా అవతారం ఎత్తాడు నరేష్. ఈమధ్య సెల్ఫీ ఫోబియా బాగా ఎక్కువ కావడంతో ఆ కథనాన్ని ఎంచుకున్నాడు. జి ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో గోపి ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన సెల్ఫీరాజా జనాన్ని ఎలా ఆకట్టుకున్నాడో చూద్దాం.
కథ:
సెల్ఫీరాజా (అల్లరి నరేష్) సరదగా కాలం వెళ్ళదీసే యువకుడు. సిటీ కమిషనర్ కూతురుని (కామ్నరనౌత్) ప్రేమించి పెళ్ళి చేసుకున్న అతనికి నోటి దురుసువల్ల ఎప్పుడూ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నోటి దురుసువల్లే భార్య కూడా సెల్ఫీ రాజాకు దూరమవుతుంది. ఈక్రమంలో మరే దిక్కూ లేక సెల్ఫీరాజా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. తనని కాల్చి చంపమని ఓ క్రిమినల్ (రవిబాబు)ని కోరతాడు. అయితే ఆ క్రిమినల్ మాత్రం సెల్ఫీరాజాను చంపకుండా వేరే పెద్ద ప్లాన్ గీస్తాడు. ఆ ప్లాన్ ఏంటి? తర్వాత ఈ కథ ఏయే మలుపులు తిరిగిందీ? అన్నదే అసలు సినిమా.
ఇక అల్లరి నరేష్ కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. తన కామిక్ రోల్‌లో అల్లరి నరేష్ శక్తిమేర నటించాడు. గత కొద్దికాలంగా ప్రయోగాలు చేస్తూ వస్తోన్న నరేష్, ఈ సినిమాలో తన స్టైల్ అయిన స్పూఫ్ కామెడీని మళ్ళీ తెరపైకి తెచ్చాడు. స్పూఫ్ కామెడీ అందరినీ బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. కమెడియన్ పృథ్వీతో చేయించిన స్పూఫ్స్ కూడా నవ్విస్తాయి. ఫస్ట్ఫా సినిమాకు మంచి అనుకూలాంశమే. ఈ సమయంలో కథ మంచి ఫ్లోతో నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో కామెడీ ఓ హైలైట్. హీరోయిన్ కామ్నరనౌత్ మొదటి సినిమా అయినా ఫరవాలేదనిపించింది. కమెడియన్ షకలక శంకర్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి విషయానికి వస్తే, ఒక కామెడీ సినిమానుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో వాటిని అందించలేకపోయాడని చెప్పాలి. పూర్తిస్థాయి కామెడీకి సరిపడే కథ ఉన్నా, సినిమాలో అనవసర సన్నివేశాలు, పాటలను జోడించి బోర్ కొట్టించాడు. ఇదే కామెడీ కథను ఇంకొంచెం శ్రద్ధగా నవ్వించే సన్నివేశాలతో రాసుకునివుంటే సెల్ఫీరాజా పరిస్థితి మరోలా ఉండేదే. సాయికార్తీక్ సమకూర్చిన సంగీతం బాగున్నా పాటలన్నీ అసందర్భంగా వచ్చి ఇబ్బందిపెట్టాయి. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం బాగున్నాయి.
అల్లరి నరేష్ సినిమా అంటే ఏస్థాయి కామెడీ ఊహిస్తామో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు వచ్చిన ‘సెల్ఫీరాజా’ కూడా అదే కోవలో మెప్పిస్తుందనుకొని వెళ్తే అనుకున్నంత స్థాయిలో మెప్పించదనే చెప్పాలి. అయితే అల్లరి నరేష్ మార్క్ కామెడీ టైమింగ్, కొన్నిచోట్ల బాగా నవ్వించే స్పూఫ్‌ల కోసం చూస్తే మాత్రం ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా కాకున్నా స్పూఫ్‌లతో అక్కడక్కడా నవ్వించాడు. ఫస్ట్ఫా తర్వాత సినిమా అంతా దారితప్పేసింది. అనవసర సన్నివేశాలు, పాత్రలు వచ్చేస్తుండటంతో అర్థంలేని ఎడిసోడ్లు తయారయ్యాయి. రవిబాబు పాత్రకు సరైన స్పష్టతనివ్వలేదు. ఆ పాత్రను కథలో జొప్పించిన విధానం కూడా కనెక్టివ్‌గా ఉండదు. సెకండాఫ్‌లో వరుసగా వచ్చే పాటలు ఇబ్బందిపెట్టాయి. సినిమా ఫ్లోను పాటలు పూర్తిగా ఆపేశాయి. కామెడీ కథకు సరిపడే అవకాశం ఉన్న కథనే అనవసరమైన మలుపులు తిప్పి, అర్థంలేని కామెడీ ట్రాక్‌లు జతచేసి సినిమాను ట్రాక్ మార్చేసారు.

-త్రివేది